కెనడా రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయుల సజీవ దహనం
కెనడాలోని టొరంటో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కెనడాలోని టొరంటో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్‌లోని గోద్రాకు చెందిన కేతా గోహిల్ (30), ఆమె సోదరుడు నిల్‌రాజ్ గోహిల్ (26)గా గుర్తించారు. కేతబా ఆరేళ్ల క్రితం కెనడాకు వెళ్లి అక్కడ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. నీల్‌రాజ్ జనవరిలో కెనడా వెళ్లారు. అక్కడే చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. చనిపోయిన మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. కారు ప్రమాదాన్ని చూసిన బైకర్ కారు అద్దాలు పగలగొట్టి ఒక మహిళను మాత్రం కాపాడగలిగారు. గాయపడ్డ ఆమెను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బ్రాంప్‌టన్‌లో ఉంటున్న వీరు రాత్రి భోజనం ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో ఈ కారును ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? లేక వీరు టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ మోడల్ కారులో ప్రయాణిస్తున్నారా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కాగా మృతదేహాలను చివరి చూపు కోసం స్వదేశానికి పంపాలని మృతుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కోరుతున్నారు.