
బోండీ బీచ్ లో నివాళులు అర్పిస్తున్న బాధితులు
బోండీ బీచ్ విషాదం: ఉగ్రదాడికి పాల్పడింది తండ్రీ కొడుకులే
వినోదం పేరిట లైసెన్స్ తీసుకున్న తండ్రి
యూదుల పవిత్ర పండగ హనుక్కా సందర్భంగా ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో సేద తీరుతున్న టూరిస్టులపై ఉగ్రవాద దాడి చేసింది తండ్రీ కొడుకులుగా పోలీసులు గుర్తించారు.
వారిలో ఒకరు నవీద్ అక్రమ్ అని, అతడు పాక్ జాతీయుడని సమాచారం ఉంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అమెరికా అధికారులు నవీద్ అక్రమ్ గురించి పూర్తి సమాచారం బయటకు వెల్లడించారని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.
చికిత్స పొందుతున్న నవీద్ అక్రమ్..
పోలీసులు కాల్చి చంపిన 50 ఏళ్ల తండ్రీ పేరు ఇంకా నిర్ధారణ కాలేదని, అక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ విలేకరులతో చెప్పారు.
‘‘అతని వైద్య పరిస్థితి బానే ఉంది. నిందితుడిపై క్రిమినల్ ఆరోపణలు నమోదు అయ్యే అవకాశం ఉంది’’ అని లాన్యన్ ఆదివారం అన్నారు. ఈ సంఘటన వెనక ముగ్గురు నిందితులు ఉన్నారని మూడో వ్యక్తి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఇది రూఢీ కాలేదని మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయని చెప్పారు.
తండ్రి లైసెన్స్..
చనిపోయిన వ్యక్తి ఇంకా తండ్రిగా గుర్తించారని, అతని పేరు మీదనే తుపాకీ లైసెన్స్ ఉందని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి.
నేరం జరిగిన స్థలం నుంచి నిందితుడి లైసెన్స్ పొందిన ఆరు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, తండ్రికి దాదాపు పది సంవత్సరాల తుపాకీ అనుభవం ఉందని లాన్యన్ అన్నారు.
నిందితుడు వినోదం, వేట నెపంతో తుపాకీ లైసెన్స్ పొందాడని, స్థానిక గన్ క్లబ్ లో సభ్యుడని కూడా తేలింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వారి వాహనాల నుంచి ఒకదాని నుంచి ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ‘‘ఈ దాడిలో వెనక ఉన్న ఉద్దేశ్యాలను మేము పరిశీలిస్తున్నాము. దర్యాప్తులో భాగంగా ఇది ముఖ్యమైనదని నేను భావిస్తున్నాము’’ అని లాన్యన్ అన్నారు.
నిన్న ఘోరం..
ఆదివారం సిడ్నీలోని బోండీ బీచ్ లో కాల్పులు జరిగినప్పుడూ దాదాపు వేయి మందికి పైగా ప్రజలు ఉన్నారు. వారిలో దాదాపుగా ఎక్కువమంది యూదులు. ఈ కాల్పుల్లో 16 మంది టూరిస్టులు మరణించారు.
ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు ఖండించాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ మాట్లాడుతూ.. ‘‘హనుక్కా మొదటి రోజున ముష్కరులు ఉద్దేశపూర్వకంగా యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారు’’ అని చెప్పారు.
ప్రసిద్ద బీచ్ వద్ద జరిగిన ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు, ముగ్గురు పిల్లలు సహ 40 మంది గాయపడ్డారని ఆసీస్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 43 ఏళ్ల పండ్ల వ్యాపారీ అహ్మద్ అల్ అహ్మద్ కూడా ఉన్నాడు. దాడి చేసిన వారిలో ఒకరిని ఎదుర్కొని తుపాకీని దోచుకున్న తరువాత అతనిపై కాల్పులు జరిగాయని ఫ్రాన్స్ ప్రెస్ తెలిపింది.
సోషల్ మీడియాలో షేర్ చేయబడిన పుటేజ్ లో బోండీ బీచ్ కు సమాంతరంగా వెళ్లే ప్రధాన రహదారి అయిన క్యాంప్ బెల్ పరేడ్ లో ఆగి ఉన్న కారు వెనక నుంచి అల్ అహ్మద్ బయటకు వస్తున్నట్లు కాల్పులు జరిగిన క్షణాల్లో అనుమానితులను ఎదుర్కొని అతనిని నిరాయుధులను చేసినట్లు చూపించారు.
ఆదివారం వైట్ హౌజ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అల్ అహ్మద్ చర్యలు.. ‘‘చాలామంది ప్రాణాలను కాపాడాయి’’ అని అన్నారు.
Next Story

