యూఎస్ఏతో ఎఫ్ టీఏ వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం : జీటీఆర్ఐ
x
అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్

యూఎస్ఏతో ఎఫ్ టీఏ వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం : జీటీఆర్ఐ

ప్రత్యామ్నాయంగా చైనా, యూకే, యూరప్, కెనడాతో వాణిజ్య గొలుసులు బలోపేతం చేసుకోవాలని సూచన


వ్యవసాయం, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి దేశీయ రంగాలకు ట్రంప్ విధించే సుంకాలు సవాళ్లు విసిరే ప్రమాదం ఉందని, అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై చర్చలు జరిపే అంశాన్ని పున: పరిశీలించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) గురువారం తెలిపింది.

అమెరికాతో వాణిజ్యం ఒప్పందం వల్ల భారత రైతులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కనీస మద్దతు ధర వ్యవస్థను బలహీనపరచడం, జన్యుపరంగా మార్పు చేసిన ఆహార దిగుమతులను అనుమతించడం వలన అమెరికన్ ఈ కామర్స్ దిగ్గజాలకు నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి అనుమతించడం వంటి వాషింగ్టన్ డిమాండ్లలో చాలా వరకూ ప్రమాదాలు కలిగిస్తాయని హెచ్చరించింది.
ఈ ఒప్పందం వలన రైతుల ఆదాయాలు, ఆహార భద్రత, జీవ వైవిధ్యం, ప్రజారోగ్యం, చిన్నవ్యాపారుల మనుగడకు హనీ జరుగుతుందని జీటీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘వ్యవసాయ వస్తువులపై సుంకాలను తగ్గించడం వల్ల వందల మిలియన్ల మంది జీవనోపాధిపై ప్రభావం చూపవచ్చు. కార్లపై సుంకాలు తగ్గించడం వల్ల దేశ తయారీ ఉత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతు వాటా కలిగిన ఆ నష్టం దాదాపు నష్టం అపారంగా ఉంటుంది.
1990 లో ఆసీస్ కార్ల పరిశ్రమకు ఇలాగే జరిగింది’’ అని గుర్తు చేసింది. వెంటనే అమెరికాతో ఎఫ్ టీఏ ఒప్పందాన్ని నివారించాలని కోరింది. వాషింగ్టన్ తో జరిగే ఈ ఒప్పందం వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
రసాయనాలు, యంత్రాలు, ఎలక్ట్రానిక్ వంటి రంగాలలో చైనా తో వ్యాపారం చేయాలని సూచించింది. అమెరికాకు ఏకపక్ష రాయితీలు ఇవ్వవద్దని కోరింది. కెనడా, యూరోప్, యూకేతో వాణిజ్యం నెరిపి లోటును పూడ్చుకోవచ్చని సూచించింది.
90 రోజుల పాటు నిలిపివేత
ప్రపంచ మార్కెట్ మాంద్యాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల అమలుకు 90 రోజుల గడువు ప్రకటించారు. అయితే ఈ గడువు చైనాకు వర్తించదని స్ఫష్టం చేశారు.
చైనాపై 125 శాతం ప్రతీకార సుంకాలను ఆయన విధించారు. ప్రపంచంతో జరుగుతున్న వాణిజ్య యుద్దాన్ని, ఇప్పుడు ట్రంప్ కేవలం చైనా- అమెరికా వాణిజ్య యుద్దంగా మార్చాడు.
తాజాగా ట్రంప్ ప్రకటన తరువాత ఎస్ అండ్ పీ 500 స్టాక్ ఇండెక్స్ దాదాపు 7 శాతం పెరిగింది. తమ దేశంతో దాదాపు 75 దేశాలు చర్చలు జరపడానికి సిద్దంగా ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
‘‘ 75 కంటే ఎక్కువ దేశాలు వాణిజ్యం కోసం చర్చల కోసం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించి అర్థవంతమైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవడంతో నేను 90 రోజల విరామం ప్రకటిస్తున్నారు.
ఈ కాలంలో అన్ని దేశాలపై 10 శాతం సుంకాలు మాత్రం విధిస్తామని చెప్పారు. ఈ రెసిప్రొకల్ టారిఫ్ ను ఇలాగే కొనసాగిస్తాం’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ లో రాసుకొచ్చారు.
శనివారం నుంచి ఈ పదిశాతం సుంకాలు అమల్లోకి వస్తాయని, యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ నిర్ణయించిన 20 శాతం సుంకం, జపాన్ నుంచి దిగుమతులపై 24 శాతం, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించారు.
మార్కెట్ పై ప్రభావం..
ట్రంప్ ప్రకటించిన సుంకాలు అమల్లోకి వస్తాయనే భయంతో చాలా దేశాల మార్కెట్లు గజగజలాడాయి. ట్రంప్ విధానాల వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని చాలామంది సీఈఓలు అంచనాకు వచ్చారు.
ట్రంప్ వ్యూహాలతో భాగంగా సుంకాలపై వెనక్కి తగ్గారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్ తన కోసం గరిష్ట చర్చల పరపతిని సృష్టించుకున్నారు’’ అని ఆమె అన్నారు. కానీ ట్రంప్ చర్యకు కొన్ని వారాల ముందు నుంచి మార్కెట్ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.
ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారులు..
ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ప్రభుత్వ బాండ్ల ధరలు తగ్గుతూ వచ్చాయి. దీనితో పది సంవత్సరాల యూఎస్ ట్రెజరీ నోట్ పై వడ్డీరేట్ 4.45 శాతానికి పెరిగింది. ట్రంప్ నిర్ణయంతో వెనక్కి తగ్గడంతో ఆ తరువాత రేటు తగ్గింది.
వాణిజ్య వివాదాల్లో ఒక ఒప్పందాన్ని మార్కెట్లు కోరుకుంటున్నాయని ప్రకటనకు ముందు టీడీ సెక్యూరిటీస్ లో యూఎస్ రేట్ల వ్యూహాం అధిపతి గెన్నాడి గోల్డ్ బర్గ్ అన్నారు. ఇది కేవలం ట్రెజరీ మార్కెట్ మాత్రమే కాకుండా, వాణిజ్య తగ్గింపు రాబోతుందనే సంకేతాల కోసం చూస్తున్నాయని అన్నారు.
చర్చలు జరపడం, సుంకాలు నిలిపివేయడం అర్థవంతమైన చర్య అని కన్సల్టెన్సీ ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ లో ప్రధాన విశ్లేషకుడు జాన్ కెనవన్ పేర్కొన్నారు.
Read More
Next Story