ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచి నిధులు
x
ఖలిస్తానీ ఉగ్రవాదుల జెండా

ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచి నిధులు

అంగీకరించిన మార్క్ కార్నీ ప్రభుత్వం


ఖలిస్తానీలను కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా అభివర్ణించింది. ఈ గ్రూపులతో ముడిపడి ఉన్న ఉగ్రవాద నిధుల ప్రవాహంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ మార్పు సంభవించింది.

ఖలీస్థానీ ఉగ్రవాదులకు ఎక్కువ నిధులు కెనడా నుంచే వస్తున్నాయని, ఆ ఉగ్రవాద సంస్థకు దేశంలోనే ఆర్థిక సాయం అందుతోందని దానిని అవి అనుచిత పనుల కోసం ఉపయోగించుకుంటున్నాయని కెనడా ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.

కెనడాలో ఖలీస్తానీ ఉనికికి సంబంధించిన వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వీడియో నివేదికల ద్వారా కేసులు నమోదు చేసినప్పటికీ వారిపై అక్కడ పరిమిత చర్యలు మాత్రమే తీసుకున్నారు.

కెనడియన్ ఆర్థిక శాఖ..
కెనడా ఆర్థిక శాఖ విడుదల చేసిన 2025 అసెస్ మెంట్ ఆఫ్ మనీలాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్ ఇన్ కెనడా అనే ప్రభుత్వ నివేదికలో ఈ విషయాలు భాగంగా ఉన్నాయి.
నివేదిక ప్రకారం.. బజ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ వంటి సంస్థలు కెనడా నుంచి ఎక్కువగా నిధులు పొందాయి. సిక్కు తీవ్రవాదులకు నిధులు తమ దేశం నుంచే వస్తున్నాయని మొదటిసారిగా అట్టవా అంగీకరించింది. ‘‘రాజకీయ ప్రేరేపిత హింసకు సంబంధించిన కార్యకలాపాలకు’’ కెనడా నుంచి డబ్బును పొందుతున్నారని పేర్కొంది.
‘‘కెనడాలో క్రిమినల్ కోడ్ కింద జాబితా చేయబడిన అనేక ఉగ్రవాద సంస్థలు రాజకీయంగా ప్రేరేపించబడిన హింసాత్మక తీవ్రవాద వర్గంలోకి వస్తాయి. హమాస్, హిజ్బుల్లా, ఖలీస్తానీ తీవ్రవాద గ్రూపులు అయిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ వంటివి కెనడా నుంచి ఆర్థిక సాయం పొందుతున్నాయని నిఘా సంస్థలు గమనించాయి’’ అని నివేదిక పేర్కొంది.
నిధులన్నీ కెనడా నుంచే..
‘‘భారత్ లోని పంజాబ్ లో స్వతంత్య్ర దేశాన్ని స్థాపించడానికి ఖలీస్తానీ తీవ్రవాద గ్రూపులు హింసాత్మక మార్గాలను అనుసరిస్తున్నాయి’’ అని కెనడా ప్రభుత్వ నివేదిక పేర్కొంది. కెనడాతో సహ అనేక దేశాలలో ఈ సంస్థలు నిధులు సేకరిస్తుందనే అనుమానం ఉందని కూడా నివేదిక పేర్కొంది.
ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించే ఫైనాన్సింగ్ నెట్ వర్క్ లను ఈ నివేదిక ప్రస్తావించింది. వారు తమ కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడానికి లాభాపేక్ష లేని సంస్థలు, ఇతర మార్గాలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొంది.
ఇందులో దాతృత్వ విరాళాలను దుర్వినియోగం చేయడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొనడం, వాహానాల దొంగతనాలు కూడా ఉన్నాయి. కెనడా ఉగ్రవాద నిధులకు అడ్డా మారింది.
‘‘ఈ గ్రూపులు గతంలో కెనడాలో విస్తృతమైన నిధుల సేకరణ నెట్ వర్క్ ను అభివృద్ది చేసుకుంది. కానీ ఇప్పుడూ ఈ లక్ష్యానికి అనుగుణంగా విధేయత కలిగిన వ్యక్తుల చిన్న సమూహాలు కూడా చేరినట్లు కనిపిస్తోంది. కానీ ఒక నిర్ధిష్ట సమూహంతో కూడా ఎక్కడా ప్రత్యేక బంధం పెట్టుకోలేదు’’ అని నివేదిక పేర్కొంది.
విభిన్న నిధుల పద్దతులు..
ఈ ఉగ్రవాద గ్రూపులు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి విభిన్న నిధుల పద్దతులను ఉపయోగిస్తున్నాయని వాటిలో ఎంఎస్బీ బ్యాంకింగ్ రంగాల దుర్వినియోగం, క్రిప్టో కరెన్సీల వాడకం, రాష్ట్ర నిధులు, దాతృత్వ, ఎన్పీఓ రంగ దుర్వినియోగం, నేర కార్యకలాపాలు ఉన్నాయని నివేదిక ప్రస్తావించింది.
‘‘హమాస్, హిజ్బుల్లా ఉపయోగించే ఫైనాన్సింగ్ నెట్ వర్క్ తరహాలో ధార్మిక ఎన్పీఓ రంగాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఖలీస్తానీ హింసాత్మక తీవ్రవాద గ్రూపులు డయాస్పోరా కమ్యూనిటీ నుంచి విరాళాలను సేకరించడానికి, నిధులను తరలించడానికి నెట్ వర్క్ లను ఉపయోగిస్తున్నట్లు కూడా తెలిసింది’’ అని నివేదిక లో పేర్కొన్నారు.
కెనడియన్ ఎన్పీఓలు సాధారణంగా మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల కోసం కనీస నష్టాలను కలిగి ఉన్నాయని, ఉగ్రవాద నిధుల దుర్వినియోగానికి గురయ్యే కార్యకలాపాలను చేపట్టే ఒక చిన్న సబ్ గ్రూప్ మాత్రమే’’ అని క్షుణ్ణంగా పేర్కొంది. ఈ ప్రమాదాలను ఒక్కొక్క కేసు ఆధారంగా అంచనా వేయాలని కెనడియన్ ప్రభుత్వానికి నివేదిక సిఫార్సు చేసింది.
Read More
Next Story