భూమి మీద నరకం ఉందంటే.. అది ‘గాజానే’: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
x
who cheif Tedros

భూమి మీద నరకం ఉందంటే.. అది ‘గాజానే’: డబ్ల్యూహెచ్ఓ చీఫ్

ఈ భూమి మీద నరకం అనేది ఉందంటే అది గాజానే అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)చీఫ్ టెడ్రోస్ అథనామన్(Tedros Adhanom) ఆవేదన వ్యక్తం చేశారు.


వెంటనే యుద్దాన్ని ఆపాలని కోరారు. ఇప్పటి వరకూ యుద్దంలో దాదాపు 20 వేల మంది పాలస్తీనియన్లు మరణించారని, అందులో సగం కంటే ఎక్కువ మంది చిన్నపిల్లలు, మహిళలే ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భూమి మీద మానవత్వమే సంక్షోభంలో పడేలా చేస్తున్నారని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నేను ఇప్పటికే చాలా సార్లు అంకెలు మర్చిపోయాను, గాజాలో సంక్షోభం మరింత ముదరకూడదు అని కోరుకుంటున్నాను.. కానీ దుర్మార్గాలు మాత్రం ఇంక కొనసాగుతూనే ఉన్నాయి’ అని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేశారు.

సగటున రోజుకు దాదాపు 300 మంది పాలస్తీనా ప్రజలు యుద్దంలో చంపబడుతున్నారు. వీరంతా కేవలం మూడు నెలల్లోనే మృత్యుముఖంలోకి చేరారు. చనిపోయిన వారే కాక మరో 52,000 వేల మంది క్షతగాత్రులై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

గాజాలో యుద్దానికంటే ముందు 36 ఆస్పత్రులు పనిచేస్తూ ఉండేవి. వాటిలో ప్రస్తుతం 9 మాత్రమే పని చేస్తున్నాయి. అవి కూడా పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా మాత్రమే విధుల్లో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

చాలా మంది పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు ఇజ్రాయెల్ జరిపిన మారణహోమంలో బూడిదగా మారడంతో వారి ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. మరోవైపు నిత్యవసరాలు కొరత కూడా పాలస్తీనా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఆకలి, వ్యాధులకు సరైన వైద్యసదుపాయం అందకపోవడం, పారిశుద్ధ్య లేమి, ఎక్కడికక్కడ శిథిల భవనాలు స్థానిక ప్రజలు, పిల్లలకు మానసిక వైకల్యం సోకడానికి అవకాశం ఉంటుందని వెంటనే యుద్ద విరమణ చేయలని డిమాండ్ చేశారు.

గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం అక్టోబర్ 7 నుంచి గాజాలలో ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిదాడిలో 8000 మంది పిల్లలు, 6200 మంది మహిళలు సహ 20000 మంది పాలస్తీయన్ ప్రజలు మరణించారు. వీరు కాక 52,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవే కాకుండా భవనాల శిథిలాల్లో చిక్కుకుని ఆచూకీ దొరకని వారి లెక్కలు కలుపుకుంటే ఇవి మరింత పెరుగుతాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటోంది.

ఉత్తరం టూ దక్షిణం

తమపై దాడి చేసి వెయి మందికి పైగా సామాన్య ప్రజలను చంపి, రెండు వందల మంది సామాన్యులను బందీలుగా పట్టుకెళ్లిన హామాస్ ను అంతం చేస్తామని ఇజ్రాయెట్ ప్రతిజ్ఞ చేసింది. అందుకోసం దక్షిణ గాజా పై ప్రతిదాడులు మొదలుపెట్టింది. అందుకోసం ప్రజలకు ఇళ్ల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

తరువాత ఉత్తర గాజా నుంచి సైతం పాలస్తీనా వాసులు వెళ్లిపోవాలని కోరింది. ఇప్పటి వరకూ వందలాది హామాస్ ఉగ్రవాదులను హతం చేసింది. వారి సొరంగ నెట్వర్క్ లను సైతం ధ్వంసం చేస్తోంది. వాటిలో సముద్రపు నీటిని నింపడం ప్రారంభించింది.

రెండు రోజుల క్రితం ఏకంగా నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న అతి పెద్ద సొరంగాన్ని కనిపెట్టింది. అది హామాస్ అగ్రనేతలు ఉపయోగించే ప్రధాన మార్గంగా ప్రకటించింది. అందులో ఏకంగా కార్లు వెళ్లడానికి వీలు ఉండడం గమనార్హం. కాగా ఇప్పటి వరకూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ 139 మంది సైనికులను యుద్ధంలో కోల్పోయింది.

Read More
Next Story