ఆయుధాలు వదిలేస్తామని హమాస్ ప్రకటన.. కానీ మీరు దానికి..
x

ఆయుధాలు వదిలేస్తామని హమాస్ ప్రకటన.. కానీ మీరు దానికి..

తాము ఆయుధాలు వదిలేయడానికి సిద్ధం అని ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రకటించింది. అయితే దానికి ఇజ్రాయెల్ మేము పెట్టే ఒక షరతుకు అంగీకరించాలని కోరింది.


ఉగ్రవాద సంస్థ హమాస్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ప్రస్తుతం కొనసాగిస్తున్న యుద్దాన్ని ఆపివేసి, పాలస్తీనా దేశాన్ని అంగీకరిస్తే ఆయుధాలు వదిలేస్తామని హమీ ఇచ్చింది. హమాస్ కు సంబంధించిన కీలక నేత ఖలీల్ అల్ హయ్యా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు.

యుద్దం ముగిశాక హామాస్ రాజకీయ పార్టీగా మారుతుందని చెప్పారు. అయితే స్వత్రంత్య పాలస్తీనా సరిహద్దు 1967 నాటి ఒప్పందానికి అనుకూలంగా ఉండాలని అన్నారు. ఇజ్రాయెల్ తో నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని చేస్తున్న చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించనటువంటి సందర్భంలో ఖలీల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇజ్రాయెల్ ఇప్పటి వరకూ చేసిన యుద్ధంలో కనీసం 20 శాతం హమాస్ సంస్థను నాశనం చేయలేకపోయారని ఖలీల్ అన్నారు. యుద్దం కొనసాగుతుండగానే బందీలను విడుదల చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పాలస్తీనా నేత ఫతా వర్గం నేతృత్వంలోని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో హమాస్ చేరాలని కోరుకుంటున్నట్లు అల్-హయ్య తెలిపారు. హమాస్ "వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లో పూర్తి సార్వభౌమ పాలస్తీనా రాజ్యాన్ని అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాలస్తీనా శరణార్థులు తిరిగి తమ మాతృభూమికి చేరాలని, దానికి ఇజ్రాయెల్ అంగీకరించాలన్నారు. అదే జరిగితే, హమాస్ గ్రూప్ మిలిటరీ వింగ్ రద్దు చేయబడుతుందని అతను చెప్పాడు.
అయితే హమాస్ పుట్టినప్పుడు జోర్డాన్ నదీ నుంచి మధ్యధార సముద్రం స్వతంత్య పాలస్తీనా రాజ్యం ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఇప్పుడు 1967 నాటి సరిహద్దులకు తమకు అంగీకారమేనని ప్రకటిస్తోంది. ఇందులో కూడా చాలాభాగం ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉన్నాయి. యూదులను అంతం చేయడమే హమాస్ లక్ష్యం. రెండు దేశాల ఏర్పాటుతో ఈ ఘర్షణలకు ముగింపు పలుకుతారా అనే విషయంపై ఆయన ఎక్కడ స్ఫష్టంగా వెల్లడించలేదు.
ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ లేదా పాలస్తీనా అథారిటీ నుంచి ఎటువంటి స్పందన లేదు - 2007లో పాలస్తీనా అథారిటి గాజాలో గెలిచిన తరువాత వారిని అక్కడి నుంచి హమాస్ తరిమికొట్టి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గాజాలో ఎన్నికలు అనేవే లేవు. హమాస్ చెప్పిందే శాసనం. వసూలు చేసిందే పన్నులు అన్నట్లు పరిస్థితి ఉంది.
తరువాత పాలస్తీనా అథారిటికి ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని సెమీ అటానమస్ ప్రాంతాలను అప్పగించారు. ఈ అథారిటీ వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజాలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలని భావిస్తోంది - 1967 నాటి యుద్ధంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు. ఇందులో ఉండాలని, వీటికి అంతర్జాతీయ సమాజం అంగీకరించాలని కోరుకుంటోంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం దానిని తిరస్కరించింది.
ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ నగరమైన రఫాలో దాడికి సిద్ధమవుతోంది, ఇక్కడ 1 మిలియన్ కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు ఉన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రెండు డజన్ల హమాస్ బెటాలియన్లను ఐడీఎఫ్ నాశనం చేసిందని, మిగిలిన నాలుగు రఫాలో ఉన్నాయని టెల్ అవీవ్ భావిస్తోంది. హమాస్‌పై విజయం సాధించాలంటే రఫా దాడి అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
టర్కీకి వెళ్లిన హమాస్ కీలక నాయకులు
గతంలో ఖతార్‌లో ఉన్న చాలా మంది హమాస్ రాజకీయ నాయకులు గత వారంలో గల్ఫ్ దేశాన్ని విడిచిపెట్టి టర్కీకి వెళ్లారు, అక్కడ హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే శనివారం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో సమావేశమయ్యారు. అయితే ఇప్పటికి తమ ప్రధాన కార్యాలయం ఖతార్ లోనే ఉందని ఖలీల్ అన్నారు.
చర్చల ప్రక్రియలో ఆదేశమే ఇప్పటికి ప్రధాన భాగస్వామి అని చెప్పారు. ఇజ్రాయెల్- యుఎస్ అధికారులు హమాస్ ఒప్పందంపై సీరియస్‌గా లేరని ఆరోపించారు. ఇజ్రాయెల్ ను కాపాడటానికి ఇప్పటికే అమెరికా తన దళాలను మధ్యధార సముద్రంలో మోహరించిందని అన్నారు. హామాస్ నాశనం చేస్తారు కానీ, పాలస్తీనా ప్రజలను అక్కడి నుంచి వెళ్లగొట్టలేరని అన్నారు.
కానీ ఇజ్రాయెల్ ఈ వ్యాఖ్యలను పట్టించుకోకపోవచ్చు. అక్టోబర్ 7 నాడు ఉగ్రవాద సంస్థ హమాస్ 1200 మంది ఇజ్రాయెల్ సాధారణ ప్రజలను కిరాతకంగా హతమార్చింది. మరో 250 మంది బందీలుగా తీసుకెళ్లింది. మొత్తం హమాస్ తుద ముట్టిస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఙ చేసింది. ఇప్పటికే ఖాన్ యూనిస్, ఉత్తర గాజాలో ఉన్నహమాస్ ఉగ్రవాదులను ఏరివేసింది.
ఈజిప్టు సరిహద్దులో ఉన్న రఫా పై కూడా వైమానిక దాడులు మొదలు పెట్టింది. త్వరలో భూతల దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 1967 నాటి యుద్దంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి పాలస్తీనాకి అప్పగించడాన్ని ఆ దేశం అంగీకరించట్లేదు. ఇప్పటికే అక్కడ వేలాది మంది యూదులు నివసిస్తున్నారు. ఇప్పడు వారందరిని వెనక్కి రప్పించడం దాదాపు అసాధ్యం.
Read More
Next Story