షేక్ హసీనాను అప్పగించండి: భారత్ ను అధికారికంగా కోరిన బంగ్లాదేశ్
x

షేక్ హసీనాను అప్పగించండి: భారత్ ను అధికారికంగా కోరిన బంగ్లాదేశ్

ప్రభుత్వం కూలిపోయాక న్యూఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్న మాజీ ప్రధాని


బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్ లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా వాజీద్ ను వెంటనే మా దేశానికి పంపాల్సిదిగా ఢాకాలో కొలువుదీరిన తాత్కాలిక ప్రభుత్వం న్యూఢిల్లిని అధికారికంగా కోరింది. హసీనా పాలనలో దేశంలో జరిగిన ప్రజా ఉద్యమాలను అణచివేసి పలువురి మృతికి కారణమైందని ప్రస్తుత ప్రభుత్వం కొన్ని కేసులు పెట్టింది. వాటిపై విచారణ కోసం ప్రస్తుతం దేశంలో ఉన్న హసీనా పంపాలని కోరింది.

న్యాయ ప్రక్రియ కోసం బంగ్లాదేశ్ ఆమెను తిరిగి కోరుతున్నట్లు మేము భారత ప్రభుత్వానికి మౌఖిక (దౌత్యపరమైన సందేశం) పంపాము" అని విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హొస్సేన్ సోమవారం (డిసెంబర్ 23) ఢాకాలో విలేకరులతో అన్నారు.
హసీనా అరెస్ట్ వారెంట్‌ను ఎదుర్కొంటోంది..
2009 నుంచి వరుసగా 16 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న హసీనా ప్రభుత్వాన్ని విద్యార్థుల నిరసలనలతో దేశం విడిచిపారిపోవాల్సి వచ్చింది. ఆగస్టు 5 నుంచి భారతదేశంలో ప్రవాస జీవితం గడుపుతోంది. ఢాకాకు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ హసీనాతో పాటు పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక, పౌర అధికారులకు మానవత్వం, మారణహోమంపై నేరాలకు సంబంధించి అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
ప్రక్రియ కొనసాగుతోంది
అంతకుముందు సోమవారం, బంగ్లాదేశ్ హోమ్ సలహాదారు జహంగీర్ ఆలం మాట్లాడుతూ, హసీనాను భారతదేశం నుంచి రప్పించడానికి వీలుగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని చెప్పారు. ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని ఆయన విలేకరులతో అన్నారు.
భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి ఢాకాకు తీసుకురావచ్చని ఆలం చెప్పారు. అయితే భారత్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు చెప్పలేదు.
ఢాకాలో ప్రస్తుత నోబెల్ అవార్డ్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాలిస్తోంది. అయితే ఆ దేశంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల కాస్త ఉద్రిక్తత నెలకొని ఉంది. మరో వైపు అరకాన్ ఆర్మీ చిట్టగాంగ్ ప్రాంతంలోని కొన్నింటిని స్వాధీనం చేసుకుంది. మరో వైపు బంగ్లాదేశ్ మతోన్మాదులు నాలుగు రోజుల్లో ఎర్రకోటపై బంగ్లాదేశ్ జెండాను ఎగరవేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు.


Read More
Next Story