హార్వర్డ్ నుంచి బహిరంగ క్షమాపణలు రావాల్సిందే: వైట్ హౌజ్
x
డొనాల్డ్ ట్రంప్

హార్వర్డ్ నుంచి బహిరంగ క్షమాపణలు రావాల్సిందే: వైట్ హౌజ్

సమాఖ్య విధానాలు పాటించాలని యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ సర్కార్


యూదు అమెరికన్ విద్యార్థులకు వ్యతిరేకంగా హార్వర్డ్ కళాశాల క్యాంపస్ లో జరిగిన తీవ్రమైన యూదు వ్యతిరేకత, దాన్నిప్రొత్సహించినందుకు హార్వర్డ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ట్రంప్ కోరుతున్నట్లు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు.

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల సమాఖ్య నిధులు స్తంభింపజేసిన తరువాత ట్రంప్ వర్శిటీ నుంచి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.

‘‘హార్వర్డ్ విషయానికి వస్తే నేను చెప్పినట్లుగా అధ్యక్షుడు చాలా స్పష్టంగా ఉన్నారు. వారు సమాఖ్య చట్టాన్ని పాటించాలి’’అని లీవిట్ విలేకరులతో అన్నారు.
పన్ను మినహాయింపు ప్రమాదంలో ఉందా?
హార్వర్డ్ చర్యలపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్.. ఈ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారా? అని విలేకరులు ప్రెస్ సెక్రటరీని ప్రశ్నించారు.
ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ పోస్ట్ లో చేస్తూ.. ‘‘రాజకీయ, సైద్దాంతిక, ఉగ్రవాద ప్రేరేపితంగా సమస్యలను ప్రొత్సహిస్తూ ఉంటే హర్వర్డ్ తన పన్ను మినహాయింపులను కోల్పోతుంది. రాజకీయ సంస్థపై పన్ను విధించబడాలి? పన్ను మినహయింపు స్థితి పూర్తిగా ప్రజా ప్రయోజనంలో వ్యవహరించడంపై ఆధారపడి ఉంటుంది’’ అని చెప్పారు.
హార్వర్డ్ తన పన్ను మినహాయింపు హోదాను కోల్పోవచ్చనే సూచనతో ట్రంప్ విశ్వవిద్యాలయం తన స్వాతంత్య్రం నిలుపుకోవాలనే దృఢ సంకల్పంతో దాని నిధులను పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తోంది.
హార్వర్డ్ ఏం చేయబోతోంది..
హార్వర్డ్ తన వైవిధ్యం, సమానత్వం,(డీఈఐ) కార్యాలయాలు రద్దు చేయాలని, ఇమ్మిగ్రేషన్ తనిఖీలతో సమాఖ్య సంస్థలతో సహకరించడానికి దాని విధానాలలో మార్పులు చేయాలని ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
అయితే వీటిని యూనివర్శిటీ పాటించడానికి నిరాకరిచింది. హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గెర్బర్ ఒక ప్రకటనలో.. సమాఖ్య వ్యవస్థ ఆదేశాలు విశ్వవిద్యాలయం మొదటి సవరణ హక్కులను ఉల్లంఘిస్తుందని అన్నారు. హార్వర్డ్ కు మద్దతుగా యూఎస్ఏ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగారు.
Read More
Next Story