
ఖలిదా జియా
ఖలీదా మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందా?
భారత్ తో ఘర్షణాత్మక వైఖరి అవలంభించిన బంగ్లా తొలి మహిళా ప్రధాని
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి, ముస్లిం ప్రపంచంలో రెండో ప్రధాని అయిన ఖలీదా జియా అనారోగ్యంతో మంగళవారం ఉయదం తెల్లవారుజామున ఢాకాలో మరణించారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి దీర్ఘకాలిక చైర్మన్ గా ఉన్నారు. మూడుసార్లు బంగ్లాకు ప్రధానిగా ఎన్నికయ్యారు. 1975 నుంచి సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు.
1990, 2000 ప్రారంభంలో ఆమె రాజకీయంగా ఉన్నత స్థితిలో నిలిచారు. నాలుగు దశాబ్ధాల పాటు సాగిన ఆమె రాజకీయ ప్రయాణం ఎత్తుపల్లాలతో సాగింది. ఆమె బంగ్లాదేశ్ ను పాలించడం నుంచి అవినీతి ఆరోపణలో దోషిగా నిర్థారణ కావడం, తరువాత క్షమాపణ పొందడం వరకూ ఉన్నాయి.
అనుకోకుండా రాజకీయాల్లోకి..
రాజకీయాల్లోకి ఖలీదా జియా యాధృచ్చికంగా జరిగింది. 35 సంవత్సరాల వయస్సులో వితంతువు అయిన ఖలీదా.. దశాబ్ధం తరువాత ప్రధాని పాత్రను పోషించారు.
మే 30, 1981 న జరిగిన సైనిక తిరుగుబాటులో ఆమె భర్త, అధ్యక్షుడు జియావుర్ రెహ్మన్ హత్యకు గురయ్యారు. ఆయన సైనిక నియంత. తరువాత అనూహ్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.
అంతకుముందు ఆమెకు పెద్దగా బయటి ప్రపంచంతో సంబంధం లేదు. దీనికి ముందు ఆమెను కేవలం సైనిక జనరల్ భార్యగా, ప్రథమ మహిళగా పరిగణించేవారు. ఆమె భర్త 1978 లో బీఎన్పీ స్థాపించారు.
జియా ఇందులో చేరి నాయకురాలిగా మారి తనదైన ముద్ర వేశారు. ఆమె జనవరి 3, 1982 లో ప్రాథమిక సభ్యత్వం తీసుకుని, మరుసటి సంవత్సరం మార్చి నాటికి పార్టీ ఉపాధ్యక్షురాలిగా, 1984 నాటికి బీఎన్సీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి చనిపోయే వరకూ పార్టీ చీఫ్ గా ఉన్నారు.
ప్రజాస్వామ్య పునరుద్దరణ..
1982 లో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ హెచ్ఎం ఎర్షాద్ సైనిక తిరుగుబాటు తరువాత జియా ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. 1986 లో జియా నేతృత్వంలోని బీఎన్పీ కూటమి, హసీనా నేతృత్వంలోని 15 పార్టీల కూటమి ఏకకాలంలో ప్రచారాలు చేస్తున్న సమయంలో ఎర్షాద్ అధ్యక్ష ఎన్నికలు ప్రకటించారు.
రెండు కూటములు మొదట ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. కానీ అవామీ లీగ్,కమ్యూనిస్ట్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి చివరికి పాల్గొన్నాయి.
జియా కూటమి బహిష్కరణకు కట్టుబడి ఉంది. మార్చి ఎన్నికలకు ముందు ఎర్షాద్ హసీనాను గృహ నిర్భంధంలో పెట్టారు. తరువాత జాతీయ పార్టీ నామినిగా ఆయన అధ్యక్ష పదవిని పొందాడు.
‘‘1986 లో ఎన్నికలను బహిష్కరించిన తరువాత జియాకు ప్రజాదరణ పెరిగింది’’ అని హసీనా ప్రభుత్వానికి అంతర్జాతీయ వ్యవహరాల సలహదారుగా పనిచేసిన ప్రొఫెసర్ హోహెర్ రిజ్వి అన్నారు.
ఆశ్చర్యకరమైన విజయం..
1990 డిసెంబర్ ఎర్షాద్ పాలన పతనం తరువాత ప్రధాన న్యాయమూర్తి షాబుద్దీన్ అహ్మద్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఫిబ్రవరి 1991 లో ఎన్నికలు నిర్వహించింది. అవామీ లీగ్ ఎన్నికల్లో గెలుస్తుందని నమ్మారు.
కానీ ఆశ్చర్యకరంగా బీఎన్పీ మెజారిటీ పార్టీగా అవతరించింది. కొత్త పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించి, అధ్యక్ష తరహ ప్రభుత్వం నుంచి పార్లమెంటరీ వ్యవస్థకు మారింది. జియా బంగ్లాదేశ్ లో మొదటి మహిళా ప్రధానమంత్రి, పాకిస్తాన్ బెనజీర్ భుట్టో తరువాత ముస్లిం ప్రపంచంలో రెండో మహిళా ప్రధానమంత్రి అయ్యారు.
1996 లో బీఎన్పీ తిరిగి అధికారంలోకి వచ్చింది. కానీ అవామీ లీగ్ ఆందోళనలు నిర్వహించడంలో 12 రోజులు మాత్రమే ప్రభుత్వం ఉంది. కేర్ టేకర్ ప్రభుత్వం రావడంతో జియా ప్రభుత్వం రాజీనామా చేసింది. జూన్ 1996 లో జరిగిన తాజా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ 116 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష పార్టీగా ఉంది.
అవామీ లీగ్ కు వ్యతిరేకంగా ఆందోళన..
1999 లో జియా నాలుగు పార్టీల సంకీర్ణాన్ని ఏర్పాటు చేసి, అప్పటి అధికారంలో ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఆందోళనలు ప్రారంభించింది. 2001 లో ఆమె తిరిగి ఎన్నికయ్యారు. 2006 లో ఆమె పదవి నుంచి వైదొలిగి అధికారాన్ని తాత్కాలిక పరిపాలనకు అప్పగించారు.
సెప్టెంబర్ 2007 లో ఆమె పార్టీ నిరాధారమైన అవినీతి ఆరోపణలు అని పేర్కొన్న దానిపై ఆమెను అరెస్ట్ చేశారు. జియా పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ ఓడిపోలేదు. 1991, 1996, 2001 లో వేరు వేరు స్థానాలలో పోటీ చేసి గెలిచారు. 2008 లో పోటీ చేసిన మూడు నియోజకవర్గాల్లోనూ గెలిచారని బీఎన్పీ నాయకుడు తెలిపారు.
భారత్ లో జననం..
జియా ఆగష్టు 15, 1946 లో అవిభక్త భారత్ లోని దినాజ్ పూర్ జిల్లాలోని తైయాబా, ఇస్కందర్ మజుందార్ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి జల్పాయ్ గురి వలస వచ్చారు. అక్కడ కుటుంబం టీ వ్యాపారం నిర్వహిస్తుంది.
విభజన తరువాత తూర్పు పాకిస్తాన్ కు వలస వచ్చారు. 1960 లో బంగ్లాదేశ్ అధ్యక్షుడైన ఆర్మీ కెప్టెన్ జియావుర్ రెహమాన్ ను వివాహం చేసుకుంది. 1983 లో జియా బీఎన్పీ చీఫ్ అయింది.
1982 లో తిరుగుబాటు సమయంలో పార్టీని బహిష్కరించడం బీఎన్పీని రాజకీయం నిరాశపరిచింది. తరువాత పార్టీని ఏకీకృతం చేసి అవామీ లీగ్ తో కలిసి ఎర్షాద్ పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ ప్రచారాన్ని నిర్వహించింది.
జైలు శిక్ష.. క్షమాపణ
2008 ఎన్నికలకు ముందు జియా తన నామినేషన్ పత్రంలో జత చేసిన అఫిడవిట్ లో తాను స్వయంగా చదువుకున్నానని పేర్కొన్నారు. కానీ బీఎన్పీ వెబ్ సైట్ లో మాత్రం దినాజ్ పూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల, సురేంద్రనాథ్ కళాశాలలో చదువుకున్నట్లు పేర్కొంది. జియా తన చివరి 15 సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష నాయకులిరాగా, హసీనాకు వ్యతిరేకంగా పోరాడారు.
ఫిబ్రవరి 8, 2018 లో జియా అనాథ శరణాలయం ట్రస్ట్ కేసులో ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. జియా ఛారిటబుల్ ట్రస్ట్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. 2024 లో హసీనా అధికారం నుంచి తొలగించబడిన తరువాత జియాకు అధ్యక్ష క్షమాపణ లభించింది.
భారత్ తో సంబంధాలు..
1991-96 మధ్య జియా మొదటిసారిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడూ భారత్ తో సంబంధాలు మిశ్రమంగా కొనసాగాయి. ముఖ్యంగా గంగానదీ నీరు, సరిహద్దు తిరుగుబాట్లు గురించి బేదాభిప్రాయాలు ఉన్నాయి.
లూక్ ఈస్ట్ విధానంలో భాగంగా చైనా, ఇస్లామిక్ దేశాలతో వ్యూహాత్మక సమన్వయం నెరిపింది. కానీ రెండోసారి ప్రధాని అయ్యాక భారత్ తో సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. బంగ్లాదేశ్ ను ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదానికి కేంద్రంగా మార్చారనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
భారత్ సందర్శన..
జియా 1992, 2006 లో రెండు సార్లు ప్రధానమంత్రిగా భారత్ ను సందర్శించారు. భారత్ ఆహ్వానం మేరకు 2012 లో ఒకసారి ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు. ఆమె 2006 లో రాష్ట్ర పర్యటన వాణిజ్య, భద్రతపై ఒప్పందాలను కుదుర్చుకుంది.
ఆమె కుమారుడు ప్రస్తుతం బీఎన్పీ యాక్టింగ్ చైర్మన్ గా ఉన్న తారిక్ రెహమాన్ 2008 నుంచి లండన్ లో స్వయం ప్రవాసంలో నివసించిన తరువాత ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆమె కుమారుడు అరాఫత్ రెహమాన్ 2015 లో గుండెపోటుతో మరణించారు.
Next Story

