గ్రీన్ ల్యాండ్ విషయాన్ని యూరప్ తీవ్రంగా తీసుకుందా?
x
గ్రీన్ ల్యాండ్

గ్రీన్ ల్యాండ్ విషయాన్ని యూరప్ తీవ్రంగా తీసుకుందా?

ఎంతమంది సైనికులను తరలిస్తున్నారు?


ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మంగా ఉన్న గ్రీన్ ల్యాండ్ ను ఎట్టి పరిస్థితుల్లో కబళించి తీరతామని గత కొంతకాలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నాడు.

కోనుగోలు చేయడం లేదా సైనిక ప్రయోగం ద్వారా అమెరికాలో భూభాగంగా మారుస్తామని చెబుతున్నారు. లేకపోతే ఆ ద్వీపం రష్యా, చైనా చేతికి చిక్కుతుందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన వాదిస్తున్నారు.

అమెరికా ఇటీవల దక్షిణ అమెరికాలోని వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను సైనిక ఆపరేషన్ ద్వారా కిడ్నాప్ చేసిన తరువాత తన దృష్టి మీద గ్రీన్ ల్యాండ్ మీదే అని పేర్కొంది.

ఈ పరిణామంతో ట్రంప్ ప్రకటనను తేలిగ్గా తీసుకోకూడదని యూరప్ భావిస్తోంది. అయితే యూరోపియన్ శక్తులు బహిరంగంగా మాత్రం దీనిపై వ్యాఖ్యానించడం లేదు. గ్రీన్ ల్యాండ్ ను రక్షించుకోవాలంటే అక్కడ పదాతి దళాలు మొహరించడం తప్పనిసరి. ఈ విషయంలో అవి మౌనం పాటిస్తున్నాయి.

ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్..
డెన్మార్క్ ఆపరేషన్ ‘ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్’ అనే నాటో సైనిక విన్యాసాలకు నాయకత్వం వహిస్తోంది. దీనిని నిఘా మిషన్ గా పేర్కొంటున్నారు. అయితే యూరప్ సైనికుల కొరతను ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో వారు డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ ల్యాండ్ ను అమెరికా సైనిక బలాన్ని కాదని దక్కించుకోగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం యూకే ఇక్కడకు ఒక సైనిక అధికారిని పంపుతోంది.
నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్ చెరో ఇద్దరు అధికారులను పంపుతున్నాయి. ఫ్రాన్స్ తన 127 మౌంటైన్ ఇన్ఫాంట్రి బ్రిగ్రేడ్ నుంచి 15 మంది సైనికులను పంపింది. జర్మనీ 13 మందిని పంపింది. స్వీడన్ కూడా సైనికులను పంపినప్పటికీ వారి సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.
డెన్మార్క్ తన జాయింట్ ఆర్కిటిక్ కమాండ్ కింద గ్రీన్ ల్యాండ్ లో 150 మంది సైనికులను మొహరించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో డానిష్ సార్వభౌమత్వాన్ని అమలు చేయడానికి సుదూర నిఘా గస్తీని నిర్వహించే 14 మంది సైనికులతో కూడిన మరో పెట్రోలింగ్ బృందం కూడా ఉంది.
నాటో దేశాలైన ఇటలీ, పోలాండ్, టర్కీ తమ సైనికులను పంపడానికి నిరాకరించాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొన్ని నాటో దేశాలపై సైనిక వ్యయం పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆ కారణం వల్లే అవి సైనికులను పంపడానికి నిరాకరించవచ్చు.
కోల్డ్ వార్ ముగిసిన తరువాత ఇక పెద్ద యుద్దాలు జరగబోవని భావించిన యూరోపియన్ దేశాలు క్రమంగా తమ సైనికులను తగ్గించుకున్నాయి. వాటిని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించుకున్నాయి. ప్రస్తుతం యూరప్ తన ప్రయోజనాలను రక్షించుకోవడానికి నాటోపైనే అధికంగా ఆధారపడుతోంది.
ట్రంప్ తన మొదటి పరిపాలన కాలంలోనే నాటో లో భాగస్వామ్య దేశాలు సైనిక ఖర్చును పెంచుకోవాలని ఒత్తిడి చేశారు. అయితే అందుకు అవి నిరాకరించాయి.
2022 లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడంతో వాటి శక్తి అంతంత మాత్రమే అని తెలిసింది. యుద్దం జరిగితే యూరప్ అంతా కలిసి కనీసం 50 వేలమంది సైనికులను కూడా మొహరించలేదని జర్మనీ కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలెషన్స్ అధ్యయనం వెల్లడించింది. ఇదే సమయంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపు 5 లక్ష్లల మంది సైనికులు పోరాడుతున్నారు.
వాస్తవం తెలుసుకున్న యూరప్
నాటో లో తమ భాగస్వామ్యం అంతంత మాత్రమే అని తెలుసుకున్న యూరప్ క్రమంగా సైనిక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 2027 నాటికి ఫ్రాన్స్ తన రక్షణ బడ్జెట్ ను 64 బిలియన్ యూరోలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది జీడీపీలో 3 శాతానికి సమానం. పోలాండ్ 2039 నాటికి తన సైనికులను 5 లక్షలకు పెంచుకోవాలని అనుకుంటోంది. భవిష్యత్ లో రష్యా నుంచి ఎలాంటి దాడి ఎదురైన ధీటుగా తిప్పికొట్టాలంటే ఆ మాత్రం అవసరమని అనుకుంటోంది.
2026 నాటికి తన రక్షణ వ్యయాన్ని దాని జీడీపీలో 5 శాతానికి పెంచుకోవాలనుకుంటోంది. జర్మనీ కూడా ఇదే దారిలో నడవాలని అనుకుంటోంది.
2030 నాటికి తన సైనికులను 2,30 వేలకు పెంచాలని ప్రణాళికలు రచిస్తోంది. ఫిన్లాండ్ కూడా తన సైన్యం, రిజర్వ్ దళాలతో కలిపి 9 లక్షలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
అయితే ఇవేవి పూర్తి స్థాయిలో సరిపోయేలా లేవు. నాటో లో ఒప్పందం ప్రకారం సైనిక వ్యయం పెంచాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. దీనికి డెడ్ లైన్ 2027 గా విధించింది. ఇందుకోసం యూరప్ ఒక ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఫిన్లాండ్ కు చెందిన సైనిక విశ్లేషకుడు ఎమిల్ ప్రకారం.. ‘‘యూరప్ మొత్తం భద్రతా నిర్మాణం పూర్తిగా మారిపోవాలి. కొన్ని సంవత్సరాల వేచి చూసి తరువాత సమస్యలు తొలగిపోతాయనే భావన విడిచిపెట్టాలి’’ అన్నారు.
Read More
Next Story