
హూతీలు- ప్రభుత్వ అనుకూల వర్గాల మధ్య భారీ దాడులు
తైజ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తిరుగుబాటుదారుల ప్రకటన, వైమానిక దాడులతో ఎదురుదాడికి దిగిన ప్రభుత్వం
యెమెన్‌లో మరోసారి యుద్ధ వాతావరణం మారింది. ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు కీలకమైన తుర్బా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న ప్రకటించింది. సౌదీ అనుకూల ప్రభుత్వం ఏడెన్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఎలాగైనా ఏడెన్ స్వాధీనం చేసుకోవాలని హూతీలు లక్ష్యంగా పెట్టుకున్నారు. సౌదీ మద్దతుతో ఉన్న యెమెన్ ప్రభుత్వ బలగాలు భారీ ఎదురుదాడికి దిగాయి. సోమవారం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌కు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు వైమానిక మద్దతు కూడా లభిస్తోంది.
దాదాపు వంద విమానాలు బరిలోకి దిగాయని సంకీర్ణ దళాల ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మల్కీ తెలిపారు. బాబ్ ఎల్ మాండేజ్ లో ఉన్న హూతీల లక్ష్యాలను నాశనం చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఆదివారం హూతీలు తుర్బా పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ పట్టణం తైజ్ ప్రావిన్స్ రాజధాని తైజ్‌ను, ప్రభుత్వ తాత్కాలిక కేంద్రంగా ఉన్న ఏడెన్ పోర్టు నగరంతో కలిపే ప్రధాన మార్గంలో ఉంది. దీంతో తైజ్‌లోని ప్రభుత్వ బలగాలకు సరఫరాలు, అదనపు బలగాల తరలింపు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
ఇప్పటికే తైజ్ నగర శివార్లలోని పలు గ్రామాలు, ప్రాంతాలను హూతీలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తైజ్ నగరాన్ని చుట్టుముట్టే దిశగా వారు ముందుకు సాగుతున్నారు.
మరోవైపు, సెప్టెంబర్‌లో హూతీలు ఎర్ర సముద్ర తీరంలో వేగంగా ముందుకు సాగి వ్యూహాత్మకమైన మొఖా నగరంతో పాటు పలు దీవులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాబ్ ఎల్-మాండెబ్ జలసంధికి యెమెన్ వైపు ఉన్న ప్రాంతాలపై వారి నియంత్రణ పెరిగింది. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన ఈ సముద్ర మార్గం ప్రాధాన్యత కారణంగా తాజా పరిణామాలు మరింత కీలకంగా మారాయి.
ఈ నేపథ్యంలో యెమెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారీ సైనిక చర్యను ప్రకటించింది. అధ్యక్షుడు రషాద్ అల్-అలిమి నేతృత్వంలోని ప్రభుత్వ బలగాలు సోమవారం నుంచి ఎదురుదాడిని ప్రారంభించాయి.
ఈ ఆపరేషన్‌కు ‘యెమెన్ డాన్’ అనే పేరు పెట్టారు. ‘సనా’ రాజధానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ సంస్థలను పునరుద్ధరించడం దీని లక్ష్యాలుగా ప్రభుత్వం తెలిపింది.
బాబ్ ఎల్-మండెబ్ జలసంధికి వైమానిక రక్షణ కల్పిస్తున్నామని, హూతీలకు చెందిన వందలాది లక్ష్యాలను ధ్వంసం చేశామని పేర్కొంది. అయితే ఈ వివరాలను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాలేదు.
సోమవారం సౌదీ మద్దతు ఉన్న బలగాలు బాబ్ ఎల్-మండెబ్ సమీపంలోని ధుబాబ్ ప్రాంతంలో హౌతీ స్థావరాలపై దాడులు ప్రారంభించాయి. ప్రభుత్వ అనుకూల ‘జెయింట్స్ బ్రిగేడ్స్’ కూడా అక్కడ కీలక సైనిక ఆపరేషన్ ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఈ ఘర్షణలతో నాలుగేళ్లుగా కొనసాగిన కాల్పుల విరమణ తర్వాత యెమెన్‌లో అంతర్యుద్ధం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. 2014లో హూతీలు సనా నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటికే భారీ ప్రాణనష్టం, మానవతా సంక్షోభానికి దారితీసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తాజా హింసలో ఇప్పటివరకు కనీసం 959 మంది మరణించగా, 4,200 మందికి పైగా గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి వలస సంస్థ ప్రకారం 1.45 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి దేశంలోనే ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. మరో 3,000 మందికి పైగా సముద్ర మార్గంలో జిబౌటికి వెళ్లారు.
ప్రస్తుతం తైజ్, బాబ్ ఎల్-మండెబ్ ప్రాంతాల్లో పోరు కొనసాగుతుండటంతో.. యెమెన్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజా సైనిక చర్యల ఫలితంగా భవిష్యత్‌లో పరిస్థితి ఎలా మారుతుందన్నది తదుపరి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.
Next Story
