హెజ్ బొల్లాకు మరో ఎదురుదెబ్బ.. ఈ సారి లాజిస్టిక్స్ చీఫ్..?
x

హెజ్ బొల్లాకు మరో ఎదురుదెబ్బ.. ఈ సారి లాజిస్టిక్స్ చీఫ్..?

యూదు దేశం- హెజ్ బొల్లా మధ్య జరుగుతున్న యుద్దంలో ఉగ్రవాద సంస్థకు వరసుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఐడీఎఫ్ జరిపిన వైమానిక దాడిలో లాజిస్టిక్స్ చీఫ్..


ఇజ్రాయెల్- హెజ్ బొల్లా మధ్య జరుగుతున్న పోరు ఉధృతంగా సాగుతోంది. మంగళవారం ఐడీఎఫ్ దళాలు బీరూట్ లో కచ్చితమైన, ఇంటలిజెన్స్ ఆధారిత భారీ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించి మరో కమాండర్ ను అంతం చేసింది. చనిపోయిన హెజ్ బొల్లా కమాండర్ సుహైల్ హుస్సేన్ అని ప్రకటించింది. కమాండర్ గ్రూప్ అత్యంత సున్నితమైన ప్రాజెక్ట్‌ల లాజిస్టిక్స్, బడ్జెటింగ్‌కు హుస్సేనీ బాధ్యత వహిస్తున్నారని ఐడీఎఫ్ పేర్కొంది. దీనితో ఉగ్రవాద సంస్థ పోర్ట్ నగరం హైఫా, రాజధాని టెల్ అవీవ్ పై రాకెట్లను ప్రయోగించింది.

బీరూట్ పై బాంబుల వర్షం..
ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు జరిగి సంవత్సరం పూర్తయిన ఉగ్రవాద సంస్థలు రాకెట్లను ప్రయోగించాయి. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్, లెబనాన్ రాజధాని బీరూట్ లక్ష్యంగా బాంబులు జారవిడించింది. ఇలా సెప్టెంబర్ 27 నుంచి రాత్రిపూట ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి.
దక్షిణ లెబనాన్‌లోని అనేక లక్ష్యాలపై తమ వైమానిక దళం బాంబులు వేసిందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల వల్ల గత నెలలో లెబనాన్‌లో దాదాపు 1.2 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుత వివాదంలో ఇజ్రాయెల్ - హెజ్ బొల్లా మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 2,000 మంది లెబనీస్ మరణించారు.గాజాలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి హామాస్ తో పాటు హెజ్ బొల్లా, హౌతీలు రాకెట్లు ప్రయోగిస్తూ యూదు దేశానికి చికాకులు సృష్టించే ప్రయత్నం చేశారు.
"ఫాడీ 1" క్షిపణులతో హైఫాకు దక్షిణంగా ఉన్న సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని, టిబెరియాస్‌ను కూడా తాకినట్లు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దాదాపు 190 క్షిపణులు తమ భూభాగంలోకి ప్రవేశించాయని, కనీసం 12 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ప్రస్తుతం దక్షిణ లెబనాన్‌లో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కు సైనికుల మరణాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటి దాకా మరణించిన సైనికుల సంఖ్య 11 కి చేరింది.
ఫీనిక్స్ లాగా పైకి లేస్తుంది: హమాస్
గత సంవత్సరం పోరాటంలో భారీ నష్టాలను చవిచూసి, గాజా భూభాగంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి సాక్షిగా ఉన్నప్పటికీ "ఫీనిక్స్ లాగా ఎదగాలని" హమాస్ సోమవారం ప్రతిజ్ఞ చేసింది. తాము యూదు దేశంపై పోరాటాలు కొనసాగిస్తామని ప్రకటించింది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేసింది.
ఇస్లామిక్ రిపబ్లిక్ యూదుల దేశంపై సుమారు 200 క్షిపణులను ప్రయోగించిన ఒక వారం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్‌పై ఎలాంటి దాడులు చేయకూడదని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖీ మాట్లాడుతూ ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ దాడి తర్వాత, ఇజ్రాయెల్ తగిన సమయంలో స్పందిస్తామని ప్రకటించింది.
మరో వైపు ఇరాన్ లో రాజధాని టెహ్రన్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూప్రకంపనాలు మొదలయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. పర్షియా దేశం రహస్యంగా భూ గర్భంలో అణు పరీక్షలు నిర్వహించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

అక్టోబర్ 7, 2023న గాజాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇజ్రాయెలీలు నిరసనలు నిర్వహించారు. "ఇజ్రాయెల్ పోరాటం కొనసాగిస్తుంది," ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రతిజ్ఞ చేసారు.


Read More
Next Story