మొజ్తబా ఖమేనీ ఇజ్రాయెల్ దాడి నుంచి ఎలా తప్పించుకున్నాడంటే?
x
ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ

మొజ్తబా ఖమేనీ ఇజ్రాయెల్ దాడి నుంచి ఎలా తప్పించుకున్నాడంటే?

ఆడియో లీక్ ను ప్రచురించిన బ్రిటన్ చెందిన ప్రముఖ వార్తా సంస్థ


Click the Play button to hear this message in audio format

ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడి నుంచి ఇరాన్ నయా సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఎలా తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ లీక్ ఆడియో బయటకు వచ్చింది. యూకే కు చెందిన ‘ది టెలిగ్రాఫ్’ ఈ మేరకు ఓ వార్త కథనాన్ని ప్రచురించింది. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీని బలిగొన్న దాడి నుండి ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ కేవలం సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నారు.

లీక్ అయిన ఆడియో ప్రకారం, పేలుడుకు కొన్ని నిమిషాల ముందు వేరే పని కోసం ఆయన బయటకు అడుగుపెట్టడంతో, తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్న భవనంపై భయంకరమైన దాడి జరిగింది.
అలీ ఖమేనీ కార్యాలయంలో ప్రోటోకాల్ హెడ్ అయిన మజాహెర్ హొస్సేనీ ఈ ఆడియోలో ఈ వివరాలు వెల్లడించినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. ఈ ఆడియోను మార్చి 12న టెహ్రాన్‌లో జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో రికార్డ్ చేశారు.

మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారు?

ఇరాన్ నాయకత్వం సమావేశమైన టెహ్రాన్ లోని కీలకమైన భవనంపై ఉదయం 9.32 గంటలకు దాడి జరిగింది. ఖమేనీ కుటుంబ సభ్యులతో సహా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను హతమార్చే ఉద్దేశ్యంతో, ఈ దాడిని చాలా పకడ్బందీగా సమయం చూసి జరిపినట్లు సమాచారం. దాడికి కొద్ది క్షణాల ముందు, మొజ్తబా ఖమేనీ తోటలోకి వెళ్లి, తిరిగి పై అంతస్తుకు వెళ్తుండగా భవనంపై దాడి జరిగింది.
ఈ దాడిలో ఆయన భార్య జహ్రా హద్దాద్-అడెల్, వారి కుమారుడు మరణించారు. అయితే, ఆయన కేవలం కాలికి స్వల్ప గాయంతో బయటపడినట్లు సమాచారం. "మొజ్తబా ఏదో పని మీద ఆవరణలోకి వెళ్లి, ఆ తర్వాత తిరిగి రావడమే దైవ సంకల్పం" అని మజాహెర్ హొస్సేనీ సమావేశంలో చెప్పినట్లు స్పష్టంగా వినబడింది.

దాడి వివరాలు

లీకైన ఆడియో ప్రకారం, ఆ ప్రాంగణంపై మూడు క్షిపణులను ప్రయోగించినట్లు, వాటిలో ఒకటి అలీ ఖమేనీ ఉన్న ప్రాంతంలో, మరొకటి మొజ్తబా ఖమేనీ పై అంతస్తులోని నివాసంపై పడినట్లు తెలుస్తోంది. ప్రాంగణం లోపల ఉన్న మొజ్తబా బావమరిది మిస్బా అల్-హుదా బఘేరీ కనీ నివాసంపై మరో క్షిపణి పడినట్లు నివేదిక పేర్కొంది.
కార్యాలయ సముదాయంలోని పలు ప్రాంతాలపై జరిగిన శక్తివంతమైన దాడిలో ఇరాన్ సైనిక అధిపతి అలీ ఖమేనీ అల్లుడు మిస్బా అల్-హుదా బఘేరీ కనీ, ఖమేనీ కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు ఇరాన్ అధికారి ఒకరు చెప్పినట్లు సమాచారం.
ఈ ఆడియోలో దాడికి సంబంధించిన ఇతర భయంకరమైన వివరాలు కూడా వెల్లడయ్యాయి, క్షిపణి వల్ల జరిగిన విధ్వంసాన్ని హొస్సేనీ వర్ణించారు. 'అతన్ని ఎవరూ చూడలేదు' మొజ్తబా బతికే ఉన్నారా అనే దానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సందేహాలు వ్యక్తం చేస్తూ, "అతన్ని ఎవరూ చూడలేదు, ఇది అసాధారణం" అని చెప్పిన ఒక రోజు తర్వాత ఈ ఆడియో వివరాలు వెలుగులోకి వచ్చాయి.
పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మొజ్తబా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. సుప్రీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత ఖమేనీ చేసిన తొలి వ్యాఖ్యలను ఒక టెలివిజన్ వ్యాఖ్యాత చదివి వినిపించారు.
Read More
Next Story