అమెరికాలో అయోధ్య సంబరాలు ఎలా జరుగుతున్నాయి?
x

అమెరికాలో అయోధ్య సంబరాలు ఎలా జరుగుతున్నాయి?

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకలను అమెరికాలోని హిందువులు ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇంకా ఏం కార్యక్రమాలు చేపడుతున్నారు..


అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం, బాలరాముడు (రామ్‌లల్లా) విగ్రహ ప్రతిష్ఠ ఈ నెల 22న జరగనున్నాయి. ఈ సందర్భంగా అమెరికాలోని హిందువులు అక్కడి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. అమెరికాలో జరిగే వేడుకల్లో వేలాది మంది భారతీయ అమెరికన్లు పాల్గొననున్నారు.

గొప్ప కార్యక్రమం..

దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు వంద కోట్ల మంది హిందువులకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని అమెరికా హిందూ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కళ్యాణ్‌ విశ్వనాథన్‌ తెలిపారు.

ఊరేగింపు.. ప్రసాద పంపిణీ..

టెక్సాస్‌లోని శ్రీ సీతారామ్‌ ఫౌండేషన్‌ తరుపున కపిల్‌ శర్మ హ్యూస్టన్‌లోని ఆలయంలో వేడుకలను నిర్వహించనున్నారు. సుందరకాండతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సంగీత సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయని కపిల్‌ శర్మ తెలిపారు. ‘హవన్‌’ అనే మతపర వేడుక అనంతరం శ్రీరాముని కిరీటం, ఊరేగింపు నిర్వహించి ప్రసాద పంపిణీతో కార్యక్రమం ముగుస్తుందన్నారు.

వేడుకలకు మేరీల్యాండ్‌ గవర్నర్‌..

మేరీల్యాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూర్‌ ఈ శనివారం వాషింగ్టన్‌ డీసీ శివారులో నిర్వహించే రామమందిర వేడుకకు హాజరుకానున్నారు. అమెరికాలో ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన మరికొంతమంది కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

దేవాలయాల్లో వేడుకలు..

లక్షలాది మంది శ్రీరామ భక్తుల కల ఎట్టకేలకు సాకారం కాబోతోందని అమెరికాలోని విశ్వహిందూ పరిషత్‌కు చెందిన అమితాబ్‌ మిట్టల్‌ అన్నారు. యూఎస్‌లో దాదాపు 1,000 దేవాలయాలు ఉన్నాయి. అయోధ్య రామ మందిర ప్రత్యేక కార్యక్రమాన్ని పురస్కరించుకుని విదేశాల్లోని హిందువులంతా ఈ వారాంతంలో వేడుకలు నిర్వహిస్తున్నారు.

కార్‌ ర్యాలీలు..

వీహెచ్‌పీఏ - వాషింగ్టన్‌ డీసీ చాప్టర్‌ ‘‘లవ్‌ ధోలే తాషే’’ పేరిట కారు ర్యాలీ నిర్వహిస్తోంది. ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు శ్రీరామ పూజను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలు దేశ రాజధానిలోని మేరీల్యాండ్‌ శివారులో ఉన్న ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు.

20కి పైగా నగరాల్లో కార్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నారు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో అతిపెద్ద ర్యాలీలో దాదాపు 600 కార్లు పాల్గొనే అవకాశం ఉంది.

శాన్‌ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో రాముడి భక్తులు కారు ర్యాలీ నిర్వహిస్తారని దీప్తి మహాజన్‌ తెలిపారు. వాహనాలపై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శిస్తూ రాముడి భక్తి పాటలను వినిపించనున్నారు.

ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు..

వీహెచ్‌పీ-అమెరికా అనే సంస్థ రామ మందిర ప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో బహిరంగ ప్రదేశాలను లీజుకు తీసుకుంది. ఇది చికాగో, హ్యూస్టన్‌, లాస్‌ ఏంజిల్స్‌ వంటి నగరాల్లోని పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 21న సోనీ టైమ్స్‌ స్క్వేర్‌లో శ్రీమద్‌ రామాయణాన్ని ప్రదర్శిస్తున్నారు.

Read More
Next Story