ఇమ్రాన్ భద్రతకు నెలకు ఎన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారంటే?
x

ఇమ్రాన్ భద్రతకు నెలకు ఎన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారంటే?

తోషిఖానాతో పాటు పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ రావల్పిండిలోని జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భద్రతా కల్పించడానికి పాక్ ప్రభుత్వం నెలకు..


పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసుల వల్ల జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. అయితే జైలులో మాజీ ప్రధానికి భద్రతా కల్పించడం పాకిస్తాన్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.

జైలులో ఉన్న ఇమ్రాన్ కు భద్రత కల్పించడానికి నెలకు రూ. 1.2 మిలియన్లు ఖర్చు చేస్తున్నారట. అంటే పాక్ కరెన్సీలో నెలకు దాదాపు రూ. 12 లక్షలు. అసలే పాక్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఒక బిలియన్ డాలర్లు అప్పు ఇవ్వమని ఇటూ ఐఎంఎఫ్, అటూ సౌదీ పాలకుల కాళ్లావేళ్లా పడుతోంది పాక్ ప్రభుత్వం.

లాహోర్ హైకోర్టు (LHC)కి జైలు సూపరింటెండెంట్ సమర్పించిన నివేదిక ప్రకారం, 71 ఏళ్ల ఖాన్‌కు జైలు ఆవరణలో రక్షణ కల్పించేందుకు రూ. 5 లక్షల ఖర్చుతో ప్రత్యేక సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. ఈ జైలులో దాదాపు 7 వేల మంది ఖైదీలు ఉన్నారు.
ఖాన్ భోజనం, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ప్రత్యేక వంటగదిలో తయారు చేస్తున్నారు. వడ్డించే ముందు వైద్య అధికారి లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ తనిఖీకి చేస్తున్నారని, ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక వెల్లడించింది.
మాజీ ప్రధానికి వైద్య సంరక్షణ అందించడానికి హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ నుంచి ఆరుగురికి పైగా వైద్యుల బృందం ఎప్పుడు అందుబాటులో ఉంటోంది. అదనపు నిపుణుల బృందాలు రెగ్యులర్ చెకప్‌లను నిర్వహిస్తున్నాయి. జైలులో ఉన్న రెండు ప్రత్యేక సెల్లులను ఇమ్రాన్ ఖాన్ కు కేటాయించారు. మిగిలిన ఐదు భద్రతా కారణాల దృష్ట్యా మూసి ఉంచారు.
సాధారణంగా ఈ సెల్‌లలో 35 మంది ఖైదీలకు వసతి కల్పిస్తారు. ఇమ్రాన్ సెల్ చుట్టు కఠిన ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా ఎవరూ కూడా ఇక్కడికి రావడానికి వీలులేదు. అడియాలా జైలు సాధారణంగా ప్రతి పది మంది ఖైదీలకు ఒక సిబ్బందిని కేటాయిస్తే, ఖాన్ యొక్క భద్రతా కోసం 15 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో ఇద్దరు భద్రతా అధికారులు కాగా మరో ముగ్గురు అతని వ్యక్తిగత భద్రతకు అంకితమయ్యారు.
అంతేకాకుండా, జైలు ప్రాంగణంలో ఒక నిర్దేశిత ప్రాంతం ఇమ్రాన్ ఖాన్ నడక కోసం కేటాయించబడింది, ఇందులో వ్యాయామ యంత్రాలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.


Read More
Next Story