ఈ మహిళలు ఉగ్రవాదులను ఎలా ఓడించారు
x

ఈ మహిళలు ఉగ్రవాదులను ఎలా ఓడించారు

భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ గురించి వినని వారుండరు. పశ్చిమాసియాలో రక్తపుటేర్లు పాలించి ఖలీఫా రాజ్యం స్థాపిస్తామని ప్రతినబూనింది ఈ ఉగ్రసంస్థ. అప్పటికే అశాంతితో కొట్టుమిట్టాడుతున్న సిరియా, ఇరాక్ కేంద్రంగా చేసుకుని తమ సామ్రాజ్యాన్ని నెలకొల్పి విస్తరణ ప్రారంభించింది.


సిరియాలోని రక్కా, ఇరాక్ లోని మోసూల్ ను రాజధానిగా చేసుకుంది. షియాలు, యాజిడిలు అనే ముస్లిం జాతులను ఎక్కడ దొరికితే అక్కడే వధించింది. యాజిడి మహిళలపై లెక్కలేనన్నీ అత్యాచారాలకు ఒడిగట్టింది. ఆజాతి మహిళలను అంగట్లో అమ్మివేసింది. దాంతో అక్కడే మిగిలిన జాతులు ప్రాణ భయంతో యూరప్, అమెరికా, టర్కీ లాంటి దేశాలకు పారిపోయి తలదాచుకున్నాయి. కానీ ఒక్క జాతి మహిళలు మాత్రం ఐసిస్ అంతు చూడాలని నిర్ణయించుకున్నారు. ప్రాణం పోయినా సరే.. తమ ప్రాంతాన్ని వదిలేది లేదని భీష్మించుకున్నారు. ఆ జాతే కుర్దులు.. సున్నీ తెగకు చెందిన ముస్లింలు. వీపుకు తమ బిడ్డలను కట్టుకుని, చేతిలో ఏకే 47 తుఫాకులతో ఐసిస్ ఫైటర్లపై విరుచుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లుగా తలనరికే ఐసిస్ కే తమ పోరాటంతో వెన్నులో వణుకు పుట్టించారు. ఐసిస్ తీవ్రవాదులు, ఈ మహిళలను చూసి చాలాసార్లు తుఫాకులు వదిలిపారిపోయేవారు... కానీ... ఎందుకు.. అసలీ ఈ కుర్థుల చరిత్ర ఏంటీ...?

ఎవరీ కుర్దులు?

పశ్చిమాసియాలో ఉన్న ఒక ప్రత్యేక జాతి. తమకు కూడా స్వతంత్ర దేశం కావాలని దాదాపుగా వంద సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తున్నారు. వీరి జనాభా దాదాపు 30 నుంచి 40 లక్షల దాకా ఉంటుందని ఒక అంచనా. అయితే వీరంతా ఒకే దేశం ఆధీనంలో లేకపోవడంతో వీరి పోరాటాలన్నీ వృథా అవుతున్నాయి. కుర్థు ప్రజలు అత్యధికంగా ఇరాక్ లో ఉన్నారు. కానీ ఈ ప్రజలు నివసించే అత్యధిక భూభాగం టర్కీ దగ్గర ఉంది. ఇరాక్ లో వీరికి ప్రత్యేక అటానమస్ రీజియన్, సొంత సైన్యం, పాలన వ్యవస్థ, రాజకీయ పార్టీలు, పట్టువిడుపు కలిగిన నాయకగణం కూడా ఉంది. మిగిలిన కుర్ధులు సిరియా, ఇరాన్ లో ఉన్నారు. వీరి దేశం ఏర్పడితే కుర్ధిస్తాన్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ స్వతంత్ర దేశం ప్రతిపాదననను మిగిలిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.


కుర్దుల జనాభా టర్కీలో తక్కువగా ఉన్నప్పటికీ వారు నివసించే ప్రాంతం చాలా పెద్దది కావడం, దాదాపు టర్కీలో 20 శాతం భూభాగం కుర్దులకు వెళ్లిపోతుందని టర్కీ భయపడుతోంది. దీంతో అంకారా పాలకులు ముందు నుంచి కుర్ధిస్తాన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, వారిపై ఉగ్రవాదులని ముద్ర వేసి అణచివేత విధానాలను అవలంభించింది. దీంతో మిగిలిన దేశాలు కూడా స్వతంత్ర దేశం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. టర్కీ సాయుధ దాడులు.. కుర్థులను కూడా ఆయుధం పట్టేలా చేసింది. అది క్రమంగా మహిళలు సైతం పోరాటం చేయడానికి పురిగొల్పింది. అదే ఐసిస్ కథ ముగించడానికి సాయం చేసింది.

అదేంటంటే .. ఇస్లాంలో ఒక నిబంధన ఉందట. ఇస్లాం మహిళల చేతిలో ఎవరైనా పురుషుడు మరణిస్తే అతడు... అల్లా ఆగ్రహానికి గురై.. జన్నత్ కి చేరడట. యజిడి మహిళలను ఐసిస్ కిరాతకంగా హతమార్చడం, అంగట్లో అమ్మివేయడంతో కుర్దు నాయకత్వం మహిళలను రంగంలోకి దింపింది. అప్పటికే శారీరకంగా బలంగా ఉండడం, ఆయుధ శిక్షణ లభించడంతో ఈ మహిళలు చెలరేగిపోయారు. ఐసిస్ విస్తరణ తమ కుర్థు ప్రాంతంలోకి రాకుండా విజయవంతంగా అడ్డుకోగలిగారు. వారి ఆధిపత్యం తగ్గగానే అమెరికా, రష్యా, ఇరాన్ కు చెందిన ఫైటర్లు ఐసిస్ పై విరుచుకుపడి వారిని తుదముట్టించారు. ఇలా ఐసిస్ ప్రాభావాన్ని అడ్డుకోవడంలో కుర్దు మహిళలు విజయవంతం అయ్యారు.

Read More
Next Story