సాహిత్యంలో హంగేరియన్ రచయితకు నోబుల్ పురస్కారం
x

సాహిత్యంలో హంగేరియన్ రచయితకు నోబుల్ పురస్కారం

అక్టోబర్‌ 6 నుంచి 13 వ తేదీ వరకు నోబుల్ ప్రైజ్ విజేతల పేర్ల వెల్లడి..


Click the Play button to hear this message in audio format

సాహిత్యం(Literature)లో విశేష కృషి చేసినందుకు హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై(Krasznahorkai)కి నోబెల్(Noble) పురస్కారం దక్కింది. గత సంవత్సరం దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు ఈ బహుమతి అందుకున్నారు.

లాస్లో 1954 జనవరి 5న హంగేరీలోని యూలా పట్టణంలో జన్మించారు. సాహిత్యంలో యూనివర్సిటీ స్థాయి చదువులు పూర్తి చేశారు. ఆయన తొలి నవల Satantango (1985)కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ నవల ఆధారంగా Béla Tarr దర్శకత్వంలో సినిమా కూడా వచ్చింది. లాస్లో రచనల్లో మానవ స్థితి, అస్తిత్వ సమస్యలు, యుద్ధానంతర తూర్పు యూరప్‌లోని సామాజిక-రాజకీయ వాస్తవాలు ప్రముఖంగా కనిపిస్తాయి. హంగేరియన్ సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆధునిక రచయితల్లో ఈయన ఒకరు.

లాస్లో ఇతర రచనలు..

The Melancholy of Resistance (1989)

War and War (1999)

Seiobo There Below (2008) – ఇది 2015లో Booker International Prize గెలిచింది.

పురస్కారాలు..

2015లో International Booker Prize అందుకున్నారు.

2019లో Austrian State Prize for European Literature దక్కింది.

ఇతర అనేక యూరోపియన్ సాహిత్య పురస్కారాలు పొందారు.

లాస్లోను తరచుగా "సాహిత్యంలో కాఫ్కా వారసుడు" అని పిలుస్తారు. దీర్ఘ వాక్య నిర్మాణం, లోతైన ఆలోచనలతో ఆయన సాహిత్యం క్లిష్టంగా అనిపించినా.. లోతైన తాత్విక ప్రశ్నలు లేవనెత్తుతాయి.


లాస్లో తాజా రచనలు..

Krasznahorkai తాజా రచనలు Zsömle odavan 2024లో ప్రచురితమైంది. Herscht 07769 : Florian Herscht Bach-regénye : elbeszélés 2021లో ప్రచురితమయ్యాయి. హెర్ష్ట్‌ను ఒట్టిలీ ముల్జెట్ ఆంగ్లంలోకి అనువదించారు.

నోబెల్ బహుమతి పురస్కారాలను అక్టోబర్‌ 6 నుంచి 13 వ తేదీ వరకు ప్రకటించనున్నారు. ఇటీవల వైద్యశాస్త్రంలో, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం‌లో నోబెల్ ప్రైజ్‌ గెలుచుకున్న వారి పేర్లు ప్రకటించారు. గురువారం సాహిత్యం విభాగంలో నోబెల్ బహుమతి విజేత పేరును ప్రకటించారు. శుక్రవారం శాంతి బహుమతి, చివరగా అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోబోయే వారి పేర్లను ప్రకటించనున్నారు.

Read More
Next Story