నేనున్నాను.. నేనే గెలుస్తాను: జో బైడెన్
x

నేనున్నాను.. నేనే గెలుస్తాను: జో బైడెన్

నవంబర్ 5 న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా తాను ఉంటానని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ట్రంప్ తో జరిగిన డిబెట్ లో...


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా తానే పోటీలో ఉన్నానని, ఉంటానని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అభ్యర్థిత్వానికి సంబంధించిన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుంటున్నానని చెప్పారు. ఎన్నికల్లో మరోసారి గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అట్లాంటాలో ట్రంప్ తో జరిగిన తొలి డిబెట్ లో బైడెన్ చాలా సార్లు తడబడ్డారు. అప్పటి నుంచి ఆయనను మార్చాలని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభ మయింది. వీటిని క్లియర్ చేయడానికి ఆయన ప్రయత్నించారు.

"గత వారం మాకు చిన్న చర్చ జరిగింది. ఇది నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పలేము. కానీ అప్పటి నుంచి, చాలా ఊహాగానాలు ఉన్నాయి. జో ఏమి చేయబోతున్నాడు? అతను రేసులో ఉంటాడా? నిష్ర్కమిస్తాడా? పార్టీ ఏం చేయబోతోంది. వీటన్నింటికి నా సమాధానం ఇదే. నేను ఎన్నికల్లో ఉంటాను.. గెలుస్తాను.. అని బైడెన్ విస్కాన్సిస్ లో జరిగిన ర్యాలీలో తన మద్ధతుదారులనుద్దేశించి అన్నారు.
"నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిట్టింగ్ ప్రెసిడెంట్, 2020లో మీరు నా కోసం వచ్చారు. నేను డెమోక్రటిక్ పార్టీ నామినీని. ఈ నామినీకి మీలాంటి లక్షలాది మంది డెమొక్రాట్‌లు అమెరికా అంతటా ఓటు వేశారు. కాబట్టి మీరు నాకు నామినీగా మారారు’’ అని బైడెన్ అన్నారు.
"అయితే మీరు ఎవరికి ఓటు వేశారో, ఇప్పుడా ఆ వ్యక్తిని పట్టించుకోవడం లేదు. మీరు నన్ను రేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. నేను డోనాల్డ్ ట్రంప్‌ను 2020లో ఓడించాను. 2024 లోనూ ఓడించగలను. "నేను చాలా కాలం క్రితం నేర్చుకున్నాను. పడగొట్టినప్పుడే మనమంతా తిరిగి లేవగలమని అన్నారు.
మూడున్నర నిమిషాల పనిని కేవలం 90 నిమిషాల్లో ముగించడం భావ్యంకాదు. నేను అంగీకరించనని అన్నారు. నేను ఈ దేశాన్ని అగాథం నుంచి రక్షించాను. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ మహమ్మారీ నుంచి రక్షించాను. ఇది ఇంకా పూర్తి కాలేదని అన్నారు. తన వయస్సుకు ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఈ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు.
"మీరు బహుశా నా వయస్సు గురించి చాలా చర్చలు కూడా గమనించి ఉంటారు. నేను చాలా పెద్దవాడిని అనే కథనాలన్నీ నేను చూస్తూనే ఉన్నాను. ఏదో ఒకటి చెప్పనివ్వండి. 21 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించేంత వయస్సు నాకు లేదు. అమెరికన్లు స్థోమత.. రక్షణ చట్టం కింద బీమా చేయబడతారు. ఇది సీజన్ కు 35 యూఎస్ డాలర్లకు తగ్గించబడింది" అని బైడెన్ చెప్పారు.
"దాదాపు 5 మిలియన్ల మంది అమెరికన్లకు విద్యార్థుల రుణాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నాకు పెద్ద వయసు అడ్డంకి గా ఉందా? మొదటి నల్లజాతి మహిళను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీం కోర్టులో నిలబెట్టాం. వివాహ గౌరవం చట్టంపై సంతకం చేశాం. తుఫాకీ భద్రతా చట్టం, ప్రపంచంలోనే అతిపెద్ద వాతావరణ బిల్లుపై సంతకం పెట్టా అని అధ్యక్షుడు వివరించారు.
ట్రంప్ ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండో అమెరికన్ అజయ్ భూటోరియా ఆయన పిలుపునిచ్చారు.
"అధ్యక్షుడు బిడెన్ అనేక సవాళ్ల మధ్య తన నిబద్ధతను చాటుకున్నారని కొనియాడారు, తన అభ్యర్థిత్వాన్ని డెమొక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని గెలవాలనే సంకల్పాన్ని ధృవీకరిస్తూ," అని ఇండియన్-అమెరికన్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పై విజయం సాధించడానికి అందరూ కలికట్టుగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నవంబర్‌లో ట్రంప్‌ను ఓడించేందుకు అధ్యక్షుడు బైడెన్, వైస్ ప్రెసిడెంట్ హారిస్‌లకు తాను గట్టిగా మద్దతుగా నిలుస్తానని భూటోరియా చెప్పారు.
Read More
Next Story