ఇండియాలో ‘యాపిల్‌’ వద్దు..
x

ఇండియాలో ‘యాపిల్‌’ వద్దు..

సీఈవో టిమ్‌‌కుక్‌కు ట్రంప్‌ సూచన..


Click the Play button to hear this message in audio format

భారత్‌లో యాపిల్‌ సంస్థను విస్తరించొద్దని అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) యాపిల్ (iPhone) సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook)కు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా వెల్లడించినట్లు జాతీయ మీడియా ఇండియా టుడే తెలిపింది. ప్రస్తుతం అరబ్‌ దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్‌ నిన్న ఖతార్‌ను సందర్శించారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో యాపిల్‌ సీఈవోతో పాటు పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ తన అభిప్రాయాన్ని టిక్‌ కుక్‌కు పంచుకున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఇండియా ఒకటి. అందువల్ల అక్కడ అమ్మకాలు చాలా కష్టం. యాపిల్‌ సంస్థను భారత్‌కు విస్తరించే ఆలోచన విరమించుకో’’ అని సూచించారు.

ఇప్పటికే ప్రత్నామాయన్వేషణలో ఆపిల్..

అమెరికా (US), చైనా (China) దేశాల మధ్య టారిఫ్‌ యుద్ధం (Tariffs war) నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో ఉన్న యాపిల్‌ (Apple).. 2026 కల్లా ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలన్నీ భారత్‌కు మళ్లించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చైనాపై అమెరికా సుంకాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని టిమ్ కుక్ ఇటీవల ప్రకటించారు. ఐపాడ్స్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్ వంటి ఉత్పత్తులను మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది.

Read More
Next Story