మీరు తప్పుకుంటేనే గెలుస్తాం: హలీవుడ్ డైరెక్టర్
x

మీరు తప్పుకుంటేనే గెలుస్తాం: హలీవుడ్ డైరెక్టర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలని హలీవుడ్ డైరెక్టర్ డిమాండ్ చేశారు. ఈయనతో మనం మరోసారి గెలవలేమని ఆయన అన్నారు.


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున మరోసారి పోటీ చేయడానికి సిద్ధం అంటూ ప్రకటనలు చేస్తున్న జో బైడెన్ కు క్రమక్రమంగా మద్ధతు తగ్గుతోంది. బయట పార్టీ నుంచే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా ఆయన అభ్యర్థిత్వంపై పెదవి విరుస్తున్నారు.

తాజాగా డెమొక్రాటిక్ పార్టీకి భారీ స్థాయిలో ఫండ్స్ ఇచ్చే హలీవుడ్ నటుడు, డైరెక్టర్ కూడా బైడెన్ అభ్యర్థిత్వం పై తన వ్యతిరేకతను బయటపెట్టాడు. తనకు బైడెన్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే కచ్చితంగా ఓడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్( అమెరికా పార్లమెంట్) లో కూడా డెమొక్రాట్లు పట్టుకోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ కు ఆయన ఓ లేఖ రాసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“మేము ఈ అధ్యక్షుడితో నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేము. పైగా సెనేట్‌ను కూడా కోల్పోతాము. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. ఇది నేను వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రతి సెనేటర్, కాంగ్రెస్ సభ్యుడు గవర్నర్ అభిప్రాయం" అని క్లూనీ న్యూయార్క్ టైమ్స్ కి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. అతను గత నెలలో డెమొక్రాటిక్ పార్టీ తరఫున హలీవుడ్ నటుల నుంచి విరాళాలు సేకరించాడు.
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా తన బలహీనమైన చర్చ ప్రదర్శన తర్వాత కూడా అధ్యక్షుడు జో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. దీనిపై పలు నాయకులు స్పందించడం ప్రారంభించారు. రెండురోజుల క్రితం కూడా సెనెట్ లోని కొంతమంది డెమొక్రాట్లు బైడెన్ కు వ్యతిరేకంగా ఆన్ లైన్ లో మీటింగ్ నిర్వహించుకున్నారు. ఆయనను అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోమని కోరారు. అయితే వీటిని ఆయన, ఆయన మద్ధతుదారులు తోసిపుచ్చారు.
ఆయన పాత బైడెన్ కాదు..
ట్రంప్ తో జరిగిన చర్చల్లో తాను ఎక్కడా పాత బైడెన్ ను చూడలేకపోయా అని క్లూనీ వివరించాడు. ప్రస్తుతం నేను చూసిన బైడెన్, 2010 నాటి వ్యక్తికాదు. కనీసం 2020 నాటి కొత్త అధ్యక్షుడు కూడా కాదని వివరించాడు. అతనిలో చాలా మార్పులు వచ్చాయని లేఖలో పేర్కొన్నాడు.
ఈ యుద్దంలో అతను గెలవలేడని, ఇది చెప్పడం ఇష్టం లేకున్నా చెప్పక తప్పట్లేదని వివరించాడు. బైడెన్ అలసిపోయాడని, అతను ఇంకా పోటీ చేస్తాడని ఆ పార్టీ నాయకులు చెప్పడం మానుకోవాలని లేఖలో కోరారు. ట్రంప్ రెండో విడత పాలనపై తాము ఆందోళనలతో ఉన్నామని వివరించారు.
బైడెన్ అంటే నాకు వ్యతిరేకత లేదని, ఒక సెనెటర్ గా, ఉపాధ్యక్షుడిగా, ఒక ప్రెసిడెంట్ గా ఇష్టపడుతున్నానని, గత నాలుగు సంవత్సరాలలో అతను ఎదుర్కొన్న అనేక పోరాటాల్లో విజయం సాధించారని క్లూనీ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అతని గెలుపుమీద నమ్మకం లేదని కుండబద్దలు కొట్టారు.
కొత్త నామినీ అవసరం
వచ్చే నెల జరిగే సమావేశంలో పార్టీ కొత్త నామినీని ఎంచుకోవాలని క్లూనీ వాదించారు, ప్రక్రియ "గజిబిజిగా" ఉంటుందని, అయితే పార్టీకి అనుకూలంగా ఓటర్లను సమాయత్తం చేయాలని అన్నారు. "అగ్ర డెమొక్రాట్లు - చక్ షుమెర్, హకీమ్ జెఫ్రీస్, నాన్సీ పెలోసి - సెనేటర్లు, ప్రతినిధులు కూడా బైడెన్ స్వచ్చందంగా తొలగమని అడగాలి’’ అని ఆయన వాదిస్తున్నారు.
“డెమోక్రాట్‌లకు చాలా ఉత్సాహవంతమైన నాయకులు ఉన్నారు. మేము నాయకులను అభిషేకించము. వ్యక్తిత్వ ఆరాధనలో పడము. మేము అధ్యక్షుడికి ఓటు వేస్తాము. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నేతృత్వం వహించిన తరువాత వస్తున్న పరిణామాలను మొత్తంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితి మారాలి. డెమొక్రాట్లు బలమైన నాయకులను నిలబెట్టాలని’’ క్లూనీ అభిప్రాయపడ్డారు.
Read More
Next Story