
అమెరికాలో గ్రీన్ ల్యాండ్ కలపాలనే ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న ప్రజలు
‘‘మా మాట వినకపోతే 200 శాతం సుంకాలు విధిస్తాం‘‘
ఫ్రాన్స్ కు ట్రంప్ హెచ్చరిక
గాజా పున: నిర్మాణంపై తాను ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ లో చేరమనే ఆహ్వానాన్ని ఫ్రాన్స్ తిరస్కరించడంపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ వైన్, షాంపైన్ పై 200 సుంకాలు విధిస్తామని బెదిరింపులకు దిగారు.
యుద్ధంలో భారీగా దెబ్బతిన్న గాజా పునర్నిణాన్ని పర్యవేక్షించడానికే ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్ ఇప్పుడు పాలస్తీనా భూభాగం పరిధి దాటి ఇతర దేశాలకు సైతం విస్తరించింది.
అయితే ఈ బోర్డులో తాము చేరబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. దీనితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారియాలు మిరియాలు నూరుతున్నాడు. ఫ్రెంచ్ అధ్యక్షుడు అమెరికాకు పంపిన సందేశాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఖాతా అయిన ‘ద ట్రూత్’ లో పోస్ట్ చేసి దౌత్య నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ఫ్రాన్స్ పై బహిరంగ బెదిరింపులకు దిగాడు.
‘‘అతని(మాక్రాన్) వైన్లు, షాంపైన్లపై నేను 200 శాతం సుంకాలు విధిస్తాను, దీనితో అతను చేరతాడు. కానీ అతని అవసరం ఇప్పుడు లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బోర్డ్ ఆఫ్ పీస్ వ్యవహరంలో ఇతర దేశాలకు విస్తరించడం, గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ ఏం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని మాక్రాన్ ఇందులో వ్యాఖ్యానించారు.
గ్రీన్ ల్యాండ్ స్థిరీకరణను అపహాస్యం..
డెన్మార్క్ లో భాగమైన గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ ఎందుకు కావాలనుకుంటున్నారో అని ఫ్రాన్స్ చేసిన ప్రకటనపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఎగతాళి చేశారు.
ఇదే సమయంలో ట్రంప్ సైతం ఇలాంటి మాట తీరునే ప్యారిస్ పై వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా ప్యారిస్ కూడా ఆర్కిటిక్ పై అమెరికా దృక్ఫథాన్ని ఎగతాళి చేసింది. ‘‘అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగినప్పుడే వస్తారు. కొన్ని సార్లు కొంతమంది ముందే ఇంటిని తగలబెడతారు’’ అనే అర్థంలో గ్రీన్ ల్యాండ్ పై అమెరికా చేస్తున్న రష్యా, చైనా వాదనలను ఫ్రాన్స్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
విందుకు ఆహ్వానం..
ఫ్రెంచ్ అధ్యక్షుడు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ట్రంప్, సహ ఇతర జీ7 నాయకులను కలిసేందుకు ముందుకొచ్చారు. ఉక్రెనియన్, సిరియా, రష్యాన్లు కూడా ఆహ్వానించవచ్చని పేర్కొన్నారు.
యూఎస్ హేతుబద్దత
గ్రీన్ ల్యాండ్ ఒత్తిడిని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ సమర్థించడంపై ఫ్రాన్స్ స్పందించింది. ఆర్కిటిక్ లో రష్యా నుంచి భవిష్యత్ లో వచ్చే ముప్పులపై అధ్యక్షుడు దృష్టి సారిస్తారని వెల్లడించింది. బెసెంట్ వాదన ప్రకారం.. ఆర్కిటిక్ కోసం జరిగే పోరాటం నిజమైనది. ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ పై దాడి జరిగితే అమెరికా కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అలాంటి చర్యలను అడ్డుకుంటుంది.
Next Story

