నేను తప్పుకోవడం లేదు, ఎన్నిక పూర్తి చేస్తా: బైడెన్
x

నేను తప్పుకోవడం లేదు, ఎన్నిక పూర్తి చేస్తా: బైడెన్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరగనున్నాయి. దీనిపై తొలి డిబెట్ అట్లాంటాలో జరిగింది. ఈ చర్చల్లో రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి..


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన తొలిచర్చల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విఫలం అవడంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలని, మరో కొత్త అభ్యర్థి బరిలోకి దిగాలని డెమోక్రాట్ అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే ఈ విషయంపై బైడెన్ స్పందించారు. తాను అధ్యక్ష ఎన్నిక నుంచి ఇంకా వైదొలగట్లేదని నవంబర్ 5 న జరిగే ఎన్నికలను పూర్తిచేస్తానని ప్రకటించారు. ఇటు డెమోక్రాటిక్ పార్టీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల నామినీగా బైడెన్ ఉన్నారని, ఆయనను మార్చడం లేదని వెల్లడించింది. ప్రస్తుతం ఆయన 46 వ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రైమరీలో ఆయన ట్రంప్ పైనే గెలుపొందారు.

పార్టీ నామినేషన్ గెలవడానికి 1,975 మంది ప్రతినిధులు బైడెన్ కు అవసరం కాగా, జూన్ 29 నాటికి, ఆయనకు 3,894 మంది ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రతినిధులు చికాగోలో ఆగస్టు 19 నుంచి 22 వరకు సమావేశమై నవంబర్ 5 అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయడానికి ప్రైమరీలలో విజేతను అధికారికంగా నామినేట్ చేస్తారు.
అట్లాంటాలో సీఎన్ఎన్ వార్తా సంస్థ ఏర్పాటు చేసిన డిబెట్ లో ట్రంప్ వాగ్థాటి ముందు బైడెన్ తెలిపోయారు. సీఎన్ఎన్ పూర్తిగా డెమోక్రాట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే పేరుంది. అయినప్పటికీ ఆ ఛానల్ డిబెట్ లో బైడెన్ కేవలం 37 శాతం మాత్రమే మద్ధతు పొందారని ప్రకటించింది. ఇది డెమోక్రాట్ లలో నైరాశ్యం ఆవహించేలా చేసింది. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. దాదాపు 90 నిమిషాల పాటు ఈ చర్చ జరిగింది. ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.
గురువారం రాత్రి అట్లాంటాలో జరిగిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత గత 50 గంటలలో, అతని ప్రత్యర్థి ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ పనితీరు నిరాశజనకంగా కనిపించింది. న్యూయార్క్ టైమ్స్, అతని స్వంత పార్టీ మద్దతుదారులు కీలక నిర్ణయాధికారులతో సహా పలు మీడియా సంస్థలు బైడెన్ ను తప్పుకోవాలని కోరుతున్నాయి. అతని నిజమైన దేశభక్తి అభ్యర్థిత్వాన్ని వదులుకోవడంలోనే ఉందని తెలిపింది.
"తన దేశానికి సేవ చేయడానికి, ప్రెసిడెంట్ రేస్ నుంచి బైడెన్ నిష్క్రమించాలి" అని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయం రాసింది. న్యూయార్క్ టైమ్స్ ఇలా రాసింది, "మిస్టర్ బిడెన్ ఈ సంవత్సరం డెమొక్రాటిక్ నామినీగా ఎందుకు ఉండాలి అనేదానికి ఇది తగిన కారణం లేదు." పార్టీ అంతర్గతంగా ఇదే ఆలోచిస్తోందని వ్యాఖ్యానించింది. అయితే బైడెన్ ను సమర్థిస్తున్న బృందం మాత్రం దీనిని ఖండించింది. చర్చ తరువాత పది శాతం ఉన్న స్వతంత్ర ఓటర్లు బైడెన్ వైపు మళ్లారని వాదిస్తున్నారు.
"బరాక్ (ఒబామా) ఎత్తి చూపినట్లు ఇది నా ఉత్తమ చర్చ కాదు. చర్చ తర్వాత ఆందోళన నాకు అర్థమైంది" అని న్యూజెర్సీలో తన నిధుల సేకరణ తరువాత బైడెన్ అన్నారు. "నాకు అర్థమైంది. నాకు మంచి రాత్రి లేదు, కానీ నేను మరింత గట్టిగా పోరాడబోతున్నాను, ”అని అమెరికా అధ్యక్షుడు చెప్పాడు.
"జనవరి 6 న అతని ప్రవర్తన కారణంగా ట్రంప్ అనేకమంది ఓటర్లను కోల్పోయారు. వారంతా మారినట్లు కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి. ట్రంప్ అబద్ధాలు అతిపెద్ద టేక్ అవే అని బైడెన్ నమ్ముతున్నారు. "అతను(ట్రంప్) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రజలు చెడు విషయాలను గుర్తుంచుకుంటారు" "నాకు గొప్ప రాత్రి లేదు, కానీ అతనికి కూడా కాదు," అతను బైడెన్ అంటున్నారు. అయితే అనేకమంది కాలమిస్టులు ట్రంప్ పై బైడెన్ ఓడిపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
Read More
Next Story