భారత్ ఎఫెక్ట్: పాకిస్తాన్ తో కీలక ఒప్పందం నుంచి వైదొలగిన యూఏఈ
x
ప్రధాని మోదీతో యూఏఈ అధ్యక్షుడు జాయోద్

భారత్ ఎఫెక్ట్: పాకిస్తాన్ తో కీలక ఒప్పందం నుంచి వైదొలగిన యూఏఈ

సౌదీకి దగ్గరవుతున్న పాకిస్తాన్, ఢిల్లీకి స్నేహ హస్తం అందిస్తున్న అబుదాబి


చెప్పాపెట్టకుండా భారత్ లో మూడు గంటల పర్యటనకు వచ్చి, వెళ్లిన యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్, తరువాత పాకిస్తాన్ కు షాక్ ఇచ్చాడు. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహించే ప్రణాళిక నుంచి వైదొలగాలని యూఏఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ ఒప్పందం కోసం పాకిస్తాన్- యూఏఈ మధ్య చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. దీనిని పాక్ పత్రికలు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

అరబ్ దేశం ఆకస్మాత్తుగా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి కోల్పోయి ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. దీనికి ఎటువంటి రాజకీయా కారణాలు లేవని, బాహ్య(భారత్) ఒత్తిడులు రాలేదని పేర్కొంది.

ఇటీవల కాలంలో యెమన్ విషయంలో సౌదీ, యూఏఈ మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య సైనిక సహకారం పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తో యూఏఈ సంబంధాలు పెంచుకుంటోంది. ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న రియాద్, అబుదాబి ఇప్పుడు అనేక రంగాలలో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్నాయి.
పాకిస్తాన్- యూఏఈ మధ్య అభిప్రాయాలు..
యూఏఈ- పాకిస్తాన్ నాలుగు దశాబ్ధాలకు పైగా సంబంధాలు ఉన్నాయి. యూఏఈ, పాకిస్తాన్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇక్కడ నుంచి పాక్ కు అత్యధిక రెమిటెన్స్ లు వస్తున్నాయి.
అరబ్ దేశంలో వేలాది మంది పాకిస్తానీలు పనిచేస్తున్నారు. రక్షణ, ఇంధనం, పెట్టుబడి రంగాలలో ఇరుదేశాలకు ఒప్పందాలు ఉన్నాయి. ప్రస్తుతం పాక్, సౌదీతో అంటకాగడం అబుదాబికి నచ్చడం లేదు.
కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. తక్కువ ధరలకు అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇస్లామాబాద్ తనకు చెందిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను ప్రయివేటికరించేందుకు ముందుకు వచ్చింది. అబుదాబికి ఎయిర్ లైన్స్ లో మంచి అనుభవం ఉంది. అయితే అది ఇప్పుడు ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది.
పాకిస్తానీల వైఖరి, క్రమంగా పెరుగుతున్న నేరాల సంఖ్య, విజిట్ వీసాల దుర్వినియోగం చేయడంతో యూఏఈ కూడా ఇస్లామాబాద్ పై అనేక ఆంక్షలు విధించింది. ఇది ఈ పాక్ కు పెద్ద ఎదురుదెబ్బ.
యూఏఈ- భారత్ సంబంధాలు..
రక్షణ, ఆర్థిక సహాకారం విషయంలో పాకిస్తాన్- భారత్ కు దగ్గరవుతుండగా, పాకిస్తాన్ సౌదీ అరేబియా వైపు మొగ్గు చూపుతోంది. జనవరి 2026 లో ప్రధాన దీర్ఘకాలిక, అంతరిక్ష మౌలిక సదుపాయాల ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా యూఏఈ భారత్ తో వ్యూహాత్మక అణు సహకారాన్ని బలోపేతం చేసుకుంది.
గతవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన తరువాత ఆ దేశ జైళ్ల లో మగ్గుతున్న 900 మంది భారతీయ ఖైదీలను విడుదల చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ పర్యటన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జాయెద్ ద్వైపాక్షిక సంబంధాలను అన్నింటిని సమీక్షించారు. భారత్- యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పరిణితి చెందడమే కాకుండా ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకమైన తదుపరి దశలోకి అడుగుపెట్టింది.
Read More
Next Story