భారత్ నా మాతృభూమి: పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా
x
పాక్ మాజీ క్రికెటర్ డానిష్ ప్రభాశంకర్ కనేరియా

భారత్ నా మాతృభూమి: పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా

పాక్ అధికారులు, పీసీబీ నుంచి మతమార్పిడుల ఒత్తిడి ఎదుర్కొన్నానని చెప్పిన హిందూ క్రికెటర్


భారత్ తన మాతృభూమి అని, పాక్ తన జన్మభూమి పాక్ కు చెందిన మాజీ క్రికెటర్ అయిన డానిష్ కనేరియా అన్నారు. తనకు భారత పౌరసత్వం కోరే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. అయితే పాక్ లో అధికారులు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డునుంచి తాను తీవ్ర వివక్ష ఎదుర్కొన్నానని పాక్ లో తొలి హిందూ క్రికెటర్ అయిన కనేరియా తెలిపారు.

తీవ్ర వివక్ష
పాక్ జట్టుకు 2000 నుంచి 2010 వరకూ కనేరియా ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా పాక్ తరఫున 61 టెస్ట్ లు, 18 వన్డేలు ఆడాడు. ఆయన ఎక్స్ లో భారత్ పై ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. భారత అంతర్గత విషయాలపై తను చేసే వ్యాఖ్యలపై చాలామంది తనను ప్రశ్నిస్తున్నారని వారికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
‘‘కొన్ని రోజుల నుంచి చాలా మంది పాక్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని, భారత అంతర్గత విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావని అడుగుతున్నారు. మరికొందరు అయితే నేను భారతీయ పౌరసత్వం కోసం ఇదంతా చేస్తున్నానని ఆరోపించారు. ఇలాంటి వాటిని సరిదిద్దడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను’’ అని మాజీ లెగ్ స్పిన్నర్ అయిన కనేరియా తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
‘‘పాక్ ప్రజల నుంచి నేను ప్రేమను పొందాను. కానీ కొందరి నుంచి ప్రేమతో పాటు బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు సహ తీవ్ర వివక్ష ఎదుర్కొన్నాను. అవి పీసీబీ, పాక్ అధికారులతో పాటు’’ అని ఆయన పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు..
భారతీయ పౌరసత్వంపై తనకు ఎలాంటి ప్రణాళికలు లేవని, పాక్ తన జన్మభూమి అని, భారత్ తన పూర్వీలకు మాతృభూమి అని చెప్పారు. సీఏఏ చట్టం గురించి కూడా మాట్లాడారు. ‘‘ భారత్ దాని పౌరసత్వం గురించి నేను స్పష్టంగా చెప్పాలి.
పాకిస్తాన్ నా జన్మభూమి కావచ్చు. భారత్ నా మాతృభూమి. భారత్ నాకు ఒక దేవాలయం లాంటిది. ప్రస్తుతం భారతీయ పౌరసత్వం కోసం నా దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవు. భవిష్యత్ లో అలాంటివి చేయాలని అనుకుంటే అక్కడ సీఏఏ మా లాంటి వారి కోసం అమలులో ఉంది’’ అని ట్వీట్ చేశారు.
శ్రీ రాముడి ఆశీస్సుల వల్ల తాను పాకిస్తాన్ లో సురక్షితంగా ఉన్నానని ఆయన తన పోస్ట్ ను ముగించారు. ‘‘నా మాటలు, చర్యలు భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నాయనే చెప్పుకునే వారి మాటలు తప్పు.
నేను ధర్మం కోసం నిలబడటం, మన నైతికతను దెబ్బతీస్తూ, మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న దేశ వ్యతిరేకులు, నకిలీ లౌకికవాదులను బహిర్గతం చేయడం కొనసాగిస్తాను. నా భద్రత కోసం ఆందోళన చెందుతున్న వారికీ, ప్రభు శ్రీరాముడి ఆశీస్సులతో నేనే నా కుటుంబంతో సురక్షితంగా, సంతోషంగా ఉన్నాను. నా విధి శ్రీ రాముడి చేతుల్లోనే ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వందో సంవత్సరం వేడుకులు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించారు.

‘‘ప్రపంచానికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు మరిన్ని అవసరం. గుర్తింపు కోరుకోకుండా సామాజిక సేవకు అంకితం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వారి పనిని నేను చూశాను. సమాజాలకు సహాయం చేయడం, పేదలకు మద్దతు ఇవ్వడం, యువతకు సాధికారత కల్పించడం వారి పని. కులం లేదు, మతం లేదు. సరిహద్దులు లేవు. కేవలం సేవ మాత్రమే వారి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి వాలంటీర్ కు నేను సెల్యూట్ చేస్తున్నాను’’ అని ఆయన అక్టోబర్ 2 న ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Read More
Next Story