భారత్- పాక్ వివాదం: ప్రపంచం క్రెడిట్ ఎందుకు కోరుకుంటోంది?
x

భారత్- పాక్ వివాదం: ప్రపంచం క్రెడిట్ ఎందుకు కోరుకుంటోంది?

అంతర్జాతీయ విశ్లేషకులు ఫెడరల్ కన్సల్టింగ్ ఎడిటర్ దక్షిణామూర్తి ప్రత్యేక విశ్లేషణ


పహల్గామ్ దాడి తరువాత భారత్, పాకిస్తాన్ మీద ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక దాడిని ప్రారంభించింది. అయితే ఈ వివాదం నాలుగు రోజుల తరువాత ఆగిపోయింది.

ఇప్పుడు దీనిపైనే పలు దేశాలు క్రెడిట్ ను క్లెయిమ్ చేస్తున్నాయి. సైనిక ఘర్షణను ఆపడంలో నేనే కీలక పాత్ర పోషించానని ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరో వైపు తాము కూడా వివాదాన్ని ఆపామని చైనా సెల్ప్ క్రెడిట్ ప్రకటించుకుంటున్నాయి.

ఇందులో ఉన్న విషయాలను వివరించడానికి ‘ది ఫెడరల్’ కన్సల్టింగ్ ఎడిటర్ కే ఎస్ దక్షిణామూర్తి మాట్లాడారు. ఈ వాదనలు ఎందుకు వస్తున్నాయి, భారత్ మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని నిరంతరం తిరస్కరిస్తోంది. ప్రాంతీయ, ప్రపంచ దౌత్యంలో దీని అర్థం ఏముందో ఓ ఆయన మాటల్లో విందాం


భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలకు తాము మధ్యవర్తిత్వం వహించాలని అమెరికా, ఇప్పుడు చైనా ఎందుకు క్లెయిమ్ చేస్తున్నాయి?
గత ఏడు నెలలుగా డొనాల్డ్ ట్రంప్ భారత్- పాకిస్తాన్ మధ్య వివాదాన్ని ముగించడానికి తానే కృషి చేశానని దాదాపు అరవై సార్లకు పైగా సెల్ప్ క్రెడిట్ ప్రకటించుకున్నారు. ట్రంప్ రెండోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తనను తాను శాంతికర్తగా చూపించుకోవడానికి ఆసక్తి కనపరిచారు.
ఇజ్రాయెల్- పాలస్తీనా, అజర్ బైజాన్, అర్మేనియా, థాయిలాండ్- కంబోడియాతో సహ అనేక అంతర్జాతీయ ఘర్షణలతో జోక్యం చేసుకున్నా అని ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. యూఎస్ ను నిర్ణయాత్మక ప్రపంచ మధ్యవర్తిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సూచిస్తుంది.
చైనా ఇలాంటి వాదనలు చేయడం మరింత ఆసక్తికరంగా ఉంది. బీజింగ్ తన వాదనలు భారత్, పాకిస్తాన్ లకే పరిమితం చేయలేదు. ఇరాన్- ఇజ్రాయెల్, ఇజ్రాయెల్- పాలస్తీనా, కంబోడియా- థాయిలాండ్ దేశాలకు సైతం విస్తరించింది.
ఇది చైనా, అమెరికా మధ్య ఆధిపత్య పోరు, అధికార పోరును సూచిస్తోంది. రెండు దేశాలు ఒకే సమయంలో ఒకే ఘర్షణలకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం లేదు. చైనా ఆకస్మిక ప్రకటన, అమెరికా దౌత్య విజయాలను ప్రకటిస్తున్నప్పుడు ఇకపై మౌనంగా ఉండటానికి ఇష్టపడకపోవచ్చని తెలుస్తోంది.
భారత్ విషయానికి వస్తే ఈ వాదనలు ఎంతవరకూ విశ్వసనీయమైనది?
చారిత్రాత్మకంగా, భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన కాలంలో అమెరికా జోక్యం చేసుకుంది. బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ పరిపాలన సందర్భంగా ఇవి చోటు చేసుకున్నాయి.
ఈ చరిత్ర కారణంగా అమెరికా వాదనలను తోసిపుచ్చలేము. అయితే చైనా వాదన క్లిష్టమైనది. చైనా, పాకిస్తాన్ సన్నిహితంగా ఉంటాయి. పాకిస్తాన్ కు సైనిక సామగ్రిలో ఎక్కువ మొత్తంలో చైనాకు చెందినవే ఉన్నాయి.
కొన్ని నివేదికల ప్రకారం ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన ఘర్షణలలో చైనా పరోక్షంగా పాల్గొంది. ఈ నేపథ్యం ప్రకారం చూస్తే.. చైనా ఎలా మధ్యవర్తిత్వం నెరిపిందో చెప్పడం, అంచనా వేయడం కష్టం. చైనా మధ్యవర్తిత్వం వహించాలంటే అది రెండు రకాలుగా పనిచేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తో పొత్తు పెట్టుకుంటే భారత్, పాక్ తో అవగాహానకు రావాలని సలహ ఇవ్వడం. దీనికి భారత్ ఒప్పుకునే అవకాశం లేదు.
భారత్ మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని ఎందుకు నిరాకరిస్తోంది?
జమ్మూ కాశ్మీర్ పై భారత్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఇవి చోటు చేసుకుంటున్నాయి. చారిత్రాత్మకంగా జమ్మూకశ్మీర్ కు సంబంధించిన అన్ని సమస్యలను భారత్- పాకిస్తాన్ మధ్య మాత్రమే చర్చల ద్వారా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని న్యూఢిల్లీ వాదన.
అమెరికా, చైనా రెండు కూడా జమ్మూకశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం కాదు, వివాదాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వం చేస్తామని చెబుతున్నాయి. ఈ వ్యత్యాసం గమనించాలి.
మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తే జమ్మూకశ్మీర్ సమస్య అంతర్జాతీయీకరించినట్లు అవుతుందని భారత్ భావన. అందుకే వరుసగా వస్తున్న ప్రభుత్వాలు దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి.
ఈ అంశంపై అకస్మాత్తుగా చైనా ఎందుకు క్రెడిట్ తీసుకోవాలని నిర్ణయించుకుంది?
దౌత్యం, ప్రపంచంలోని ఇతర రంగాలలో అమెరికాతో చైనా పోటీపడుతోంది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఆ దేశ పాత్రను వివరించినప్పుడూ దక్షిణాసియాలో చైనా ఆధిపత్య శక్తిగా చూపించడమే లక్ష్యంగా ఉన్నట్లు అనిపించింది.
గత రెండు దశాబ్దాలుగా చైనా, భారత్ లు రెండు చుట్టు పక్కల దేశాలలో తమ ప్రభావాన్ని క్రమంగా విస్తరించుకుంటున్నాయి. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లో వీటి ఉనికి బలంగా ఉంది.
పాకిస్తాన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. ఇప్పుడు మధ్యవర్తిత్వ పాత్రను చెప్పడం ద్వారా చైనా ప్రపంచానికి ముఖ్యంగా దాని చుటుపక్కల దేశాలకు ప్రాంతీయ ఫలితాలను తీసుకురావడంలో తనకు నిర్ణయాత్మక పాత్ర పోషించగలనని చెప్పుకున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ శక్తిగా అమెరికాతో సమానంగా తనను తాను నిలబెట్టుకునే విస్తృత ప్రయత్నంలో భాగంగా దీనిని చూడవచ్చు.
అమెరికా, చైనా, సౌదీ లకు పాకిస్తాన్ కృతజ్ఞతలు తెలిపింది? కానీ భారత్ ఎలాంటి థాంక్స్ చెప్పలేదు? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?
ఈ యుద్ధం కేవలం నాలుగు రోజుల్లోనే ముగిసింది. భారత్ అధికారిక వైఖరి ఏంటేంటే.. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు సైనిక ఘర్షణ నిలిపివేసినట్లు ప్రకటించింది. భారత్ లా కాకుండా పాకిస్తాన్ యుద్ధంపై మొదటి నుంచి బాహ్య శక్తుల ప్రమేయాన్ని అంగీకరిస్తోంది.
అమెరికా, చైనా, సౌదీ అరేబియాలకు బహిరంగంగా కృతజ్ఞతలు చెప్పింది. సంఘర్షణ సమయంలో చైనాతో పాకిస్తాన్ సన్నిహితంగా ఉంది. అంతర్జాతీయ దౌత్యంలో పొరుగు దేశాలు, వ్యూహత్మకమైన ముఖ్య దేశాల మధ్య వివాదం తలెత్తినప్పుడూ ప్రాంతీయ ప్రయోజనాలపై ఆసక్తి ఉన్న దేశాలు సహజంగా మధ్యవర్తిత్వం చేస్తాయి. ఉదాహరణకు శ్రీలంక, మాల్దీవుల మధ్య విభేదాలు వస్తే భారత్ సహజంగానే మధ్యవర్తిత్వం చేస్తుంది.
మధ్యవర్తిత్వం ముఖ్యమైనదా? దానిని తీవ్రంగా చూడాలా?
జమ్మూకాశ్మీర్ సమస్య అంతర్జాతీయ స్థాయికి వెళ్లకుండా ఆపడమే భారత్ లక్ష్యం. పహల్గామ్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదుల ప్రమేయం ఉందని భారత్ చేసిన వాదనతో సైనిక ఘర్షణ ప్రారంభం అయింది.
దీనిని కేవలం ప్రతీకార్య చర్యగా మాత్రమే కాకుండా భారత్ రూపొందించి, అంతర్జాతీయ ప్రతిస్పందనను పరిమితం చేసేలా వ్యవహరించింది. ప్రపంచ రాజకీయాలలో మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమైన లక్షణం. రష్యా- ఉక్రెయిన్ వంటి ఘర్షణలలో డొనాల్డ్ ట్రంప్ నాయకుల వ్యక్తిగత చొరవతో నిరంతరం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇది విజయం సాధించలేదు.
ఇలాంటివే మిగతా చోట్ల కూడా కనిపిస్తాయి. ఆగ్నేయాసియాలో కంబోడియా- థాయిలాండ్ మధ్యవర్తిత్వం చేయడంలో ఆసియాన్ కీలకపాత్ర పోషించింది. ఈ ఉదాహరణలు సంఘర్షణ, మధ్యవర్తిత్వం ఒకేసారి జరుగుతున్నాయని చూపిస్తున్నాయి. ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారత్- పాకిస్తాన్ సైనిక ఘర్షణలో మధ్యవర్తిత్వం వాదనలను తీసుకునే సమయంలో వీటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
Read More
Next Story