భారత్ కు ఐరాసలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: ఎలన్ మస్క్
x

భారత్ కు ఐరాసలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: ఎలన్ మస్క్

ఐక్యరాజ్యసమితి శాశ్వత దేశాల జాబితాలో భారత్ తో మరికొన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎలన్ మస్క్ కోరారు.


ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండి, వృద్ది రేటులో దూసుకుపోతున్న భారత్ లాంటి దేశాలకు ఐరాసలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని టెస్లా, ట్విట్టర్(ఎక్స్) అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలను కాలానికి అనుగుణంగా మార్చాలని కోరారు. కొన్ని దేశాలు తమ అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోవడం వల్లే భారత్ లాంటి వర్థమాన దేశాలకు యూన్ లో ప్రాతినిధ్యం వహించడంలేదని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

అంతకుముందు ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియే గుటేరస్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఐక్యరాజ్య సమితి ఇప్పటి కాలాన్ని ప్రతిబింబిచడం లేదని అందులో రాసుకొచ్చారు. "ప్రస్తుతం ఉన్న యూన్ దాదాపు 80 సంవత్సరాల కింద తయారు చేసింది. ఆఫ్రికా కు అసలు ఐరాసలో ప్రాతినిధ్యం లేదు. దీనిని ఎలా అంగీకరించగలం " అని ఆదివారం ఆయన ఉద్వేగభరితమైన పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ పై అమెరికా పెట్టబడిదారుడు మైఖేల్ ఐసెన్ బర్గ్ స్పందించారు. " మరీ భారత్ మాటేమిటీ అని" ఎక్స్ లో పోస్ట్ చేశారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు యూన్ భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మార్చాలని కోరాడు. దీనిని ఎలన్ మస్క్ ట్వీట్ చేస్తూ.. భారత్, ఆఫ్రికా లాంటి దేశాలకు యూన్ లో సరైన ప్రాతినిధ్యం దక్కాలని కోరాడు.

శాశ్వత సభ్యదేశాలను విస్తరించండి

ఐరాసలో ఉన్న శాశ్వత సభ్యదేశాల సంఖ్యలో వర్ధమాన దేశాలకు సరైన ప్రాతినిధ్యం దక్కాలని భారత్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. ఇప్పటికి అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే వీటో అధికారాన్ని అనుభవిస్తున్నాయని భారత్ తో పాటు ఇతర దేశాలు వాదిస్తున్నాయి. అవి 77 ఏళ్ల నాటీ కాలం కిందటీ నిర్మాణాలని,కాలానికి అనుగుణంగా యూన్ ను సంస్కరించాలని విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ ఐరాస సభల్లో తమ గళాన్ని వినిపిస్తున్నారు.

Read More
Next Story