పాలస్తీనాకు అనుకూలంగా ఓటు వేసిన భారత్
x
గాజా స్ట్రిప్

పాలస్తీనాకు అనుకూలంగా ఓటు వేసిన భారత్

స్వతంత్య్ర దేశానికి అనుకూలంగా ఓటు వేసిన 142 దేశాలు


ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి శాశ్వత ముగింపు ఇవ్వడానికి ప్రపంచం సిద్ధమవుతోంది. పాలస్తీనాను స్వతంత్య్ర దేశంగా గుర్తించడానికి, ఇజ్రాయెల్ ను కట్టడి చేయడానికి కోరతూ శుక్రవారం ఐరాస సర్వసభ్య సమావేశంలో నిర్వహించిన ఓటింగ్ లో పాలస్తీనాకు అనుకూలంగా భారత్ ఓటు వేసింది.

ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండు దేశాల మధ్య 80 ఏళ్లుగా ఘర్షణ జరుగుతోంది. అయితే ఇక్కడ పాలస్తీనాను అరబ్ దేశాలు తప్ప ఎవరూ ఒక ప్రత్యేక దేశంగా గుర్తించరు.

ఇందుకోసం దశలవారీగా ప్రణాళికను నిర్దేశించే న్యూయార్క్ డిక్లరేషన్ ను ఆమోదించే తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓటింగ్ లో 142-10 ఓట్లు వచ్చాయి. 12 మంది గైర్హాజయ్యారు. అనుకూలంగా ఓటు వేసిన దేశాలలో భారత్ కూడా ఉంది.

నెతన్యాహు ఏం చెప్పాడు..
ఓటింగ్ కు కొన్ని గంటల ముందు నెతన్యాహు మాట్లాడుతూ.. ‘‘పాలస్తీనా దేశం ఇక ఉండబోదు’’ అని ఆయన హెచ్చరించారు. వెస్ట్ బ్యాంక్ ను విభజించే ఒప్పందం పై సంతకం చేస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాలస్తీనియన్లు తమ దేశ భూభాగంలో కలవాలని ఆయన పట్టుబడుతున్నారు. ‘‘ఈ స్థలం మాకు చెందింది’’ అని అన్నారు. జూలై చివరలో రెండు దేశాల పరిష్కారాన్ని అమలు చేయడంపై ఉన్నత స్థాయి సమావేశానికి సహ అధ్యక్షత వహించిన ఫ్రాన్స్, సౌదీ అరేబియా ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేశాయి. తరువాత ఇది ఆమోదం పొందింది.
సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే జనలర్ అసెంబ్లీ వార్షిక సమావేశంలో ప్రపంచ నాయకుల అజెండాలో దాదాపు రెండేళ్లుగా గాజాలో జరుగుతున్న యుద్ధం అత్యంత ప్రాధాన్యత స్థాయిగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇప్పటికే 145 కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తిస్తాయని, అదనంగా మరో పది దేశాలు పాలస్తీనాను గుర్తిస్తాయని పాలస్తీనియన్లు ఆశిస్తున్నారు.
పాలస్తీనా ఐరాస రాయబారీ రియాద్ మన్సూర్ మాట్లాడుతూ.. అందరూ మద్దతు ఇచ్చారని అన్నారు. ఇజ్రాయెల్ పేరు చెప్పకుండానే.. యుద్ధం, విధ్వంసం ఇంకా ముందుకు తీసుకుపోయి, పాలస్తీనా ప్రజలను నిర్మూలించాలనుకునే వారికి ఇక్కడ వినిపించిన హేతుబద్దమైన ధ్వనిని, ఈ రోజు వినమని కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు.
కానీ ఐరాస లో ఇజ్రాయెల్ రాయబారీ డానీ డానన్ ఈ తీర్మానాన్ని ఓ నాటకంగా తోసిపుచ్చారు. దీని లబ్ధిదారుడు హమాస్ మాత్రమే అన్నారు. ఇది సభను బలహీనపరిచి ఖాళీ చేసే చర్యగా ఆయన అభివర్ణించారు.
అమెరికా వ్యతిరేకత..
ఇజ్రాయెల్ అత్యంత సన్నిహిత మిత్రదేశమైన యునైటెడ్ స్టేట్స్, న్యూయార్క్ డిక్లరేషన్, రెండు దేశాల పరిష్కారాన్ని అమలు చేయడానికి ఆమోదించే జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ తీర్మానం వివాదాన్ని ముగించడానికి తీవ్రమైన దౌత్య ప్రయత్నాలను బలహీనపరిచడానికి ఓ ప్రచార స్టంట్ గా యూఎస్ మిషన్ కౌన్సెలర్ మోర్గాన్ ఓర్టాగాస్ అన్నారు.
‘‘తప్పు చేయవద్దు, ఈ తీర్మానం హమాస్ కు బహుమతి. అక్టోబర్ 7, 2025 న దక్షిణ ఇజ్రాయెల్ లో సాధారణ పౌరులపై చేసిన దాడలను ఈ ప్రకటన ఖండిస్తుందని అన్నారు.

హమాస్ నేతృత్వంలోని తీవ్రవాదులు దాదాపు 1200 మందిని చంపారు. మరో 250 మందిని బందీలుగా తీసుకున్నారు. వారిలో ఇంకా 48 మంది ఇప్పటికీ నిర్భంధంలో ఉన్నారు. ఇందులో ఇంకా 20 మంది బతికే ఉన్నారని భావిస్తున్నారు.
Read More
Next Story