
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదు: వైట్ హౌజ్
భారత్ తమకు హమీ ఇచ్చిందని వివరించిన ప్రెస్ సెక్రటరీ
రష్యా నుంచి భారత్ చమురు కోనుగోలు చేయబోమని తమకు హమీ ఇచ్చిందని వైట్ హౌజ్ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అమెరికాలోని కీలకమైన రంగాలలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని అంగీకరించినట్లు కూడా వెల్లడించింది. వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మంగళవారం వివరాలు వెల్లడించారు.
‘‘అధ్యక్షుడు భారత్ తో గొప్ప వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడారు. వారు చాలా మంచి సంబంధాన్ని పంచుకుంటున్నారు.
భారత్ ఇకపై రష్యన్ చమురును కోనుగోలు చేయడమే కాకుండా అమెరికా నుంచి చమురును కొనుగోలు చేయదు. బహుశా వెనెజువెలా నుంచి కూడా. ఇప్పుడు అమెరికా, మా ప్రజలపై ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుందని మనకు తెలుసు’’ అని లీవిట్ మంగళవారం విలేకరులతో అన్నారు.
భారీ పెట్టుబడులు
ప్రధాని మోదీ, అమెరికా లో రవాణా, ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం కూడా 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నారని ఆమె అన్నారు. ఇది మరొక గొప్ప వాణిజ్య ఒప్పందమని ఆమె పేర్కొన్నారు.
అంతకుముందు భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ.. సోమవారం ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నారని ఆ తరువాత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. భారత్ ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని అన్నారు.
వెనెజువెలా చమురు
ట్రంప్, అతని జాతీయ భద్రతా బృందం వెనెజువెలా వాణిజ్యాన్ని, ఆ చమురు అమ్మకాలను ఇప్పుడు నిర్దేశిస్తున్నారని లీవిట్ చెప్పారు. కాబట్టి ఇది అమెరికన్ ప్రజలను కూడా ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. భారత్, అమెరికాలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ప్రధానమంత్రి మోదీ ఇంధనం, రవాణా, వ్యవసాయ ఉత్పత్తుల 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లకు హమీ ఇచ్చారని చెప్పారు.
Next Story

