
‘‘యూఎస్ లో ఉన్న భారతీయ విద్యార్థులకు న్యాయ సాయం అవసరం‘‘
స్టీవెన్ మిల్లర్ ను అమిత్ షాతో పోల్చిన విద్యావేత్త రాజ్ కమల్ రావు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తరువాత ఇమ్మిగ్రేషన్ విధానంపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న తప్పులను సాకుగా చూపుతూ అక్కడ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను బలవంతంగా స్వదేశాలకు పంపుతున్నారు.
ఇలా అకస్మాత్తుగా విద్యార్థి వీసాలను రద్దు చేయడం వల్ల వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలు తాము ఏం తప్పు చేస్తున్నారో తెలుసుకోవడానికి తహతహలాడుతున్నారు. కానీ వారికి సరైన కారణాలు మాత్రం దొరకడం లేదు.
ఈ అంశంపై ది ఫెడరల్ మేనేజింగ్ ఎడిటర్ కే ఎస్ దక్షిణామూర్తితో సంభాషణలో విద్యా సలహాదారు రాజ్ కమల్ రావు మాట్లాడారు. ట్రంప్ పాలనలో అంతర్జాతీయ విద్యార్థులను ముఖ్యంగా భారత్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం విస్తృత వలస వ్యతిరేక ప్రయత్నంలో భాగమన్నారు.
‘‘సగటు విద్యార్థికి తాము అసలు ఏం తప్పు చేశామో కూడా తెలియదు. ఒకరోజు వారి వీసా చెల్లుతుంది. మరుసటి రోజు వారి వీసా చట్టవిరుద్దం అవుతుంది. ’’ అని రావు వ్యాఖ్యానించారు.
ట్రంప్ ద్వంద్వ వైఖరి..
ట్రంప్ వలసలపై అనుసరిస్తున్నది ద్వంద్వ వైఖరి అని రావు వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డులు ఇస్తామని చెబుతూనే క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇక్కడ చట్టబద్దంగా ఉంటున్న విద్యార్థులు కూడా అక్రమ, చట్టబద్దమైన వలసదారుల మధ్య గందరగోళం కారణంగా ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు.
‘‘పత్రికలు అక్రమ వలసదారులను చట్టబద్దమైన వలసదారులతో కలపడం ప్రారంభించాయి. అవి ‘మాగా’ అంటూ తెగ హడావుడి చేస్తున్నాయి’’ అని రావు పేర్కొన్నారు.
ఉల్లంఘనలు.. నైతిక లోపాలు..
కొంతమంది విద్యార్థులు వీసా ఉల్లంఘనలకు పాల్పడి ఉండవచ్చు. ఇందులో కొంతమంది విద్యార్థులు అనధికారికంగా రెస్టారెంట్లలో పనిచేయవచ్చు. కొంతమంది ఎస్ఓపీలను ఉపయోగించుకోవచ్చు. ఇవి వీసా నిబంధనలను ఉల్లంఘిస్తాయి కానీ.. క్రిమినల్ కేసులు కావన్నారు.
‘‘నేను విద్యార్థులకు చెప్పాను. మీ మొదటి సంవత్సరంలో క్యాంపస్ వెలుపల పనిచేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది అని. చాలా మంది నిప్పుతో ఆడుకుంటున్నామని గ్రహించరు’’ అని రావు అన్నారు.
డ్యూ ప్రాసెస్ తిరస్కరణ..
తగిన కారణం లేకుండా చాలామంది విద్యార్థులను తిరస్కరించడంపై రావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఏం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో తెలియదు. అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండట్లేదు. కొంతమందిని అకస్మాత్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. మరికొంతమంది స్వీయ బహిష్కరణకు గురవుతారు. వారికి ఉన్న చట్టపరమైన హక్కుల గురించి స్పష్టత లేదు
‘‘భారతీయ విద్యార్థులు ఇక్కడ చట్టబద్దంగా ఎఫ్- 1 వీసాలపై ఉన్నారు. వారు చట్టబద్దమైన ప్రక్రియకు అర్హులు. అమెరికా రాజ్యాంగం ఇదే చెబుతోంది’’ అని ఆయన చెప్పారు.
ఒత్తిడిలో ఉన్న వ్యవస్థ..
అమెరికా వీసా వ్యవస్థ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉందని రావు అన్నారు. అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా తొలి ఎంపిక అయినప్పటికీ.. కఠినంగా నిబంధనలు అమలు చేస్తోంది. వర్క్ వీసాలు, శాశ్వత నివాసంగా మారే అవకాశాల కారణంగా అమెరికా లో చదువుకోవడం, పనిచేయడం ఇక్కడే ఉండిపోవడం చాలా ఆకర్షణగా మారింది. అమెరికాలో ప్రస్తుతం ఉన్న పోస్ట్ స్టడీ వర్క్ వీసా ను తొలగిస్తే విద్యార్థుల సంఖ్య 90 శాతం పైగా తగ్గుతుందని రావు చెప్పారు.
మారుతున్న గమ్య స్థానాలు..
చైనా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ విద్యార్థి వీసాల వ్యవస్థలను క్రమబద్దీకరించడం ద్వారా అమెరికా అతిక్రమలను అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఈ కొత్త ప్రత్యామ్యాయాలు చదువుకోవాలనే విద్యార్థులకు ఆకర్షణీయంగా మారుతున్నాయి.
‘‘జపాన్, చైనాలు భారతీయ విద్యార్థులకు తలుపులు తెరిచింది. అమెరికా ఇదే విధంగా కొనసాగితే విద్యార్థులు కచ్చితంగా మరో ప్రత్నామ్యాయ దేశానికి వెళ్తారు’’ అని వివరించారు.
సానుభూతి లేకుండా అమలు..
కరోనా సమయంలో కూడా ట్రంప్ ఇలాగే తమదేశంలో చదువుకుంటున్న విద్యార్థులను వెనక్కి పంపడానికి ప్రయత్నించారు. అందుకు కాలం చెల్లిన చట్టాలను వాడుకోవాలని ప్రయత్నించగా కోర్టులు అందుకు నిరాకరించాయి. ‘‘కోవిడ్ కారణంగా విద్యార్థులు క్యాంపస్ లకు వెళ్లలేకపోయారు. ఇది వీసా నిబంధనల ఉల్లంఘన అని పరిపాలన విభాగం తెలిపింది. ఇది అసంబద్దం’’ అని రావు గుర్తు చేసుకున్నారు.
స్టీవెన్ మిల్లర్ కారకం..
ట్రంప్ కీలక సలహాదారు స్టీవెన్ మిల్లర్ ను అనేక వలస వ్యతిరేక విధానాల వెనక ఉన్న సైద్దాంతిక శక్తిగా రావు చెప్పారు. ఆయనను అమెరికా అమిత్ షా గా అభవర్ణించారు. మిల్లర్ రాడికల్ ఆలోచనలు విదేశీ విద్యార్థులపై పరిపాలన వైఖరిని ప్రభావితం చేస్తునే ఉన్నాయని రావు తెలిపారు.
Next Story