బాస్మతి రైస్ కేసు: పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి?
x

బాస్మతి రైస్ కేసు: పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి?

ఈ బియ్యం పాక్ లో పుట్టినట్లు భావిస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్


బిర్యానీ, ఇతర ప్రాముఖ్యం కలిగిన వంటకాలలో వాడే బాస్మతి బియ్యం హక్కుల విషయంలో దాఖలైన ఓ కేసులో పాక్ చేతిలో భారత్ ఓడిపోతున్నట్లు తెలుస్తోంది. డైలీ ఆజ్ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు బాస్మతి బియ్యం పుట్టుక పాకిస్తాన్ లో జరిగినట్లు గుర్తించాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ఈ సుగంధ బియ్యం పాక్ లోని హఫీజాబాద్ జిల్లా నుంచి ఉద్భవించాయని, చరిత్రకారులు, అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు చేసిన అధ్యయనాల ఆధారంగా యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి తీర్పును ప్రకటించే దిశగా ఉందని ఆ నివేదిక పేర్కొంది.

బాస్మతి ప్రాముఖ్యత..
బాస్మతి ఒక విలాసవంతమైన బియ్యం బ్రాండ్. భారత్ అండ్ పాకిస్తాన్ రెండింటికీ ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారు. ప్రధాన వంటకాలలో దీనిని రుచి, వాసనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. రెండు దేశాల బియ్యాన్ని ఎగుమతి చేయడం ద్వారా ప్రతి సంవత్సరం గణనీయమైన మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నాయి.
రెండు దేశాల వంటకాల్లో బాస్మతి బియ్యానికి గణనీయమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా లభించే బిర్యానినీ సాధారణంగా బాస్మతి బియ్యంతోనే తయారు చేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా బాస్మతి బియ్యానికి దాదాపుగా 27 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. ఇందులో పాకిస్తాన్ కు 4 బిలియన్ డాలర్ల వాటా ఉంది. ఈ బియ్యం వాసన, నాణ్యతలో ఉన్నతమైనదని, అంతర్జాతీయంగా పోటీ ధరతో కూడుకున్నదని దేశ ఎగుమతిదారులు పేర్కొంటున్నారు.
కొందరు ఈ బియ్యాన్ని దుబాయ్ కు ఎగుమతి చేస్తున్నారని, అక్కడ భారతీయ వ్యాపారులు దానిని రీ బ్రాండ్ చేసి మళ్లీ ఎగుమతి చేస్తారని చెబుతున్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం.. భారత్ 1965 లోనే బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించిందని, పాకిస్తాన్ 1960 నుంచి ఈ ప్రయత్నంలో ఉందని, ప్రారంభంలోనే యూరప్, మధ్య ప్రాచ్య దేశాలకు మార్కెటింగ్ చేస్తోందని దాని వాదన.
మేధో సంపత్తి హక్కులు..
రెండు దేశాలు ప్రస్తుతం రక్షిత భౌగోళిన సూచికి సర్టిఫికేషన్ కోసం పోరాడుతున్నాయి. భారత్ 2018 లోనే దీని కోసం దరఖాస్తు చేయగా, పాక్ వ్యతిరేకించింది. ఈ హోదా ఒక నిర్ధిష్ట భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన ఉత్పత్తులకు మేథో సంపత్తి హక్కులకు లభిస్తుంది. బాస్మతి బియ్యం ఎగుమతుల పోటీ రంగంలో ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో ఇది కీలకంగా మారవచ్చు. అయితే యాధృచ్చికంగా అమెరికాలో పండించే బియ్యానికి బాస్మతి లేబుల్ ను తిరస్కరించాలని భారత్, పాకిస్తాన్ రెండూ అమెరికా వ్యవసాయ శాఖ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ను అభ్యర్థించాయి.
Read More
Next Story