మళ్లీ లైమ్ లైట్లోకి రావాలనుకుంటున్న ఉగ్రసంస్థ..
x

మళ్లీ లైమ్ లైట్లోకి రావాలనుకుంటున్న ఉగ్రసంస్థ..

ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ తిరిగి పునర్జీవనం పొందడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. దీనిపై భారత్, శ్రీలంక అప్రమత్తమయ్యాయి. న్యూఢిల్లీ తిరిగి ఈ సంస్థపై..


శ్రీలంకలోని ఈశాన్య, వాయువ్య ప్రాంతంలోని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. 15 సంవత్సరాల క్రితం ఎల్టీటీఈతో జరిగిన యుద్దంలో ధ్వంసం అయిన పలు జ్ఞాపకార్థాలను తిరిగి పున:నిర్మించి, అప్పటి యుద్ధంలో చనిపోయిన ఎల్టీటీఈ ఉగ్రవాదుల సంస్మరణ జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం వారికి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా తమిళం ఈలం పోరాటంలో చివరగా మరణించిన వారికి సంస్మరణ కార్యక్రమం అమలు చేయాలని నిర్వాహకులు భావించారని మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి.

స్మారక కార్యక్రమాలు
1983లో ప్రారంభమైన మూడు దశాబ్దాల సుదీర్ఘ సాయుధ పోరాటం, మే 2009లో LTTE వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌తో సహా అన్ని స్థాయిల్లోనూ నాయకులను సైన్యం చంపడంతో ముగిసింది. అయితే తిరిగి ఎల్టీటీఈ ఇక్కడ ఆక్టివేట్ అవుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఉత్తర, తూర్పు ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించడానికి ముందు అక్కడి వారోత్సవాలపై నిఘా ఉంచడానికి పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
LTTE అనుకూల సాహిత్యం
పలు చోట్ల ఎల్టీటీఈ అనుకూల సాహిత్యం పంపిణీ చేసినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. భారతదేశంతో సహా చాలా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి తిరిగి LTTEని పునరుజ్జీవింపజేయాలని కొందరు పిలుపునిచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం మంగళవారం, LTTEపై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించింది. మొదటగా ఎల్టీటీఈ పై పీవీ నరసింహరావు నేతృత్వంలోని ప్రభుత్వం 1992 లో నిషేధం విధించింది.
నలుగురి అరెస్టు
ఎల్టీటీఈని గౌరవించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తామని శ్రీలంక పోలీసులు హెచ్చరించారు. ఎల్టీటీఈ సంస్మరణలను నిషేధిస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు తూర్పు పట్టణంలోని సాంపూర్‌లో పోలీసులు ఒక వ్యక్తి ముగ్గురు మహిళలను అరెస్టు చేసినట్లు మంగళవారం మీడియా కథనాలు ప్రచురించింది.
ప్రధాన సంఘటన
తమిళ రాజకీయ, హక్కుల సంఘాలు, ముఖ్యంగా చివరి దశలో, ఘర్షణలో మరణించిన నాన్-కాంబాటెంట్ తమిళుల పౌర కిత్, బంధువులను స్మరించుకునేలా ఈవెంట్‌లను ప్లాన్ చేసినట్లు చెప్పారు. ముల్లైతీవు జిల్లాలో, మే 19, 2009న ప్రభాకరన్ హత్యకు గురైన ప్రాంతంలో ఈ సంస్మరణ కార్యక్రమం జరుగనున్నట్లు తెలిసింది.
తమిళుల గుండెల్లో
తమిళుల ప్రాబల్యం ఉన్న జాఫ్నాలో విశ్వవిద్యాలయం, పౌర సంఘాలు మే 11న 'ముల్లివైక్కల్ వారోత్సవాన్ని' ప్రారంభించాయి. మరణించిన వారి జ్ఞాపకార్థం రక్తదాన ప్రచారాలు జరుగుతున్నాయి. 1983 నుంచి 2009 వరకు శ్రీలంకలో స్వతంత్ర తమిళ రాజ్యాన్ని రూపొందించడానికి LTTE శ్రీలంకతో యుద్దాన్ని ప్రారంభించింది.
ముఖ్యంగా గెరిల్లా ఆత్మాహుతి దాడులతో సింహళీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెట్టింది. చివరకు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని సైతం హత్య చేసింది. 2009లో చైనా సాయంతో శ్రీలంక జాఫ్నాలో ఉన్న ఎల్టీటీఈ ని పూర్తిగా నిర్మూలించింది.


Read More
Next Story