ఉషా చిలుకూరికి వింత అనుభవం.. ఏంటంటే..
జేడీ వాన్స్ ఉపాధ్యక్ష అభ్యర్థిత్వంపై శ్వేత జాతి తెల్లజాతీయులు సంతృప్తికరంగా లేరు. వాన్స్, భారత మూలాలు ఉన్న యువతిని వివాహమాడటం, వారి పిల్లలకు భారతీయ పేర్లు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ట్రంప్ ప్రకటించాక ఆయన భార్య ఉషా చిలుకూరి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఉషా మూలాలు భారత్ నుంచి ఉండటంతో కొన్ని శ్వేత జాతి అతివాద గ్రూపుల నుంచి నిరసనలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
ఈ వారం రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఉషా వాన్స్ తన భర్తను పరిచయం చేసినప్పుడు, కొంతమంది ప్రేక్షకులు వలస విధానంపై వాన్స్ వైఖరిని ప్రదర్శించాలని సూచించే ప్లకార్డులను పట్టుకున్నారు. బ్రిటన్ లోని కన్జర్వేటివ్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఇక్కడ కూడా అనుసరించాలని వారి ఆకాంక్షగా ఉంది. సామూహిక బహిష్కరణ చేయాలని నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ఈ కన్వన్షన్ లో ప్రముఖంగా కనిపించాయి.
ఈ సమావేశంలో ఉషా చిలుకూరి చాలామంది మద్ధతుదారులతో మాట్లాడినప్పటికీ కూడా కొంతమంది ఫార్ రైట్ వింగ్ మద్ధతుదారులు మాత్రం ఆమె వలసమూలాలపై వ్యతిరేకతలతో కూడిన అర్థం వచ్చేలా పోస్టులు చేస్తున్నారు. కొంతమంది ఈ పోస్టులతో జేడీ వాన్స్ ఉపాధ్య అభ్యర్థిగా ఎన్నిక అయితే వలసదారులపై మృదువుగా వ్యవహరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. వారు ఇప్పటికి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. జేడీవాన్స్, ఉషా చిలుకూరి వివాహం హిందూ సాంప్రదాయం పద్ధతిలోనే జరిగింది.
కన్జర్వేటివ్ పునాదినే.. రిపబ్లికన్ల బలం..
రిపబ్లికన్ పార్టీకి సంప్రదాయవాద క్రైస్తవులు, శ్వేతజాతీయుల ఆధిపత్యవాదులే బలమైన పునాది. వీరిలో కొందరు జాత్యహంకారాన్నే "గొప్ప సిద్ధాంతంగా" విశ్వసిస్తారు. అమెరికా మొత్తం శ్వేత జాతీయులతో మాత్రమే ఉండాలని వారంతా బలంగా వాదిస్తారు, ఆచరిస్తారు.
నవంబర్ 2022లో ట్రంప్‌ని అతని ఇంట్లో శ్వేతజాతీయుల ఆధిపత్య వాది నిక్ ప్ల్యూయోంటెస్ కలిసి మాట్లాడారు. జేడీవాన్స్, ఒక వలస వచ్చిన భారతీయ వనితను వివాహం చేసుకున్నందున అతను ఎప్పటికీ శ్వేతజాతీ రక్షకుడు కాడని వ్యాఖ్యానించారు. అతని పిల్లల్లో ఒకరికి వివేక్ అని పేరు ఉందని, అతను శ్వేత జాతి రక్షకుడు ఎలా అవుతాడని ఒక పబ్లిక్ పోడ్ కాస్ట్ లో నిక్ దురహంకార వ్యాఖ్యలు చేశారు.
ఒక సంప్రదాయవాద వ్యాఖ్యాత స్టీవ్ పీటర్స్ "మన కళ్ల ముందే USలో స్పష్టమైన భారతీయ తిరుగుబాటు జరుగుతోంది." అని వివరించాడు. ట్రంప్ కఠినమైన ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక చర్యలు, అమలు, అతని పదజాలం వల్ల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తప్పవని ఆయన చెబుతున్నారు.
రిపబ్లికన్ల నుంచి ఉషా వాన్స్‌కి సానుకూల స్పందనలు
మరోవైపు, ఆమె తన భర్తను పరిచయం చేయడాన్ని చూసిన కన్వెన్షన్‌లోని పలువురు రిపబ్లికన్ ప్రతినిధులు ఆమె పనితీరును ప్రశంసించారు. నార్త్ డకోటాకు చెందిన 53 ఏళ్ల ప్రతినిధి సిల్వర్ బగ్గలే ప్రకారం ఉషా భారతీయ వారసత్వం "అందమైనది" ఆమెను "రాక్ స్టార్" అని సంబోధించారు. మంచితనం, కంగారుపడకుండా ప్రశాంతంగా ఉండటం బాగుంది.’’ అని సిల్వర్ ప్రశంసల్లో ముంచెత్తింది. ఈ కార్యక్రమానికి హాజరైన మిగిలిన వారంతా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “అమెరికా వలసదారులతో తయారైంది. ఒక వలసదారు చట్టబద్ధంగా ఇక్కడ ఉన్నంత కాలం, అది గొప్పదని నేను భావిస్తున్నాను, ”వారంతా చెప్పారు.
అందరికి స్వాగతం: నిక్కీ హేలీ
ఐరాసలో మాజీ రాయబారి నిక్కీ హేలీ, స్వయంగా వలసదారుల కుమార్తె. కన్వెన్షన్‌లోని తన ప్రసంగంలో రిపబ్లికన్‌లు విభిన్న నేపథ్యాలు ఉన్న వ్యక్తులను పార్టీలోకి స్వాగతించడంలో మెరుగ్గా ఉండాలని కోరారు. “మనం ఏకీకృత పార్టీగా ఉండటమే కాదు, మన పార్టీని కూడా విస్తరించాలి. విభిన్న నేపథ్యాలు, అనుభవాలు ఉన్న వ్యక్తులను మా పార్టీలోకి స్వాగతించినప్పుడు మనం బలంగా ఉంటాము,” అని హేలీ అన్నారు.
ఉషా వాన్స్‌పై రిపబ్లిక్ పార్టీ లోని కొంతమంది అతివాదులు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలపై అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రియాన్ హ్యూస్ స్పందించారు. వలస వ్యతిరేక విధానం వల్ల రాడికలైజేషన్ వ్యాప్తి చెందుతోందని అన్నారు. అయితే ఇవన్నీ విస్తృతమైన స్వరాలు అని వివరించాడు.
Next Story