బైడెన్ నోట కొత్త మాట.. ఏం అంటున్నారంటే..
డెమొక్రాటిక్ పార్టీ నుంచి మరోమారు తానే అభ్యర్థిగా ఉంటానని చెప్పిన బైడెన్.. విలేకరులతో మాట్లాడిన ఓ సందర్భంలో ట్రంప్ ను ఓడించే అభ్యర్థి ఉంటే తాను...
ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలోని నుంచి జో బైడెన్ తప్పుకోవాలని డెమొక్రాట్లు రోజురోజుకి ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనలను తాను వ్యతిరేకిస్తున్నట్లు మరోమారు తానే పోటీకి దిగుతానని బైడెన్ చెబుతూ వస్తున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం విలేకరులతో మాట్లాడుతూ .. తాను పోటీ నుంచి వైదొలిగే అవకాశం ఉందని కొన్ని క్లూలు వదిలారు.
సొంత పార్టీ నుంచి రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతూ రావడం వల్ల బైడెన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా మీడియాతో ఆయన మాటలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వివరించారు. మొదట తానే ట్రంప్ ఓడిస్తానని గట్టిగా వాదించారు.
యాంకర్ జార్జ్ స్టెపానో పౌలోస్ అడిగిన కొన్ని ప్రశ్నలకు అధ్యక్షుడు బైడెన్ ఎప్పటిలాగే తడబడ్డారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మరోమారు తానే గెలుస్తానని, ఏ రాజకీయ నాయకుడు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండరని, తాను కాకుండా ట్రంప్ ను ఓడించే వ్యక్తి ఉంటే పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చూచాయగా అంగీకరించినట్లు తెలుస్తోంది. గత వారం జరిగిన నాటో సదస్సులో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో జరిగిన మీటింగ్ లో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది.