
‘డిగో గార్సియా’ సైనిక స్థావరంపై ఇరాన్ దాడులు
హిందూ మహాసముద్రంలో ఉన్న బ్రిటన్ సైనిక స్థావరం, యుద్ధాన్ని విస్తరిస్తున్న టెహ్రాన్
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. తాజాగా టెహ్రాన్, హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికా, బ్రిటన్ సైనిక స్థావరం లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించింది. ఇందుకోసం మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ఉపయోగించింది. ఇప్పటిదాకా ఇరాన్ కు సుదూర క్షిపణులు ప్రయోగించలేదనే అమెరికా, ఇజ్రాయెల్ అంచనాలు తప్పినట్లు అయింది.
పశ్చిమాసియాలోని సుదూర లక్ష్యాలను ఇరాన్ ఛేదించినట్లు అయితే అది అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగినట్లే. ఇరాన్ ప్రధాన భూభాగం నుంచి డిగో గార్సియా దాదాపు 4 వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తమకు తాకలేదని యూఎస్ ప్రకటించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఒక క్షిపణి మార్గమధ్యలోనే కూలిపోయింది. మరోక క్షిపణిని అమెరికా యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఎస్ఎం-3 ఇంటర్ సెప్టర్ అడ్డుకుంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
చాగోస్ దీవులలో డియోగో గార్సియా బ్రిటన్ నియంత్రణలో ఉంది. ఇరాన్ పై దాడులకు అమెరికా దీనిని వినియోగించుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లలో అమెరికా బాంబుదాడులు చేయడానికి, ఆసియాలో సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో అమెరికాకు చెందిన బాంబర్లు, డ్రోన్లు ఇతర పరికరాలు ఉంటాయి.
మధ్య హిందూ మహాసముద్రంలోని లోతట్టు ప్రాంతమైన డీగో గార్సియా ద్వీపంపై ఇరాన్ దాడి చేయడానికి ప్రయత్నించింది నిజమైతే.. పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదిరనట్లే అని మాజీ కేంద్రమంత్రి మనీశ్ తివారీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Next Story

