ఎవరూ అమీర్ ఖాన్ ముత్తాఖీ? భారత్ కు ఎందుకు వస్తున్నారు?
x
తాలిబన్ విదేశాంగ ప్రతినిధి ముత్తాఖీ

ఎవరూ అమీర్ ఖాన్ ముత్తాఖీ? భారత్ కు ఎందుకు వస్తున్నారు?

తాలిబన్ ప్రభుత్వంలో కీలక నేత


ఐదు సంవత్సరాల క్రితం ఆఫ్ఘన్ తిరిగి రాజ్యాధికారం దక్కించుకున్న తాలిబన్లతో భారత్ అనధికారికంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. ఇది మరో కీలక దశకు చేరుకున్నాయి. తాలిబన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న మౌలవీ అమీర్ ఖాన్ ముత్తాఖీ వచ్చేవారం భారత పర్యటకు వస్తున్నారు.

ఆయన ప్రయాణానికి యూఎన్ఎస్సీ అనుమతి ఇచ్చింది. ఈ పర్యటనకు సంబంధించి న్యూఢిల్లీ కూడా అధికారికంగా వెల్లడించింది. విదేశాంగ కార్యదర్శిగా ఉన్న రణధీర్ జైస్వాల్ ముత్తాఖీ అక్టోబర్ 9 నుంచి 16 వరకూ భారత్ లో పర్యటిస్తారని వెల్లడించారు.

తాలిబన్ ప్రభుత్వంలో మొట్ట మొదటి మినిస్టర్ భారత్ ను తొలిసారిగా సందర్శించబోతున్నారు. ‘‘యూఎన్ భద్రతా మండలి ఆఫ్ఘన్ తాలిబన్ మంత్రికి భారత్ లో పర్యటించడానికి అనుమతులు మంజూరు చేసిన విషయం చేసిన సంగతి మీకు తెలిసిందే.

ఆయన న్యూఢిల్లీలో అక్టోబర్ 9 నుంచి 16 వరకూ పర్యటిస్తారు. ఈ సమాచారం ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఈ విషయంలో మిగిలిన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తాం’’ అని జైస్వాల్ అన్నారు.

అమీర్ ఖాన్ ముత్తఖీ ఎవరూ?
కాబూల్ ను స్వాధీనం చేసుకున్నాక తాలిబన్ ప్రభుత్వంలో ముత్తాఖీ విదేశాంగమంత్రిగా నియమితులయ్యారు. కరుడగట్టిన ఇస్లామిక్ గ్రూపులో ఆయన చాలాకాలంగా పనిచేస్తున్నాడు.
ముత్తాఖీ హజీ ఖాన్ కుమారుడు. హెల్మండ్ ప్రావిన్స్ లోని జార్ గుహాన్ లో 1970 లో జన్మించాడు. ఆయన కుటుంబం పాక్టియా నుంచి హెల్మండ్ ప్రావిన్స్ కు మకాం మార్చింది. సోవియట్ వార్ సమయంలో ఆయన కుటుంబం మొత్తం పాకిస్తాన్ కు మకాం మార్చింది.
ఆఫ్ఘన్ శరణార్ధులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిన శిబిరాలలో ఆయన సాంప్రదాయ సామాన్య శాస్త్రం అభ్యసించాడు. 1990 లలో తాలిబన్ గ్రూపులలో కీలక వ్యక్తిగా ఎదిగాడు.
ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం ప్రకారం.. ముత్తఖీ కాబుల్ లో కీలక వ్యక్తి. దేశానికి సంబంధించిన చర్చలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే తాలిబన్ ప్రభుత్వం తాష్కేంట్, ఉజ్ బెకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, జెడ్డా వేదికగా సౌదీ అరేబియా నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ చర్చలలో పాల్గొన్నాడు.
1994 లో తాలిబన్లు కాందహార్ ను స్వాధీనం చేసుకున్న కొద్దికాలానికే ఆయన కాందహార్ లోని రేడియో స్టేషన్ కు డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. అదే సమయంలో తాలిబన్ హై కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.
జూలై 1995 లో సమాచార, సంస్కృతి డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. అక్టోబర్ 1996 లో తాలిబన్లు కాబూల్ ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తరువాత ఏర్పడిన ప్రభుత్వంలో సంస్కృతి శాఖ, తాత్కాలిక మంత్రిగా అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు.
2000 లో చివరగా విద్యామంత్రిగా ఉన్నారు. ఆఫ్ఘన్ పై అమెరికా దండయాత్ర ప్రారంభమయ్యే వరకూ పదవిలో ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ముత్తాకి తాలిబన్ నాయకులలో ఒకరు, అమెరికాతో రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
‘‘రెండు దశాబ్దాల తాలిబన్ తిరుగుబాటు సమయంలో సుప్రీం నాయకుడిగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, ఖతార్ లో తాలిబన్ రాజకీయ ప్రతినిధి బృందంలో సభ్యుడిగా పనిచేసే ముందు ప్రచారం, మానసిక యుద్ధానికి వ్యూహంలో సహాయపడ్డారు’’ అని నివేదిక పేర్కొంది.



భారత్ లో అతని ఎజెండా?
ముత్తాఖీ తన పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్ ను కలవనున్నారు. భవిష్యత్ ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు, వాణిజ్యం వంటి వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. భారత్ కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. అయితే రెండు వైపులా రహస్యంగా దౌత్యసంబంధాలు మాత్రం నెలల తరబడి కొనసాగుతున్నాయి.
ఇది ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య రెండో సంభాషణ అవుతుంది. కానీ వ్యక్తిగతంగా కలవడం మాత్రం మొదటిసారి. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తరువాత మే 15న ఇరువురు నాయకులు ఫోన్లో మాట్లాడారు.
జనవరి 8న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీని దుబాయ్ లో ముత్తాఖీని కలిశారు. తాలిబన్ నాయకుడు సెప్టెంబర్ లో భారత్ ను సందర్శించడానికి ప్రయత్నించాడు.
అయితే అతనిపై ఐరాస ఆంక్షలు ఉండటంతో అతని పర్యటన వాయిదా పడింది. తాలిబన్ నాయకులందరిపై ఐరాస భద్రతా మండలి యూఎన్ఎస్సీ ఆంక్షలు విధించింది. తాలిబన్ నాయకులు కచ్చితంగా విదేశాలకు వెళ్లాలంటే యూఎన్ఎస్సీ నుంచి అనుమతి పొందాలి.
‘‘సెప్టెంబర్ 30, 2025న 1988((2011) తీర్మానం ప్రకారం ఏర్పాటు చేసిన భద్రతా మండలి కమిటీ 2025 అక్టోబర్ 9, నుంచి 16 వరకూ భారత్ లోని న్యూఢిల్లీని సందర్శించడానికి అమీర్ ఖాన్ మోటాకీ ప్రయాణ నిషేధానికి మినహయింపు ఆమోదించింది’’ అని యూఎన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాలిబన్ ప్రభుత్వంతో సంబంధాలు..
తాలిబన్లు మొదటిసారిగా అధికారంలోకి వచ్చాక న్యూఢిల్లీకి వ్యతిరేకంగా వ్యహరించారు. కాబూల్ లో వారు చేపట్టిన హింసాత్మక చర్యలు, మానవ హక్కుల సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ దానికి దూరంగానే వ్యవహరించింది.
తాలిబన్లు కాబూల్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి భారత్ ఆఫ్గన్లకు మానవతా సాయం అందించడం ద్వారా సహాయం చేస్తోంది. ఇది గోధుమలు, మందులు, పురుగు మందులు, కోవిడ్ వ్యాక్సిన్లు, మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడటానికి సాయం చేస్తోంది. అలాగే కార్యక్రమాల కోసం పరిశుభ్రత కిట్ లు, శీతాకాలపు దుస్తులు, స్టేషనరీ కిట్ లను సైతం అందిస్తోంది.
జనవరిలో జరిగిన సమావేశంలో క్రికెట్ సహకారాన్ని బలోపేతం చేయడానికి జనవరి సమావేశంలో వాణిజ్య, వాణిజ్య కార్యకలాపాలకు మద్దతుగా ఇరాన్ లోని చాబహార్ ఓడరేవును ఉపయోగించుకుని తన వాణిజ్య కార్యకలాపాలను కోసం చర్చలు జరిగాయి.
చారిత్రకంగా భారత్ తాలిబన్లకు వ్యతిరేకం వైఖరినే తీసుకుంది. అంతర్యుద్దం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో 1990 లో ఆఫ్ఘనిస్తాన్ లో తన కాన్సులేట్ లను మూసివేసింది. యుద్ధం ముగిసిన తరువాత 2002 లో తిరిగి వాటిని తెరిచింది.
Read More
Next Story