సీ5 పేరుతో భారత్ ను ట్రంప్ బుట్టలో వేసుకుంటున్నాడా?
x
కోర్5 కూటమి

సీ5 పేరుతో భారత్ ను ట్రంప్ బుట్టలో వేసుకుంటున్నాడా?

ఇప్పటికే జీ7 ఉండగా, తాజాగా కోర్5 అంటూ కొత్త గ్రూప్ నిర్మిస్తారని అంతర్జాతీయ మీడియాలో ఊహగానాలు


డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా తన విధానాలను మార్చుకుంటూ ఉన్నట్లు తాజాగా బయటకు వస్తున్న సమాచారం స్పష్టం చేస్తోంది. కోర్ 5 లేదా సీ5 అనే కొత్త కూటమిని ప్రారంభించాలని ట్రంప్ కోరుకుంటున్నారు.

యూఎస్ జాతీయ భద్రతా వ్యూహం నుంచి తీసుకున్న కొన్ని వివరాల ప్రకారం.. సీ5 గ్రూపులో యునైటైడ్ స్టేట్స్, చైనా, రష్యా, జపాన్, భారత్ సభ్య దేశాలుగా ఉండే అవకాశం ఉండవచ్చు. ఇది శక్తివంతమైన గ్రూప్ ఆఫ్ సెవెన్(జీ7) కి ప్రత్యర్థికి ఉండే అవకాశం ఉంది.


అయితే అలాంటి ప్రతిపాదనలు ఏవి తమ తీసుకురాలేదని వైట్ హౌజ్ తిరస్కరించింది. యూఎస్ వ్యూహపత్రం ప్రకారం.. కొన్ని ముసాయిదాల్లో ఈ సీ5 భావన ఉన్నట్లు కొన్ని ఊహగానాలు వస్తున్నాయి. మీడియాకు విడుదల చేసిన వెర్షన్ లో కోర్ సీ5 గురించి ఎటువంటి సూచన తెలియదు.
ట్రంప్ కొత్త భౌగోళిక రాజకీయ తర్కం..
ట్రంప్ పరిపాలనలో కొత్త రాజకీయ భౌగోళిక వ్యూహానికి అమెరికా పదునుపెడుతోంది. ముఖ్యంగా సాంప్రదాయ పొత్తుల నుంచి దూరంగా జరగడంతో పాటు, కొత్తగా శక్తివంతమైన కూటములను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
చారిత్రాత్మకంగా యూరోపియన్ యూనియన్ తో అమెరికాతో అనేక సంబంధాలు ఉన్నాయి. కొత్త కూటమిలో దాని ప్రస్తావన లేకపోవడంతో యూరోప్ లోని తన మిత్రుల పట్ల ట్రంప్ అభిప్రాయాన్ని తెలియజేస్తుంది.
రష్యా- ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన చర్చలలో యూరప్ ను పక్కన పెట్టడంలో ఈ విషయం మనకు బోధపడుతుంది. కొన్నిసార్లు వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్లను శాంతి ప్రతిపాదనలలో భాగం చేయడం మనకు కనిపించింది. ఈ వైఖరి ఉక్రెయిన్, దాని యూరోపియన్ మిత్రులకు కలవరం పుట్టించింది.
దూసుకుపోవడానికేనా..
రష్యా- చైనా శక్తులు కొంతకాలంగా అమెరికా అంటే గుర్రుగా ఉన్నాయి. ఇవి ప్రస్తుతం అమెరికా నేతృత్వంలో చేపట్టబోయే సీ5 కూటమిలో చేరాలనుకోవడం దాదాపు అసాధ్యం. ఇదే సమయంలో ట్రంప్, పుతిన్ మధ్య సంబంధం పదేపదే చర్చకు వస్తోంది.
ప్రతీకార సుంకాలు విధించినప్పటికీ అమెరికాకు ప్రధాన ప్రత్యర్థి చైనాయే. అయితే ఈ మూడింటిని ఒక అధికార కూటమిలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నం దాని అంతర్గత తర్కం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఎవరూ ఊహించలేదు
ఈ కొత్త ప్రపంచ కూటమిలో భారత్ చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. న్యూఢిల్లీ- వాషింగ్టన్ మధ్య ఇటీవల కాలంలో దౌత్య ఉద్రిక్తతలు తలెత్తాయి.
భారత్ ను ఈ కూటమిలోకి తీసుకోలేరని అంతా నమ్ముతున్నారు. అయితే నరేంద్ర మోదీ- పుతిన్ ఈ మధ్య జరిపిన చర్చలు, రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాలు సీ5 ఊహగానాలు అరికట్టలేదని పేర్కొంది.
మీడియా నివేదికల ప్రకారం..భారత్ ను కూడా సీ5 కూటమిలోకి ఆహ్వానించడం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగి, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన దానికి తగిన స్థానం కల్పించడం ముఖ్యమని భావించి ఉంటారు.
అయితే అభివృద్ధి, సైనిక శక్తి పరంగా ఇప్పటికే ఉన్న జీ7 కి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త వేదికను ఎందుకు సృష్టించాలని కోరుకుంటున్నారో ఇంకా అస్పష్టంగానే ఉంది.
ఆర్థికంగా బాగుంటుందా?
ఈ చర్చలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. భారత్ లోని అతిపెద్ద మార్కెట్ అమెరికా ఆసక్తిగా పేరు ప్రతిపాదించడానికి కారణం కావచ్చు. ముఖ్యంగా వాణిజ్య చర్చల సందర్భంలో ఇది గమనించవచ్చు.
ప్రస్తుతం జరుగుతున్న చర్చల సందర్భంగా ట్రంప్ సూచించిన వాటిని అనుగుణంగా భారత్ నిబంధనలు సవరించిందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదికలు వస్తున్నాయి. ప్రస్తుతం సీ5 కూటమి నిజంగా ఆదరణ పొందితే ఇది భారతీయ వ్యూహకర్తలకు ఉపయోగపడవచ్చు. ఇది ఆర్థికంగా మనకు లాభించే అవకాశం ఉంది.
పోటీ కూటములు..
ప్రపంచ కూటములు అన్ని ప్రస్తుతం అస్థిరంగా ఉన్నాయి. ఈ తరుణంలో సీ5 కూటమి ఏర్పాటుపై వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జీ7తో పాటు సీ5 కూటమి కూడా ఉద్భవిస్తే.. మరికొన్ని కూటముల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది. ఎందుకంటే అమెరికా అధికారులు వీటిని ఇంకా ధృవీకరించడం లేదు.
వ్యూహాత్మక ఏకీకరణ..
సీ5 చర్చ ప్రస్తుత యూఎస్ పరిపాలనలో వ్యూహాత్మక ప్రాధాన్యతల పున: సమీక్షను ప్రాధాన్యాలను సూచిస్తుంది. అభివృద్ధి చెందిన శక్తులు, దీర్ఘకాలిక ప్రత్యర్థులు ఒక గ్రూపులోకి రావడం ద్వారా సంప్రదాయ ఆలోచనలను ఇది సవాల్ చేస్తుందనడంలో సందేహం లేదు.
ఈ భావన ఊహాగానాలకు అతీతంగా సాగుతుందా? లేదా అనేది భవిష్యత్ లో విధాన ప్రకటనలు, ఇందులో ఉన్న దేశాల నుంచి వచ్చే దౌత్య సంకేతాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సమూహం పై చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవేళ అది అధికారికంగా ఊపిరిపోసుకున్నట్లు అయితే భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాలను పునర్మించగలదు.
Read More
Next Story