ఇస్లామాబాద్ కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది: ట్రంప్
x
ట్రంప్

ఇస్లామాబాద్ కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది: ట్రంప్

త్వరలో జోక్యం చేసుకుంటా అన్నఅమెరికా అధ్యక్షుడు


Click the Play button to hear this message in audio format

ఆఫ్ఘన్ తో తలపడుతున్న పాకిస్తాన్ కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని అమెరికా ప్రకటించింది. కాబూల్, కాందహార్ లోని అనేక ప్రాంతాలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారాయని పేర్కొంది. ఈ ప్రాంతాలపైనే పాక్ వైమానిక దాడులు చేసింది. దీనితో డ్యూరాండ్ లైన్ వెంబడి పాక్, ఆఫ్ఘన్ సేనలు దాడులు చేసుకుంటున్నాయి.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆప్ఘన్ యుద్ధాన్ని బహిరంగ యుద్ధంగా వర్ణించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. పాక్ దళాలు ఎలాంటి దురాక్రమణ అయిన అణచివేయగల సామర్థ్యం ఉందని అన్నారు. ‘‘జాతి మొత్తం పాకిస్తాన్ సాయుధ దళాలతో కలిసి నిలుస్తుంది’’ అన్నారు.

తాలిబన్ పాలన..

అమెరికా సైన్యం కాబూల్ నుంచి ఉపసంహరించుకున్న తరువాత 2021 లో తాలిబన్లు అక్కడ అధికారం చేపట్టారు. తరువాత పాక్ తో ఉద్రిక్తతలు పెరిగాయి. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. కాబూల్ చర్చలను ఇష్టపడుతుందని, పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు.

ట్రంప్ ప్రతిస్పందన..

పాకిస్తాన్- ఆఫ్ఘన్ యుద్ధంలో తాను జోక్యం చేసుకుంటా అని ట్రంప్ అన్నారు. అయితే తాను మాత్రం ఇస్లామాబాద్ పక్షం అనే బహిరంగంగా చెప్పారు. ‘‘నేను జోక్యం చేసుకుంటాను.. కానీ పాకిస్తాన్ తో చాలా బాగా కలిసిపోతాను. మీకు గొప్ప ప్రధానమంత్రి ఉన్నారు. గొప్ప జనరల్ ఉన్నారు. పాకిస్తాన్ బాగా పనిచేస్తుంది’’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు.
ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, పాకిస్తాన్ సైన్యాన్ని బహిరంగంగా పొగిడారు. ఇస్లామాబాద్ తో వాషింగ్టన్ నాయకత్వం బాగా సాగుతోందని చెప్పారు.

నిశితంగా పరిశీలిస్తున్నా..

‘‘తాలిబన్ల దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు’’ పాకిస్తాన్ సమర్థిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దీనిని ప్రత్యేకంగా తయారు చేసిన గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్ గా అభివర్ణించింది. ‘‘తాలిబన్లు తమ ఉగ్రవాద నిరోధక కట్టుబాట్లను నిలబెట్టుకోవడంలో నిరంతరం విఫలం అవుతున్నారు. హింసతో ఈ ప్రాంతం అస్థిరంగా మారుతోంది. ఉగ్రవాద గ్రూపులు దారుణమైన దాడులకు పాల్పడటానికి ఆఫ్ఘన్ ను లాంచ్ ప్యాడ్ గా ఉపయోగిస్తున్నాయి’’ అని ఒక ప్రతినిధి చెప్పారు.

ప్రపంచవ్యాప్త ఆందోళన, ప్రాంతీయ ప్రమాదం..

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని బ్రిటన్ పిలుపునిచ్చింది. చైనా కూడా కాల్పుల విరమణ పాటించాలని కోరింది. ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చింది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరులు మరణించడంపై యూఎన్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు.


Read More
Next Story