మదురో కిడ్నాప్ తో అంతా ముగిసిపోలేదా?
x
కారకాస్ లో మదురోను అరెస్ట్ చేసిన అనంతరం సంబరాలు చేసుకుంటున్న ప్రజలు

మదురో కిడ్నాప్ తో అంతా ముగిసిపోలేదా?

వెనెజువెలా పూర్తిగా అమెరికా హస్తగతం అవుతుందా?


వెనెజువెలాపై అమెరికా దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను కిడ్నాప్ చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను మరోసారి సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మదురో కిడ్నాప్ వెనెజువెలాను ఆక్రమించి దాని చమురు నిల్వలను వనరులను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో కందిరీగ తుట్టెను కదిపారు.

ఇది కచ్చితంగా లాటిన్ అమెరికా దేశాలలో గందరగోళం అనివార్యంగా కనిపిస్తోంది. అమెరికా నిర్బంధంలో మదురో, హలీవుడ్ సినిమాలో ఓడిపోయిన గ్యాంగ్ స్టర్ లాగా కనిపించవచ్చు. కానీ వాస్తవం చాలా క్లిష్టంగా ఉంది.

విషయం ఏంటంటే.. వెనెజువెలాలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా మదురో అధ్యక్షుడు కాలేదు. 2013 లో హ్యుగో చావెజ్ క్యాన్సర్ కారణంగా మరణించిన తరువాత ఆయన వారసుడిగా మదురో అధికారం చేపట్టాడు.

సామ్రాజ్యవాద శక్తికి వ్యతిరేకంగా..
ఈ ఇద్దరిని అధికారంలోకి తీసుకొచ్చింది సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరి. కార్మికులకు అనుకూలంగా, అణగారిన వర్గాల హక్కుల కోసం నిలబడే ఒక భారీ సామాజిక ఉద్యమం నిర్మించారు.
ఈ ప్రక్రియలో చావిస్టాలు(చావెజ్ మద్దతుదారులు, ఇందులో మదురో కూడా ఉన్నారు) వెనెజవెలాలో బాగా స్థిరపడిన, శక్తివంతమైన అమెరికా అనుకూల వ్యాపార వర్గాలను ఆగ్రహానికి గురయ్యేలా చేశారు. ఇప్పటికే జాతీయ చేయబడిన చమురు పరిశ్రమలోని బహుళజాతి డైరెక్టర్లను తొలగించారు.
1998 లో అధ్యక్షుడిగా ఎన్నికైన చావెజ్, ఒక శతాబ్ధానికి పైగా వాషింగ్టన్ ఆధిపత్యం చెలాయించిన లాటిన్ అమెరికా ప్రాంతంలో అమెరికా వ్యతిరేక స్వరానికి బలంగా మద్దతు ఇచ్చాడు.
కాబట్టి 2013 లో మదురో చావెజ్ స్థానంలో వచ్చినప్పుడూ ఏదో ఒక యథావిధి ప్రక్రియగా జరగలేదు. ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియలో చావెజ్ వెనెజువెలా మద్దతుదారులు ఒక పాలన నుంచి మరొక పాలనకు సజావుగా మారడానికి దోహదపడ్డారు.
మదురోను ఎత్తుకెళ్లడం ద్వారా ట్రంప్ మాట్లాడుతూ.. అధికారికంగా అధికార పగ్గాలు చేపట్టిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ సజావుగా పరివర్తనకు వీలు కల్పించడానికి అమెరికాతో కలిసి పనిచేస్తామని సూచించారని అన్నారు.
పాలన మార్పు ప్రతిఘటన లాగా మారుతుందా?
అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ట్రంప్ వెలువరించిన అభిప్రాయాలకు భిన్నంగా రోడ్రిగ్జ్ మాట్లాడారు. అమెరికా చర్యను అంతర్జాతీయ చట్టం, వెనెజువెలా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణిస్తూ, మదురో అతని భార్యను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
వెనెజువెలా నౌకాశ్రయం నుంచి ఓడలను లక్ష్యంగా చేసుకుని రెండు నెలల క్రితం ప్రారంభమైన ట్రంప్ జోక్యం, మదురో కిడ్నాప్ తో చివరకు దశకు చేరుకుంది. కానీ ఇక్కడ నుంచి మార్గం అంతా గందరగోళంగా కనిపిస్తుంది.
పాలక చావిస్టాస్ తొలి ప్రతిస్పందన ఏదైనా ఉంటే పాలన మార్పుకు తీవ్ర వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది. ఉపాధ్యక్షుడు రోడ్రిగ్జ్, ట్రంప్ తో పోటీపడవలసి వచ్చినప్పటికీ, పాలక వర్గం నుంచి ఆమెకు గట్టి వ్యతిరేకత రావచ్చు.
యునైటెడ్ సోషలిస్టు పార్టీ ఆఫ్ వెనెజువెలా ఆధ్వర్యంలో పాలక మదురో పాలనను లెప్ట్- రైట్ అనుకూల ప్రతిపక్షాలు, ఇప్పుడు కిడ్నాప్ చేయబడిన అధ్యక్షుడి చుట్టూ ఉన్న అధికారుల గుంపు తప్ప మరే మద్దతు లేని నియంతృత్వ మద్దతుదారులుగా ఉన్నాయి.
వెనెజువెలా రాజకీయాలను అమెరికా తప్పుగా అర్థం చేసుకుందా?
కొంతకాలం చరిత్రను పరిశీలిస్తే చావెజ్, మదురోలను గద్దె దింపడానికి అమెరికా అనేకసార్లు ప్రయత్నించింది. కానీ ఫలితం మాత్రం రాబట్టలేకపోయింది. ఎన్నికల ద్వారా చావెజ్ ను తరువాత మదురోను అధికారంలోకి తెచ్చిన రాజకీయాల ప్రత్యేక స్వభావం దీనికి కారణం.
చావెజ్, మదురో ప్రభుత్వాలు అధికారంలో ఉన్న మూడు దశాబ్దాలలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కింది స్థాయి ప్రజలు వారికి మద్దతుగా ఉన్నారు. ఇందులో సహకార సంస్థలు, స్థానిక ఉత్పత్తి, సరఫరా నెట్ వర్క్ లు, రైతుల ఆధారిత మార్కెట్, చావిస్టాలకు మద్దతునిచ్చే అనేక ఎన్జీఓ లు ఉన్నాయి. ఈ నెట్ వర్క్ ల వద్ద ముప్పు సమయంలో ఉపయోగించడానికి ఆయుధగారాలను కూడా ఏర్పాటు చేసుకున్నాయి.
అయినప్పటికీ మదురోను ట్రంప్ కిడ్నాప్ చేయించారు. ట్రంప్ చర్య అధ్యక్షుడు, అతని మద్దతుదారులను కాస్త శాంతింపజేసినప్పటికీ, ఈ చర్యను ప్రతిఘటించడానికి చావిస్టాలు సంఘటితం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రెండు మార్గాలు..
ప్రస్తుతం ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఉపాధ్యక్షుడు రోడ్రిగ్జ్ ట్రంప్ తో చర్చలు జరపడానికి సిద్దంగా ఉండటం, ఆ తరువాత శాంతియుత పరివర్తన వెనెజువెలా ప్రయోజనాలకు మంచిదని సాధారణ ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నించడం, రెండోవది ప్రజల ఒత్తిడి కారణంగా రోడ్రిగ్జ్ అమెరికాను ప్రతిఘటించడానికి పూర్తిగా ప్రయత్నించవచ్చు. ఈ సందర్భంలో మదురో ప్రభుత్వం బలహీనంగా ఉన్నది కాబట్టి మితవాద పార్టీ ప్రభుత్వాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయవచ్చు.
వెనెజువెలాను లొంగదీసుకోవడం అమెరికాకు అంత సులభం కాదనే అభిప్రాయాలను బలం చేకూర్చేది ఏమిటంటే గత 25 ఏళ్లలో మొదట చావెజ్ ను, తరువాత మదురోను పదవీచ్యుతుని చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ జాబితా చాలా పెద్దది.
2002 లో సైన్యంలోని ఒక వర్గం మద్దతుతో వెనెజువెలా వ్యాపారవేత్తలు ఒక తిరుగుబాటు ద్వారా చావెజ్ ను పడగొట్టారు. కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. భారీ ప్రజా నిరసనలు పదవీచ్యుతుడైన అధ్యక్షుడిని తిరిగి నియమించాయి.
దీనితరువాత వెనెజువెలాలోని అమెరికా ఆధ్వర్యంలోని పెట్రోలియం కంపెనీలు ఆర్థిక వ్యవస్తను అణగదొక్కడానికి చావెజ్ ను గద్దె దించడానికి సమ్మెచేశాయి. కానీ అవన్నీ విఫలమయ్యాయి.
త్వరిత పతనం లేదు..
కొన్ని సంవత్సరాల తరువాత 2019 లో కిరాయి సైనికులు, వెనెజువెలా సైన్యం నుంచి బయటకు వచ్చిన వారిని ఉపయోగించి మరోసారి మదురో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అమెరికా కుట్రపన్నిందని ఆరోపణలు వచ్చాయి.
ఒక సంవత్సరం తరువాత ఆపరేషన్ గిడియాన్ లో అమెరికా శిక్షణ పొందిన తిరుగుబాటు వెనెజువెలా సైనికులు మదురోను దించడానికి ప్రయత్నించారు. కానీ మళ్లీ ఉత్త చేతులతో వెళ్లారు.
గత ఏడాది అమెరికా, మదురో ప్రభుత్వాన్ని బెదిరించడానికి భారీ సైనిక విన్యాసాలలో పాల్గొంది. దీని తరువాత మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఉపయోగించి వెనెజువెలా నౌకలపై దాడి జరిగింది.
చివరకు జనవరి 3న కిడ్నాప్ చేశారు. గత పాతిక సంవత్సరాల తరువాత అమెరికా కారకాస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యం తాజాగా నెరవేరింది. దీనికోసం అనేక సంవత్సరాలుగా చమురు రంగంపై ఆంక్షలు విధించింది.
అమెరికా ప్రత్యేక దళాలు మదురోను కిడ్నాప్ చేయడంలో తమ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసి ఉండవచ్చు. కానీ ఇది మరో ప్రారంభం మాత్రమే. వెనెజువెలా ప్రభుత్వం పేక ముక్కలా కూలిపోతుందని ఆశించడం ఆశాజనకమైన ఆలోచన.
(ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Read More
Next Story