
దక్షిణ గాజాకు వలసపోతున్న పాలస్తీనా వాసులు
గాజాకు మానవతా సాయం చేయడానికి అంగీకరించిన ఇజ్రాయెల్
గాజాను విచ్చిన్నం చేయడానికి సిద్దంగా ఉన్నామన్న ఐడీఎఫ్
గాజాపై వైమానిక, భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ అక్కడి పౌరుల కోసం పరిమిత మానవతా సాయాన్ని అనుమతిస్తామని పేర్కొంది. రాత్రిపూట చేస్తున్న వైమానిక దాడులకు తోడు, భూతల దాడుల వల్ల డజన్ల కొద్ది పిల్లలు సహ కనీసం 103 మంది మరణించారని, ఉత్తర గాజాలోని ప్రధాన ఆస్పత్రిని మూసివేశామని వైద్యులు తెలిపారు.
ఆకలితో ఉన్న గాజా పౌరుల కోసం తమ మంత్రివర్గం 2 మిలియన్ల ప్రజలకు ఆహారాన్ని అందించడానికి అనుమతించిందని ఆదివారం అర్థరాత్రి ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు చెప్పారు.
ఆహార భద్రతపై ప్రపంచ నిపుణులు కరువు గురించి హెచ్చరించిన కొన్ని రోజుల తరువాత ఇజ్రాయెల్ కూడా కొంచెం దూకుడు తగ్గించింది. గాజాలో ఆకలి సంక్షోభం ఇజ్రాయెల్ కొత్త సైనిక దాడిని ప్రమాదం పడేస్తుందని, అందుకే ఈ సాయానికి అనుమతి ఇస్తున్నామని కూడా ప్రధాని ప్రకటించారు.
సాయం ఎప్పుడూ ప్రవేశిస్తుందో తెలియదు?
గాజాలోకి సాయం ఎప్పుడూ, ఎలా ప్రవేశిస్తుందో వెంటనే స్పష్టంగా తెలియలేదు. సహాయ కార్మికుల అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ కొత్త వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. సాయం ఉగ్రవాదులకు చేరకుండా చూసుకోవడానికి ఇజ్రాయెల్ కృషి చేస్తుందని నెతన్యాహు అన్నారు.
గాజా పై మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ దిగ్భంధన విధించింది. గాజాకు ఆహారం, మందులు, ఇతర సామగ్రిని నిలిపివేసింది. అదే సమయంలో హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను అంగీకరించాలని ఒత్తిడి చేసింది. రెండు నెలల కాల్పుల విరమణను విచ్ఛిన్నం చేస్తూ ఇజ్రాయెల్ కొన్ని రోజుల తరువాత యుద్దాన్ని తిరిగి ప్రారంభించింది.
గాజా నుంచి బందీలను విడిపించే తాత్కాలిక కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. కానీ యుద్దాన్ని మాత్రం ముగించడం లేదు. హమాస్ కూడా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, యుద్దాన్ని ముగించే మార్గాన్ని కోరుకుంటున్నట్లు చెబుతోంది.
పౌరుల దుస్థితి..
‘‘యూదులు సంధిని కోరుకున్నప్పుడూ హమాస్ నిరాకరిస్తోంది. హమాస్ కోరుకున్నడూ యూదులు నిరాకరిస్తున్నారు. పాలస్తీనా ప్రజలను నిర్మూలించడానికి రెండు వైపులా ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని జబాలియా నివాసి అబూ మొహ్మద్ యాసిన్ చెప్పినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది.
కొత్తదాడి వలన కాలినడకన, గాడిడ బండ్లలో పారిపోతున్న వారిలో యాసిన్ కూడా ఉన్నాడు. ‘‘మాపై కాస్త దయ చూపండి. మేము స్థలాలు మారి మారి విసుగు చెందాము’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
గాజాను విచ్చిన్నం చేయబోతోందా?
గాజాపై భూతల దాడులు చేయడానికి ఇటీవల పదివేల రిజర్వ్ దళాలను ఇజ్రాయెల్ సైన్యం సిద్దం చేసింది. గాజాలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో భూ కార్యకలాపాలు కొనసాగిస్తామని తెలిపింది. ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాప్ లెప్టినెంట్ జనరల్ ఇయాన్ జమీర్ మాట్లాడుతూ.. ఈ ప్రణాళికలలో ‘‘ విచ్చిన్నం చేయడం కూడా ఉంది’’ అని ఆయన చెప్పారు.
దక్షిణ నగరం ఖాన్ యూనిస్, చుట్టుపక్కల వైమానికదాడుల్లో 18 మంది పిల్లలు, 13 మంది మహిళలు సహ 48 మంది మరణించినట్లు నాజర్ హస్పిటల్ తెలిపింది. మృతదేహాల పరిస్థితి కారణంగా వాటిని లెక్కించడం కష్టంగా మారిందని పేర్కొంది.
వీటిని ఇజ్రాయెల్ సైన్యం లెక్క చేయలేదు. గతవారంలో జరిగిన ప్రాథమిక దాడుల్లో డజన్ల కొద్దీ ఉగ్రవాదులు మరణించారని, 670 లక్ష్యాలను ధ్వంసం చేశామని తెలిపింది. హమాస్ పౌరులను షీల్డ్ గా ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతుందని, ఈ మరణాలకు భయానక ఉగ్రవాద సంస్థే కారణమని ఆరోపించింది.
ఖతార్ లో చర్చలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా పర్యటన ముగిసే వరకూ వేచి ఉండి, కాల్పుల విరమణ ప్రయత్నాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ట్రంప్ పశ్చిమాసియాకు వచ్చినప్పటికీ టెల్ అవీవ్ కు మాత్రం రాలేదు.
ఖతార్ లోని ఇజ్రాయెల్ కార్యాలయం శాంతి చర్చల ప్రయత్నాలు సైతం చేస్తోంది. ఇందులో హమాస్ ను గాజా నుంచి తొలగించడం, నిరాయుధీకరణ, బందీల విడుదల వంటి అంశాలు ఉన్నాయి. అయితే గాజాను విడిచిపెట్టడానికి, నిరాయుధీకరణ చేయడానికి ఉగ్రవాద సంస్థ నిరాకరించింది.
మూడువేల మంది మరణం..
కాల్పుల విరమణ ముగిసినప్పటి నుంచి దాదాపు మూడు వేల మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే దీర్ఘకాలిక యుద్దం వల్ల యూదుల్లో అసహనం పెరుగుతోంది. చాలామంది సైన్యంలోకి రావడానికి నిరాకరిస్తున్నారు. సాధారణ ఇజ్రాయోలీయులందరూ ర్యాలీలో గాజాలో చంపబడిన పిల్లల ఫొటోలు, బందీల చిత్రాలు ప్రదర్శిస్తూ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారు.
ఆస్పత్రిని దిగ్భంధించిన ఇజ్రాయెల్
ఉత్తర గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రి చుట్టూ ఐడీఎఫ్ ఉండటంతో దానిని మూసివేయాల్సి వచ్చిందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఇజ్రాయెల్ దాడుల కారణంగా కమల్ అద్వాన, బీట్ హనౌన్ ఆస్పత్రులు కూడా తమ సేవలు నిలిపివేశాయి.
‘‘ఐసీయూ యూనిట్ తో సహ ఆస్పత్రిపై లక్ష్యంగా చేసుకున్నారు’’ అని ఇండోనేషియా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మార్వాన్ అల్ సుల్తాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐడీఎఫ్ పదేపదే ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుంటోందని మానవ హక్కుల సంఘాలు, యూఎన్ మద్దతు గల నిపుణులు ఆరోపిస్తున్నారు.
అయితే ఉత్తర గాజాలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలపై దళాలు పనిచేస్తున్నాయని, ఆసుపత్రికి పక్కనే ఉన్న ప్రాంతంలో వాటి కదలికలు ఉన్నాయని ఐడీఎఫ్ వెల్లడించింది.
హౌతీల దాడులు..
ఇజ్రాయెల్ పై హౌతీలు క్షిపణి దాడులు చేశారు. వీటిని అడ్డుకున్నట్లు ఐడీఎఫ్ ప్రయోగించింది. ఈ నెల ప్రారంభంలో హౌతీ క్షిపణి దాడికి గురైన టెల్ అవీవ్ సమీపంలోని ఇజ్రాయెల్ ప్రధాన విమానాశ్రయం వైపు హైపర్ సోనిక్ తో సహ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించామని తిరుగుబాటుదారులు తెలిపారు.
గాజాలో దాడులకు ప్రతిస్పందనగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ ఎనిమిదో సారి యెమెన్ పై దాడి చేసింది. గాజాలోని పాలస్తీనియన్లకు సంఘీభావంగా తాము దాడి చేస్తున్నామని హౌతీలు తెలిపారు.
హెగ్ లో వేలాది మంది నిరసన తెలిపారు..
గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం డచ్ రాజధానిలో వేలాది మంది ఎర్ర షర్ట్స్ వేసుకుని ర్యాలీ నిర్వహించారు. గత రెండు దశాబ్దాలలో దేశంలో ఇది అతిపెద్ద ర్యాలీ అని నిర్వాహాకులు పేర్కొన్నారు.
మానవ హక్కుల సంఘాలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, సేవ్ ది చిల్డ్రన్ వంటి సంస్థలు శాంతియుత జనసమూహాన్ని లక్ష కంటే ఎక్కువ మంది వచ్చారని తెలిపారు. హేగ్ వీధులు మొదటి నిరసనలో వృద్ధులు, యువకులు, కొంతమంది శిశువులతో నిండిపోయాయి.
‘‘ఇది ప్రభుత్వానికి మేల్కోలుపు పిలుపు మేము ఆశిస్తున్నాము.’’ అని తన భర్త, 12 వారాల కుమార్తెతో డిడో కలిసి మార్చ్ లో హాజరైన ఉపాధ్యాయురాలు రూస్ లింగ్ బీక్ అన్నారు.
ఈ ర్యాలీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం అయిన పీస్ ప్యాలెస్ దాటి తీసుకు వెళ్లింది. గత సంవత్సరం న్యాయమూర్తులు గాజాలో జాతి హననాలు పై పలు తీర్పులు వెల్లడించింది. అయితే వీటిని ఇజ్రాయెల్ పట్టించుకోకుండా న్యాయమూర్తులపై నిషేధం విధించింది.
Next Story