‘గాజా’ను అరబ్ దేశాలకు అప్పగిస్తాం: ఇజ్రాయెల్
x
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు

‘గాజా’ను అరబ్ దేశాలకు అప్పగిస్తాం: ఇజ్రాయెల్

మంత్రివర్గ నిర్ణయాన్ని సమర్థించుకున్న నెతన్యాహు


హమాస్ ను నాశనం చేసి, గాజా స్ట్రిప్ ను పూర్తిగా నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. దాని పరిపాలనను అరబ్ దేశాలకు బదిలీ చేస్తామన్నారు. తీవ్రవాద సంస్థ హమాస్ ను ఓడించాలనే ప్రధాని ప్రతిపాదనను భద్రతా మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో టెల్ అవీవ్ నుంచి ఈ సందేశం బయటకు వచ్చింది.

ప్రతిపాదనకు..
ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడారు. ‘‘గాజా మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుంటారా? ’’ అని ఆయనను ప్రశ్నించగా, ‘‘ మా భద్రత కోసం అక్కడ ఉన్న హమాస్ ను తొలగించాలి. అక్కడి ప్రజలకు హమాస్ నుంచి విముక్తి కల్పించాలని మేము భావిస్తున్నాము’’ అని నెతన్యాహు చెప్పారు.
అదే సమయంలో తాము శాశ్వతంగా గాజాను కలుపుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. మమ్మల్ని బెదిరించడకుండా, గాజా వాసులకు మంచి జీవితాన్ని ఇచ్చే అరబ్ దేశాలకు దానిని అప్పగిస్తామన్నారు.
ఇజ్రాయెల్ లక్ష్యం గాజా కాదన్నారు. కేవలం హమాస్ నుంచి గాజాకు విముక్తి కల్పిస్తామన్నారు. అక్కడ శాంతియుత ప్రభుత్వాన్ని స్థాపించడమే తమ తదుపరి లక్ష్యమన్నారు.
గాజా లక్ష్యాలు..
భద్రతా మంత్రివర్గం, మెజారిటీ ఓటుతో యుద్దాన్ని ముగించడానికి ఐదు సూత్రాలను ప్రతిపాదించి ఆమోదించింది. వాటిలో హమాస్ నిరాయుధీకరణ, జీవించి, మరణించిన బందీలందరిని తిరిగి తీసుకురావడం, గాజా నుంచి సైనికీకరణ తొలగింపు, గాజాపై ఇజ్రాయెల్ నియంత్రణ, హమాస్ లేదా పాలస్తీనా అథారిటికీ ప్రత్యామ్నాయా పౌర పరిపాలన ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి.
ఐడీఎఫ్ గాజా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి సిద్దం కావాలని అదే సమయంలో అందులోని పౌరులకు మానవతా సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఐరాస హెచ్చరిక..
గాజాలోని 75 శాతం భూభాగం ఇప్పటికే ఇజ్రాయెల్ నియంత్రణలో ఉందని పాశ్చాత్య దేశాల మాట. యూదు దేశం వెంటనే యుద్దాన్ని ముగించి మరింత మానవతా సాయాన్ని అందించాలని అవి కోరాయి. లేకపోతే ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరిదవుతుందని హెచ్చరించాయి.
గాజా నగరాన్ని నియంత్రించాలనే ఇజ్రాయెల్ నిర్ణయం పై ఐరాస సెక్రటరీ జనరల్ అంటోని గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి అక్కడ ప్రజలకు విపత్కర పరిస్థితి తీసుకొస్తుందని అంచనా వేశారు. అలాగే హమాస్ చేతిలో బందీగా ఉన్నవారందరికి ముప్పుగా పరిణమిస్తుందని చెప్పారు.
గాజా, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం సహ పాలస్తీనా భూభాగంలోని తన చట్టవిరుద్దమైన ఉనికిని ఇప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానం వ్యతిరేకించిందని గుటేరస్ సెక్రటరీ ట్రేంబ్లే తెలిపారు. కోర్టు తీర్పును గౌరవించాలని కోరారు.
ఆయుధ ఎగుమతుల నిలిపివేత..
గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన జర్మనీ, ఆయుధాల ఎగుమతిని నిలిపివేసింది. ఈ విషయాన్ని ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ శుక్రవారం ప్రకటించారు. దశాబ్ధాలుగా ఇజ్రాయెల్ కు గట్టి మద్దతుదారుగా ఉన్న జర్మనీ, గాజాపై టెల్ అవీవ్ వైఖరి బయటకు రాగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
‘‘హమాస్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉంది’’ అని మెర్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే బందీలను విడుదల చేయడం, కాల్పుల విరమణ కోసం చర్చలు జరపడం మా ప్రధాన లక్ష్యం అన్నారు. గాజాలో భవిష్యత్ లో హమాస్ పాత్ర ఉండకూడదని అభిలాషించారు. అయితే జర్మనీ నిర్ణయం పై ఇజ్రాయెల్ తన నిరాశను వ్యక్తం చేసింది.
‘‘హోలోకాస్ట్ తరువాత యూదు ప్రజలపై అత్యంత భయంకరమైన దాడి హమాస్ చేస్తోంది. దాని న్యాయమైన యుద్దానికి మద్దతు ఇవ్వడానికి బదులుగా జర్మనీ, ఇజ్రాయెల్ కు ఆయుధాలు నిషేధించడం ద్వారా హమాస్ ఉగ్రవాదానికి ప్రతిఫలమిస్తోంది’’ అని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
Read More
Next Story