ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
x

ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అమెరికాతో పాటు ఫ్రాన్స్ కీలక పాత్ర పోషించింది.


పశ్చిమాసియాలో హిజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలతో ఇరు దేశాల ప్రతినిధులతో వైట్ హౌజ్ అధికారులు మాట్లాడారు. ప్రస్తుతం కుదిరిన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన దళాలను లెబనాన్ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది.

ఈ ఒప్పందాన్ని ప్రస్తుతం ఇజ్రాయెల్ క్యాబినేట్ ఆమోదించింది. శాంతి ఒప్పందం కుదరడంపై జో బైడెన్ మాట్లాడారు. నెతన్యాహు, లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటితో మాట్లాడినట్లు బైడెన్ తెలిపారు.

"ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య విధ్వంసకర సంఘర్షణకు ముగింపు పలకడానికి వారి ప్రభుత్వాలు యునైటెడ్ స్టేట్స్ ప్రతిపాదనను అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ క్షణాన్ని చేరుకోవడంలో భాగస్వామ్యం చేసినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని బైడెన్ చెప్పారు.
"ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య వివాదాన్ని ముగింపుకు తీసుకురావడానికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని రూపొందించడానికి ఇజ్రాయెల్ - లెబనాన్ ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని నేను నా బృందాన్ని ఆదేశించానని తెలిపారు.
ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐడీఎఫ్ దళాలు తిరిగి వారి బేస్ లకు చేరుకుంటాయని బైడెన్ అన్నారు. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి రాగానే ఈ ప్రాంతాన్ని తిరిగి లెబనాన్ బలగాలు స్వాధీనం చేసుకుంటాయని, అయితే హెజ్ బుల్లా కోసం కొత్త నిర్మాణాలు చేయడానికి అనుమతించవని బైడెన్ అన్నారు.
స్వాగతించిన ఐరాస..
ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై ఐరాస అధ్యక్షుడు ఆంటోనియో గుటేరస్ స్వాగతించారు. యూదు, అరబ్బు ప్రజలు అనుభవిస్తున్న హింస, విధ్వంసపు బాధలను ఇది అంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సెనేట్ మెజారిటీ నాయకుడు చక్ షుమెర్ ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రాంతానికి మంచి ఒప్పందంగా అభివర్ణించారు. ఉగ్రవాదులను సైనికంగానూ, దౌత్యంతోనూ తిప్పికొట్టినప్పుడు శాంతి నెలకొనే అవకాశం పెరుగుతుందని అన్నారు. హమాస్ కూడా వెంటనే బందీలను విడిచిపెట్టి, ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందానికి రావాలని, అది కాకుండా ఇంతకుముందు విఫలమైన వ్యూహాన్ని కొనసాగించడం వలన గాజాలో మరింత రక్తపాతానికి దారి తీస్తుందని షుమెర్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ బలాన్ని గుర్తించాలని, లేదంటే మరోసారి తీవ్రంగా ఇబ్బంది పడతారని అన్నారు.


Read More
Next Story