సందట్లో సడేమియాలా ఇజ్రాయెల్.. సిరియా భూభాగం ఆక్రమణ
x

సందట్లో సడేమియాలా ఇజ్రాయెల్.. సిరియా భూభాగం ఆక్రమణ

గోలెన్ హైట్స్ చుట్టుపక్కలా ప్రాంతాలపై ఐడీఎఫ్ పట్టు


పశ్చిమాసియాలో ఒక సంక్షోభం ముగియగానే, మరో సంక్షోభం ముంచుకు వస్తోంది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతికి చిక్కింది. ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యా పారిపోయారు. అసద్ సైన్యం ఎప్పుడో చేతులెత్తిసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ తన దూకుడు ప్రదర్శిస్తోంది.

1967 లో యూదు దేశం చేజిక్కించుకున్న సిరియాలోని గోలన్ హైట్స్ సరిహద్దులోని ప్రాంతాలను ఐడీఎఫ్ ఆక్రమించేసింది. భవిష్యత్ లో తమకు తిరిగి ఉగ్రవాదుల దాడులు జరగకుండా కీలక ప్రాంతాలను అదుపులోకి తీసుకుంది.

సిరియాలోని అనేక ప్రాంతాలపై వైమానిక దాడులు కొనసాగిస్తునే ఉంది. ఆయుధాల నిల్వలు ఉగ్రవాదుల చేతుల్లోకి రాకుండా ఆపడానికి ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపింది.

ఒక్క రోజే అంటే సోమవారం ఇజ్రాయెల్ సిరియాలో 100 కంటే ఎక్కువ వైమానిక దాడులను నిర్వహించింది. UK ఆధారిత మానవ హక్కుల సంస్థ అయిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ వివరాలు వెల్లడించింది.
ఇజ్రాయెల్ బాంబు దాడి
సిరియాలో రసాయన ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకారం, తన దేశ భద్రతను నిర్ధారించడానికి బాంబు దాడులు అవసరం. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్‌ను ఉటంకిస్తూ బిబిసి ప్రచురించిన కథనం ప్రకారం.. రాజధాని డమాస్కస్, దారా, లటాకియా, హమాలో సైనిక ప్రదేశాలు లక్ష్యంగా దాడులు చేశాయి.
జైలులో వెతుకులాట..
ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న తిరుగుబాటు దళాలు బషర్ అల్ అసద్ నిర్వహించిన సెడ్నాయ జైలులోని ఖైదీలను విడిచిపెట్టినట్లు వెల్లడించారు. తమ కుటుంబ సభ్యుల కోసం అక్కడ వెతుకులాట కొనసాగుతూనే ఉన్నాయి. ఖైదీలను భూగర్భంలో నిర్మించిన జైలులో రహస్యంగా నిలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది మధ్య ప్రాచ్యంలోనే అత్యంత ఘోరమైన కారాగారంగా ప్రసిద్ది చెందుతుంది. ఇక్కడ రహస్య గదులు కూడా ఉన్నాయని ఫుకార్లు ఉన్నాయి. పౌర రక్షణ సంస్థ ది వైట్ హెల్మెట్స్ ఎక్కువ మంది ఖైదీల ఉనికిని నిర్ధారించలేకపోయింది.
" సెర్చ్ డాగ్‌లు, అందుబాటులో ఉన్న సాధనాలు, మునుపటి ఖైదీల సహాయంతో మేము చేయగలిగినది చేస్తున్నాము" అని సభ్యుడు BBCకి తెలిపారు. తిరుగుబాటు తరువాత దొరికిన బషర్ సైన్యానికి తాము క్షమాభిక్ష ప్రసాదిస్తామని కూడా తిరుగుబాటు దారులు వెల్లడించారు.
ఆశ్రయం కేసులను నిలిపివేసిన యూరప్..
ఇంతలో, UK సహా ఇతర యూరోపియన్ దేశాలు సిరియా నుంచి ఆశ్రయం కేసులపై నిర్ణయాలను నిలిపివేసాయి. UK హోమ్ సెక్రటరీ యివెట్ కూపర్ BBC తో మాట్లాడుతూ.. "అస్సాద్ పాలన పతనం తర్వాత సిరియాలో పరిస్థితి చాలా వేగంగా మారుతోంది" కొంతమంది సిరియాకు తిరిగి వెళ్తున్నారని పేర్కొన్నారు. అక్కడి పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని ఆమె అన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, నార్డిక్ దేశాలు కూడా సిరియన్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఆశ్రయం అభ్యర్థనలను నిలిపి వేశాయి.
ఇస్లామిక్ స్టేట్ భయం..
US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ప్రకారం, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలో తమను తాము తిరిగి స్థాపించుకోవడానికి ఈ గందరగోళ కాలాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ యునైటెడ్ స్టేట్స్ "అలా జరగనివ్వదు" అని చెప్పారు. సిరియన్లు తమ భవిష్యత్తును ఎంచుకోవాలని ఆయన అన్నారు. "సిరియా విచ్ఛిన్నం, తీవ్రవాదం ఎగుమతి" నివారించడానికి వాషింగ్టన్ కు స్పష్టమైన ఆసక్తి ఉందని బ్లింకెన్ చెప్పారు.


Read More
Next Story