
పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్
‘‘కశ్మీర్ ఎప్పటికైన పాకిస్తాన్ లో చేరుతుంది’’
పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్
తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెగ నూనె కావాలని అన్నాడంట.. ఈ సామెత పాకిస్తాన్ కు అతికినట్లు సరిపోతుంది. ఇప్పటికే పీకల్లోతు అప్పల్లో ఉన్న పాకిస్తాన్ కు కశ్మీర్ కావాలంట.
ఆ భాగం ఎప్పటికైన తమలో ఒక రాష్ట్రం అవుతుందని, అక్కడి పౌరులకు తమ మద్దతు ఉంటుందని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ పౌర, సైనిక నాయకత్వం గురువారం (ఫిబ్రవరి 5) కాశ్మీరీ ప్రజలకు తమ "అచంచల మద్దతు" ఉంటుందని పేర్కొన్నారు.
'కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం'లో భాగంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. "జమ్మూ-కాశ్మీర్ వివాదానికి పరిష్కారం కాశ్మీర్ ప్రజల కోరికలను గౌరవించడం, UNSC తీర్మానాలను అమలు చేయడం" తమ ప్రధాని విధి అని ముజఫరాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) సభలో పాక్ ప్రధాని షరీఫ్ అన్నారు.
"పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ నాయకత్వం తరపున కాశ్మీర్‌లోని మా సోదరులకు" సంఘీభావం తెలిపేందుకు తాను వచ్చానని చెప్పారు.
భారత్-పాకిస్తాన్ వివాదం
జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్ లో భాగమని న్యూఢిల్లీ ఇప్పటికే అనేకసార్లు ప్రకటించింది. అయినప్పటికి పాక్ మాత్రం తను లేస్తే కశ్మీర్ అని మాట్లాడుతూ మరోసారి తన వంకర బుద్దిని బయటపెట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తాము భారత్ కు గుణపాఠం నేర్పామని మిలియన్ జోక్ పేల్చింది. తాము పూర్తి శక్తితో పోరాడామని పేర్కొంది.
భారత్ ప్రాక్సీల ద్వారా తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదోస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘మనం శాంతిని కోరుకుంటున్నాము. కానీ ఈ శాంతిని సమానత్వం, న్యాయం ఆధారంగా స్థాపించవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.
కశ్మీర్ కు మద్దతు..
పాకిస్తాన్ పితామహుడు మహ్మద్ అలీ జిన్నా కశ్మీర్ ను పాకిస్తాన్ తమ హృదయనాడీగా పేర్కొన్నారని, ఇదే పాకిస్తాన్ విదేశాంగ విధానానికి ఆధారమని పేర్కొన్నారు. కశ్మీర్ ను పాలస్తీనా పోల్చారు. ఉగ్రవాదీ బుర్హాన్ వానీ, వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ గిలానీ, యాసిన్ మాలిక్, ఉమర్ ఫరూక్ కార్యకర్తలు జర్నలిస్టులు, ఆసియా ఆంద్రాబీ పేర్లను షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
కశ్మీరీ ప్రజలకు పాకిస్తాన్ దృఢమైన నైతిక, దౌత్య, రాజకీయ మద్దతును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పునరుద్ఘాటించారు. జమ్ముకశ్మీర్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, నేవల్ స్టాప్ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ జహీర్ అబ్బాస్ బాబర్ సిద్దూ తెలిపారు.
మునీర్ కూడా ముజఫరాబాద్ లో పర్యటించారు. కశ్మీర్ కు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఫార్వార్డ్ పోస్ట్ ను సందర్శించినట్లు సమాచారం. అక్కడి దళాలతో మాట్లాడారు. ‘‘భారత్ ఏదైన దురాక్రమణ జరిపితే తాము తక్షణం స్పందిస్తామని పేర్కొన్నారు’’ అని ఆయన చెప్పారు.
జమ్మూకశ్మీర్ కు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు, సెమినార్లు జరిగాయి. ఉదయం పది గంటలకు దేశవ్యాప్తంగా ఒక నిమిషం మౌనం పాటించినట్లు ప్రభుత్వ ఆధీనంలోని రేడియా పాకిస్తాన్ వార్తలు ప్రసారం చేసింది.
Next Story

