
కుల్ భూషణ్ జాదవ్
‘‘కుల్ భూషణ్ జాదవ్ కు అప్పీల్ చేసుకునే హక్కు లేదు‘‘
పాక్ సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వ తరఫు న్యాయవాదీ
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ అరెస్ట్ అయిన కుల్ భూషణ్ జాదవ్ కు ఎలాంటి హక్కులు లేవని అక్కడి ప్రభుత్వం ఆ దేశ సుప్రీంకోర్టుకు తెలిపింది. 2019 లో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో అతనికి కాన్సులర్ యాక్సెస్ ఇచ్చారని, కానీ తీర్పులో దాని గురించి ప్రస్తావించలేదని పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ సుప్రీంకోర్టుకు తెలిపింది. కావున అతనికి అప్పీల్ చేసుకునే హక్కు లభించలేదని నివేదించింది.
పాకిస్తాన్ పత్రిక డాన్ నివేదిక ప్రకారం.. పాక్ రక్షణ మంత్రిత్వశాఖ న్యాయవాదీ ఖవాజా హారిస్ అహ్మద్ బుధవారం సుప్రీంకోర్టులో ఈ ప్రకటన చేశారు.
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ నాయకుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత మే 9, 2023న జరిగిన అల్లర్లలో తమ పాత్రకు దోషులుగా తేలిన పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.
2023 అల్లర్ల కేసులో నిందితులైన పాక్ పౌరులకు అప్పీల్ చేసుకునే హక్కు భారతీయ పౌరుడికి ఎందుకు ఇవ్వలేదని సుప్రీంకోర్టు గతంలో అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా జాదవ్ కేసును ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
ప్రత్యేక చట్టం అమలులోకి..
విచారణ సందర్భంగా ఖవాజా రాజ్యాంగ ధర్మాసనం ముందు మాట్లాడుతూ.. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ పౌరులకు కాన్సులర్ యాక్సెస్ కల్పించనందుకు పాకిస్తాన్ 1963 వియన్నా కాన్సులర్ సంబంధాల సమావేశం ఆర్టికల్ 36 ను ఉల్లంఘిస్తోందని హేగ్ లో భారత్ వాదించిందని గుర్తు చేశారు.
విచారణ తరువాత పాక్ అంతర్జాతీయ న్యాయస్థానం చట్టం 2021 ని అమల్లోని తెచ్చింది. ఇది వియన్నా కన్వెన్షన్ నిబంధనలకు అనుగుణంగా విదేశాలకు సంబంధించిన సైనిక కోర్టు ఆదేశాలను సమీక్షించడానికి, పున: పరిశీలించడానికి అనుమతించింది. కొత్త చట్టం భారతీయ గూఢచారి కాన్సులర్ యాక్సెస్ కల్పించడానికి మార్గం సుగమం చేసిందని ఇది ప్రత్యేక అధికార పరిధి అని ఖవాజా అన్నారు.
జాదవ్ ఎవరూ?
మార్చి 2016 లో బలూచిస్తాన్ లో జాదవ్ పట్టుబడినట్లు పాక్ కట్టుకథలు ప్రచారంలో పెట్టింది. తరువాత జాదవ్ కు 2017 లో పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. జాదవ్ తాను భారత గూఢచారినని అంగీకరించాడని, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపినట్లు ఆ దేశం ఎప్పటిలాగే అబద్దాలను ప్రచారం చేస్తోంది.
పాక్ ఆరోపణలను భారత్ ఖండించింది. భారత నేవీలో రిటైర్డ్ అధికారి అయిన జాదవ్ వ్యాపారం కోసం ఇరాన్ లోని చాబహార్ రేవుకు వెళ్లిన సందర్భంగా కిడ్నాప్ కు గురి అయినట్లు పేర్కొంది.
కొన్ని రోజుల క్రితం జాదవ్ కిడ్నాప్ కు కీలక సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాదిని అజ్ఞాత బందూక్ దారులు పాకిస్తాన్ లోనే కాల్చి చంపారు.
ఐసీజే తీర్పు
జూన్ 2019 లో ఇచ్చిన తీర్పులో జాదవ్ కు కాన్సులర్ యాక్సెస్ ఉండాలని పేర్కొంది. దోషిగా నిర్ధారించడం, మరణశిక్షను పున: పరిశీలించాలని పాకిస్తాన్ ను కోరింది.
‘‘కుల్ భూషన్ జాదవ్ తో సంభాషించడానికి ఆయన ను సంప్రదించడానికి నిర్భంధంలో ఉన్న ఆయనను చూడటానికి ప్రాతినిధ్యం ఏర్పాటు చేయడంలో పాక్ విఫలం అయింది’’ అని పేర్కొంది. ఇది వియన్నా కన్వేన్షన్ ను నిబంధలను ఉల్లంఘించడమే అని ఐసీజే పేర్కొంది. అయితే ఐసీజే తీర్పును పాక్ సరిగా అమలు చేయడం లేదని భారత్ ఆరోపించింది.
Next Story