కువైట్‌లో అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి - మృతుల్లో 10 మంది భారతీయులు
కువైట్‌లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఎక్కువ 10 మంది భారతీయులు ఉన్నారు.
కువైట్‌లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారని సమాచారం. బుధవారం తెల్లవారుజామున కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనంలోని ఓ వంటగది నుంచి మంటలు వ్యాపించాయి. ఈ భవనంలో ఒకే కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 160 మంది వ్యక్తులు నివసిస్తున్నారని సమాచారం. మృతుల్లో 10 మంది భారతీయులు ఉన్నారు.
ఘటన స్థలిని పరిశీలించిన కువైట్ మంత్రి..
కువైట్ అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసుఫ్ అల్-సబాహ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన కంపెనీ, భవన యజమానుల అత్యాశ ఫలితంగా జరిగిందని పేర్కొన్నారు. ఒకే భవనంలో ఇంతమంది ఎలా ఉంటున్నారని అధికారులను ప్రశ్నించారు. భవన యజమాని, భవనం కాపలాదారుడు, కార్మికులు పనిచేస్తున్న కంపెనీ యజమానిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఇండియన్ ఎంబసీ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ ( +965-65505246)ను ఏర్పాటు చేసింది. అగ్నిప్రమాద బాధితుల అప్‌డేట్‌ల కోసం ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు.