
భూకంపం ధాటికి కూలిపోయిన ఓ భవనం
ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం, 800 మంది మృతి
తెల్లవారుజామున సంభవించిన భూకంపం
కల్లోల ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఇది సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో సంభవించిన బలమైన భూకంపం ధాటికి 800 మందికి పైగా మృతి చెందారు.
2,800 మందికి పైగా గాయపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. ఆదివారం ఆలస్యంగా సంభవించిన 6.0 తీవ్రతతో కూడిన భూకంపం పొరుగున ఉన్న నంగహార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ నగరం, కునార్ ప్రావిన్స్ లోని పట్టణాలను కుదిపేసింది.
రాత్రి. 11.47 గంటలకు సంభవించిన భూకంపం జలాలాబాద్ నగరానికి తూర్పు - ఈశాన్య దిశలో 27 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రెస్క్యూ బృందాలు ఇక్కడ సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి.
తక్కువ భూకంపం.. ఎక్కువ నష్టం..
భూకంపం కేవలం ఎనిమిది కిలోమీటర్ల లోతులో ఉంది. దీనివల్ల ఎక్కవ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. యూఎస్జీఎస్ ప్రకారం.. 1.2 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఈ భూంకంపం భారీన పడ్డారు.
మొదటి భూకంపం వచ్చిన తరువాత వరుసగా ఐదు చిన్న స్థాయి ప్రకంపనలు సంభవించాయి. వాటిలో ఒకటి ఆదివారం ఉదయం నాలుగు గంటల తరువాత 5.2 తీవ్రతతో సంభవించింది.
ఆఫ్ఘనిస్తాన్ తూర్పున భూకంప కేంద్రానికి దగ్గర మారుమూల కునార్ ప్రావిన్స్ లో మాత్రమే సుమారు 800 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
నంగర్హార్ ప్రావిన్స్ లో మరో 12 మంది మరణించారు. 255 మంది గాయపడినట్లు ఆయన తెలిపారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న జలాలాబాద్ పొరుగున ఉన్న పాకిస్తాన్ కు దగ్గరగా ఉండటం వల్ల రద్దీగా ఉండే వాణిజ్యం నగరం.
అక్కడ భవనాల్లో ఎక్కువ భాగం తక్కువ ఎత్తులో ఉన్న నిర్మాణాలు, ఎక్కువగా కాంక్రీట్, ఇటుకలతో నిర్మించబడ్డాయి. నగరం వెలుపల ఉన్న ప్రాంతాలలో మట్టి ఇటుకలు, కలపతో నిర్మించిన ఇళ్లు ఉన్నాయి.
ఇంతకుముందు అక్టోబర్ 7న 2023 ఆఫ్ఘనిస్తాన్ లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తరువాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ఆ విపత్తులో కనీసం 4 వేల మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వం అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి దాదాపు 1500 మంది మరణించినట్లు తెలిపింది. ఇటీవల కాలాల్లో ఆఫ్ఘనిస్తాన్ ను తాకిన అత్యంత ప్రాణాంతకమైన ప్రకృతి వైపరీత్యం ఇదే.
Next Story