పాలస్తీనా అనుకూల వ్యాసం రాసిన విద్యార్థిని సస్పెండ్ చేసిన ‘ఎంఐటీ’
హింసాత్మక ఘటనలకు పిలుపునిచ్చేలా ఉందన్న కాలేజీ యాజమాన్యం
అమెరికాలోని ప్రఖ్యాత ఎంఐటీలో చదువుతూ పాలస్తీనా అనుకూల వ్యాసం రాసిన భారత సంతతి విద్యార్థి ప్రహ్లాద్ అయ్యంగార్ పై యాజమాన్యం వేటు వేసింది. ఈ కథనాన్ని ప్రచురించిన పత్రికపై నిషేధం విధించింది. ఈ కథనం ఉద్రిక్తతలు పెంచేలా ఉందని యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) గత నెలలో కాలేజీ మ్యాగజైన్‌లో రాసిన పాలస్తీనా అనుకూల వ్యాసంపై భారతీయ సంతతికి చెందిన PhD స్కాలర్‌ని అతని కళాశాల క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది. అయ్యంగార్ రాసిన 'ఆన్ పసిఫిజం' అనే వ్యాసం హింసాత్మక ప్రతిఘటనకు నేరుగా పిలుపునివ్వలేదని, అయితే శాంతికాముక వ్యూహాలు పాలస్తీనా సమస్యకు పరిష్కారం కాదని పరోక్షంగా సాయుధ పోరే ఉత్తమ మార్గం అన్నట్లు పేర్కొన్నారని తెలిపారు.
హింసకు పిలుపు...
అయ్యంగార్ రాసిన వ్యాసంలో ప్రచురితమైన ఫోటోలు, పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా అనే ఉగ్రవాద సంస్థ లోగోలు అతను ఇవ్వలేదని ఆయన తరఫు న్యాయవాదీ తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ నన్ను 'ఉగ్రవాదానికి' మద్దతిస్తున్నట్లు ఆరోపించింది, ఎందుకంటే నా వ్యాసం కనిపించే ఎడిషన్‌లో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ నుంచి కొన్ని హింసాత్మక చిత్రాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే తాను ఇవ్వలేదని తెలిపారు.
ఈ ఉదంతంపై ఎంఐటీ డీన్ డేవిడ్ వారెన్ రాండాల్ పత్రిక విలేకరులకు సస్పెండ్ చేసిన నిర్ణయాన్ని ఈమెయిల్ చేశారు. ఎంఐటీలో మరింత విధ్వంసం, హింసాత్మక నిరసనలకు పిలుపునిచ్చేలా వ్యాసంలో భాషను ఉపయోగించారని కళాశాల భావిస్తోందని తెలిపారు. అందుకే సస్పెండ్ చేస్తోందని వెల్లడించారు.
అయ్యంగార్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగం నుంచి పీహెచ్‌డీని చదువుతున్నాడు, అయితే ఈ నిషేధం తరువాత ఐదేళ్ల నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాడ్యూయేట్ రీసెర్చ్ ఫెలోషిప్ రద్దయ్యే అవకాశం ఉంది.
అమెరికన్ క్యాంపస్‌లలో వాక్ స్వేచ్ఛ
సస్పెన్షన్‌పై స్పందించిన అయ్యంగార్, అమెరికా కాలేజీ క్యాంపస్ లో వాక్ స్వతంత్య్రానికి సంబంధించిన పెద్ద సమస్యను హైలైట్ చేస్తుందని అన్నారు. తన సస్పెన్షన్ ను అసాధారణ చర్య అని పేర్కొన్నారు.
" ఈ అసాధారణ చర్యలు క్యాంపస్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తాయి" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తనను బహిష్కరించడం, వ్యాసాన్ని నిషేధించడం విద్యార్థులపై దాడిగా పేర్కొన్నారు. అయ్యంగార్‌ను MIT సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, పాలస్తీనా అనుకూల ప్రదర్శనల కారణంగా అతను గత సంవత్సరం సస్పెండ్ అయ్యాడు.
ఆమోదయోగ్యం కాదు
ది బోస్టన్ గ్లోబ్‌లోని ఒక నివేదికలో, MIT గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవనోపాధి, వృత్తిని బెదిరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. నిరసన హక్కును తెలిపే కాలరాయడం సమంజసం కాదన్నారు. విద్యార్థి సస్పెండ్ కు నిరసనగా MIT నిర్ణయానికి వ్యతిరేకంగా MIT కోయలిషన్ ఎగైనెస్ట్ అపార్థీడ్ నిరసన ప్రారంభించింది. తనపై విధించిన అన్యాయమైన ఆంక్షలను తగ్గించాలని ప్రహ్లాద్ ఇప్పుడు ఛాన్సలర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story