మోదీకి తెలుసు.. నేను సంతోషంగా లేనని: ట్రంప్
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

మోదీకి తెలుసు.. నేను సంతోషంగా లేనని: ట్రంప్

భారత్ పై మరోసారి సుంకాల పెంచుతానన్న యూఎస్ ప్రెసిడెంట్


వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించిన విజయ గర్వంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నారు.

తాము ఎంత చెప్పిన వినకుండా రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుందని, అందుకు మరోసారి మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఆయన ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడారు.

‘‘వారు(భారత్) నన్ను సంతోష పెట్టాలని కోరుకున్నారు. నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ మంచి వ్యక్తి. కానీ నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోష పెట్టడం ముఖ్యం. వారు వ్యాపారం చేస్తారు. మనం వాటిపై సుంకాలు విధిస్తాం’’ అని ట్రంప్ అన్నారు.
రష్యా నుంచి చమురు కొనడం ఆపకపోతే వారిపై మేము సుంకాలు విధిస్తామని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో సుంకాలు పెంచుతామని ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేయడం గమనార్హం.
రెండు నెలల క్రితం భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాల విధించిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీతో తాను మాట్లాడానని, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తుందని తనకు హమీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.
అంతకుముందు అక్టోబర్ లో మాట్లాడుతూ.. ‘‘చమురు ఉండదు, ఆయన చమురు కొనడం లేదు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అసలు ట్రంప్ తో తాము అసలు మాట్లాడలేనేలేదని వెల్లడిచింది. భారత్ ఎప్పుడూ తన దేశీయ వినియోగదారుల అవసరాలు, మార్కెట్ డైనమిక్స్ ద్వారానే నిర్ణయం తీసుకుంటుందని తెలియజేసింది.
వ్యవసాయం, పాడి రంగాలు..
అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించేలా భారత్ ను ఒప్పించడానికి అమెరికా అనేక రకాల ఒత్తిడులు చేస్తోంది. భారత్, థాయిలాండ్, చైనా దేశాలు అమెరికాలోని బియ్యం డంపింగ్ చేస్తున్నాయని ఆ దేశ రైతు ప్రతినిధి ఫిర్యాదు చేసిన తరువాత ట్రంప్ బియ్యం ఎగుమతులపై కూడా కొత్త సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
‘‘భారత్ కు అనుమతి ఉందా? వారు సుంకాలు చెల్లించాలి. వారికి బియ్యం మినహయింపు ఉందా?’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. భారత్ తన వ్యవసాయ, పాడి పరిశ్రమలను రక్షించుకునే విధానంలో స్థిరంగా వ్యవహరిస్తోంది.
రష్యా చమురు..
రష్యా తన చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉక్రెయిన్ పై యుద్ధానికి ఇంధనంగా ఉపయోగిస్తున్నారని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. భారత్ చమురును తిరిగి అమ్మడం ద్వారా లాభం పొందుతోందని కూడా వారు ఆరోపించారు.
ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ముగించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలు విధించాడని వారు భావిస్తున్నారు. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత్, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
Read More
Next Story