వచ్చే వారం కజకిస్థాన్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకాకపోవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీకి సొంతంగా మెజారిటీ మార్క్ ను అందుకోలేక రాజకీయంగా బలహీనపడినందున ఇక్కడకు వెళ్లకపోవచ్చు.
ఈ నెలలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు కీలక పాశ్చాత్య దేశాల నేతలు పాల్గొన్న జీ7 ఔట్రీచ్ సమ్మిట్ కోసం మోదీ ఇటలీని సందర్శించారు. ఇక్కడే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ని కూడా ఆయన కలిశారు. అయితే స్విస్ లో నిర్వహించిన శాంతి సమావేశానికి మాత్రం ఆయన హజరు కాలేదు.
ఎందుకంటే ఇక్కడ జరిగిన సమావేశం పుతిన్ కు వ్యతిరేకంగా అభిప్రాయాలు కూడగడుతుందన్న సమాచారం మేరకు కేవలం ఓ అధికారిని మాత్రమే పంపారు. అయితే ఇంకా అధికారికంగా ఎస్ సీఓ సమావేశానికి మోదీ హజరు విషయంపై సమాచారం రానప్పటికీ దౌత్యవేత్తలు మాత్రం ధృవీకరించారు. బదులుగా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కజకిస్థాన్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.
అమెరికాను మచ్చిక చేసుకోవడానికేనా?
SCO సమ్మిట్‌కు దూరంగా ఉండాలని మోదీ తీసుకున్న నిర్ణయం వెనక బలమైన ఉద్దేశం ఉంది. ఇప్పుడు జరుగుతున్న సమావేశం నుంచి అమెరికా వ్యతిరేక ప్రకటనలు వస్తాయని న్యూఢిల్లీ అంచనా వేసింది. చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్, మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్ పాటు SCOలో తొమ్మిది సభ్యులు. బెలారస్ 10 వ సభ్యునిగా చేర్చుకునే అవకాశం ఉంది.
పుతిన్‌తో సమ్మిట్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి మోదీ జూలై 8న మాస్కోను సందర్శించనున్నారు. భారత ప్రధాని SCO సమ్మిట్‌కు హాజరుకాకపోవడానికి మరొక స్పష్టమైన కారణం ఉంది. అదే సమయానికి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఇందులో ప్రతిపక్షాల నుంచి కొన్ని విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటిపై ఆయన శ్రద్ధ వహించే అవకాశం ఉంది. గత రెండు దఫాలుగా కాకుండా, ఇప్పుడు మోదీ తక్కువ మెజారిటీతో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. దీంతో సభలో ప్రధాని హాజరు మునుపటి కంటే చాలా అవసరం. అయితే మోదీ కజకిస్థాన్‌కు వెళ్లకపోవడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
జిన్ పింగ్, షరీఫ్‌ను పక్కన పెట్టడం..
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను కలవకుండా ఉండాలనుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు, చైనా-భారత సంబంధాలను సాధారణీకరించాలని, సరిహద్దులో ఉద్రిక్తతను తగ్గించాలని 'న్యూస్‌వీక్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ సూచనప్రాయంగా చెప్పారు. పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడంతోపాటు మరింత సత్సంబంధాలను నెలకొల్పడం గురించి కూడా ఆయన మాట్లాడారు.
చైనా, పాకిస్థాన్‌పై పునరాలోచన..
అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత తన భారతీయ జనతా పార్టీకి (బిజెపి) సభలో తగినంత మెజారిటీ ఇవ్వకపోవడంతో పరిస్థితిని తిరిగి అంచనా వేసి మోదీ ఆలోచన మారినట్లు అనుకోవాలి. జూన్ 9న జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఇరు దేశాల నేతలను ఆహ్వానించనప్పుడు చైనా లేదా పాకిస్థాన్‌తో సంబంధాలు తెగిపోయే అవకాశం లేదని మోదీ సూచించారు. ఇప్పుడు చైనాతో చర్చలు ప్రారంభించడం వల్ల చైనా తన స్టాండ్ ను పటిష్టం చేసుకునే అవకాశం ఉందని భారత వ్యూహకర్తలు భావిస్తున్నారు.
మోదీ జాగ్రత్త
చైనా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి)లో పరిస్థితి సాధారణంగా మారుతుందని భారత్ ఇంతకుముందే చైనా స్పష్టం చేసింది. దీనికి తోడు ఈ మధ్య టిబెట్ అంశాన్ని కూడా భారత్ లేవనెత్తే అంశం కనిపిస్తోంది. పాకిస్తాన్ తో చర్చలు ప్రారంభించబడాలంటే మనదేశంలో ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరగకూడవద్దని న్యూఢిల్లీ ఇప్పటికే ఇస్లామాబాద్ తో స్పష్టం చేసింది. ఇంతకుముందు ప్రధానుల్ల కాకుండా మోదీ చైనా, పాకిస్తాన్ ల నుంచి స్పష్టమైన హమీ వచ్చే వరకూ ఆ దేశాలతో ఎలాంటి చర్చలు జరపడని అర్థమవుతోంది.
బలమైన ప్రతిపక్షం
సార్వత్రిక ఎన్నికల్లో మోదీకి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి. పార్లమెంట్ లో ప్రతిపక్షం బలం అనూహ్యంగా పెరిగింది. ఈ కారణంగా ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులు ఆగకపోవడం, చైనా సరిహద్దు నుంచి బలగాలను ఉపసంహరించుకోలేదు.
ఇప్పుడు మోదీ ఎస్ సీ ఓ లో ఈ దేశాలతో సమావేశం అయితే ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. ఇవి ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మోదీ ఇరకాటంలో పడినట్లు అవుతుంది. అందువల్ల కజకిస్తాన్ సమావేశానికి మోదీ వెళ్లకపోవచ్చు. అంతేకాదు, అమెరికాతో భారత్ సంబంధాలు స్థిరమైన వేగంతో పెరుగుతున్న తరుణంలో, అమెరికా విధానాలను చైనా, రష్యా తదితర దేశాలు మామూలుగా విమర్శించే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం మోదీకి ఇష్టం లేదు.
SCO అంటే ఏమిటి?
SCO అనేది యురేషియా రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ భద్రత, రక్షణ సంస్థ, దీనిని 2001లో చైనా, రష్యా ఏర్పాటు చేశాయి. తర్వాత ఇది కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్థాన్‌లతో కలిపి షాంఘై ఫైవ్‌గా మారింది. 2017లో భారత్, పాకిస్తాన్, 2023లో ఇరాన్ చేరాయి. ప్రస్తుతం ఇందులో సభ్య దేశాల సంఖ్య తొమ్మిదికి చేరింది.
జనాభా పరంగా SCO ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ సంస్థగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది యురేషియాలో దాదాపు 80 శాతం, ప్రపంచ జనాభాలో 40 శాతం మందిని కలిగి ఉంది.
SCOతో సంబంధాలను నిలుపుకోవడం..
2021 అంచనా ప్రకారం, ఈ కూటమి సంయుక్త GDP ప్రపంచ GDPలో 20 శాతానికి పైగా ఉంది. SCO పూర్తి సభ్యులే కాకుండా, అనేక దేశాలు సంస్థలో పరిశీలకులు, అతిథులు చర్చల్లో భాగస్వాములు. మోదీ SCO సమ్మిట్‌కు హాజరు కానప్పటికీ, ఫోరమ్‌లో దాని భాగస్వామ్యాన్ని పూర్తిగా డౌన్‌గ్రేడ్ చేయడం ఇష్టం లేదు.
SCO ప్రాముఖ్యత
SCO అనేది ఈ ప్రాంతంలో వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఉగ్రవాద వ్యతిరేకతపై అభిప్రాయాలు, సహకారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఒక ముఖ్యమైన వేదిక. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త పరిణామాల గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
అస్తానాలో SCO శిఖరాగ్ర సమావేశానికి ముందు, మోదీ కజకిస్తాన్ అధ్యక్షుడు కస్సిమ్-జోరట్ టోకాయేవ్‌తో మాట్లాడారు. SCOకి భారత్ స్థిరమైన మద్దతును ఇస్తుందని హమీ ఇచ్చారు. ఇది విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
భారత్.. అమెరికా, రష్యా కూటమిల మధ్య సమానంగా బ్యాలెన్స్ చేస్తోంది. భారత ప్రయోజనాలే పరమావధిగా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.