నిజ్జర్ హత్య లో మోదీ ప్రమేయం.. కెనడా పత్రిక తలబిరుసు కథనం
x

నిజ్జర్ హత్య లో మోదీ ప్రమేయం.. కెనడా పత్రిక తలబిరుసు కథనం

ఖలిస్తాన్ ఉగ్రవాది కెనడాలోని వాంకోవర్ లో గత ఏడాది హత్యకు గురయ్యాడు. ఈ కేసులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, అజిత్ దోవల్ కు..


కెనడాలో హత్యకు గురైన సిక్కు తీవ్రవాది హర్డిప్ సింగ్ నిజ్జర్ లో భారత ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు సంబంధం ఉందని, తమకు స్థానిక భద్రత అధికారులు ఈ విషయం చెప్పారని కెనడా పత్రిక సంచలన కథనం ప్రచురించింది. వాంకోవర్ లో గత ఏడాది నిజ్జర్ హత్య జరిగింది. దీనిపై గ్లోబ్ అండ్ మెయిల్ వార్తా పత్రిక గురువారం ఉదయం దీనిపై వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్త పై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కెనడా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. పత్రిక చేసిన ఆరోపణలను ఖండించింది. ఇది కేవలం ఊహజనిత కథనం, ఇందులో ఎటువంటి నిజం లేదని ప్రకటించింది. ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కు జాతీయ భద్రతా సలహదారుడిగా సేవలు అందిస్తున్న నథాలీ జీ డ్రౌయిన్, పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు అధికారులకు ఈ విషయం చెప్పారని అన్నారు. అయితే ఈ వాదనలను అట్టావా ఖండించింది. నిజ్జర్ హత్య విషయంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని పేర్కొంది.
హత్య విషయం భారత నాయకులకు తెలుసు: పత్రికా కథనం..
నిజ్జర్ హత్య చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ప్రధాని మోదీ, జైశంకర్ , అజిత్ దోవల్ కు ముందే తెలుసని ఆరోపించింది. దేశంలో జరుగుతున్న హింసాయుత పరిస్థితులు కారణం భారత్ అని కొందరు పోలీసు ఉన్నతాధికారులు తమకు చెప్పారని పేర్కొంది. అంతకుముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అతని మంత్రులు కూడా ఇలాంటి వితండ వాదనే చేశారు. కేవలం ఆరోపణలే కాకుండా ఆధారాలు ఇవ్వాలని కోరగా అక్కడి ప్రభుత్వం స్పందించలేదు.
భారత్ ఆగ్రహం..
ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని కెనడా పత్రికా వార్తా కథనాన్ని ప్రచురించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి హస్యాస్పద ప్రకటనలు సరికాదంది. ‘‘ కెనడియన్ వార్తాపత్రికలు ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం ఇలాంటి కథనాలను ప్రచురిస్తున్నాయని చెబుతున్నారు. కెనడా ప్రభుత్వం ఈ కథనాన్ని తోసిపుచ్చుతోంది. ఇలాంటి వార్తలు ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత దెబ్బతీస్తాయి’’ అని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
కెనడా ప్రధాని నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే భారత హై కమీషనర్ సంజయ్ వర్మ ఇతర సిబ్బందిని వెనక్కి పిలిపించింది. తరువాత కెనడా వీరిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అట్టావా బుద్ది చెప్పడానికి భారత్ కూడా కెనడా దౌత్యవేత్తలలో కొందరి దేశం నుంచి బహిష్కరించింది. నిజ్జర్ హత్య కేసుకు కెనడా ఇప్పటి వరకూ ఒక్క ఆధారం కూడా అందించలేదు.
Read More
Next Story